👉ఇటీవలి కరోనా కాలంలో కూడా ఆ దేశంలో ఒక్క కేసు కూడా రాకుండా జాగ్రత్తపడ్డారు. అన్ని విషయాలలోనూ కొత్తగా ఆలోచిస్తారు ఆ దేశీయులు.
👉 ఏ ఆసరా లేని వృద్ధుల గురించి ఒక కొత్త పథకం ప్రవేశపెట్టారు. అదే ‘టైమ్ బ్యాంక్ ’ స్కీమ్.
👉 ఒంటరిగా, కుటుంబ సభ్యుల సహకారం లేకుండా నివసిస్తున్న సీనియర్ సిటిజెన్లకు అండగా నిలబడటానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
👉 స్విట్జర్లాండ్‌లో ఉండే వారు ఎవరినా చిన్న పాటి ఉద్యోగం చేసిన వారు చరమాంకం లో తనకొచ్చే పెన్షన్‌తో వారు హాయిగా కాలం గడపవచ్చు.
👉 కాని ఖాళీగా కూర్చోవటానికి ఇష్టపడలేని వారికి పనికొచ్చే టైం బ్యాంకు.
👉టైమ్ బ్యాంక్‌ను స్విట్జర్లాండ్‌లోని ప్రభుత్వ సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. అక్కడి ప్రజలు యవ్వనంలో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు... నిస్సహాయులైన వృద్ధులకు సేవలందిస్తూ, సమయాన్ని దాచుకొని, తిరిగి వారికి అవసరంలో ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు, ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తుదారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. చక్కగా మాట్లాడే సంభాషణ నైపుణ్యం ఉండాలి.
👉 ప్రతిరోజు వారి సేవలను కోరుకునే వారికి కావలసిన సేవలు అందించగలిగే స్థితిలో ఉండాలి. వారి సేవాకాలాన్ని వారి వ్యక్తిగత ఖాతాలో ‘సామాజిక భద్రత మంత్రిత్వశాఖ’ జమ చేస్తుంది.
👉 ఎన్ని గంటల చొప్పున వృద్ధులకు సేవలు అందించటానికి వెళ్లేవారు అనే దాన్ని బట్టి మీ బ్యాంకు లో మీకు అంత టైం సేవ చేయించుకొనే దానికి వినియోగించుకోవచ్చు.
👉 పనులు ఎలా ఉంటాయంటే వారి గదుల్ని శుభ్రం చేయటం, వారికి కావలసిన సరుకులు తేవటం, వారికి ఎండలో స్నానం చేయటానికి సహకరించటం వంటి పనులకు సహాయపడేవారు.. కొద్దిసేపు వారితో సరదాగా ముచ్చటించటానికి సమయం కేటాయించాలీ. వారు దరఖాస్తులో చేసుకున్న ఒప్పందం ప్రకారం. సంవత్సరం తర్వాత ‘టైమ్ బ్యాంక్’ వారు ఆమె సేవాకాలాన్ని లెక్కించి, ‘టైమ్ బ్యాంక్ కార్డు’ జారీ చేస్తుంది.
👉 వారికి ఇతరుల సహాయం అవసరం ఉన్నపుడు తన కార్డును ఉపయోగించుకోవచ్చు.
👉 ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఉంది. బ్యాంకులో డబ్బులు దాచుకుంటే వడ్డీ వచ్చినట్లుగానే, ఖాతాలో ఉన్న సమయాన్ని వడ్డీతో సహా తిరిగి వాడుకోవచ్చు. దరఖాస్తును పరిశీలించి, టైమ్ బ్యాంక్ ఒక వాలంటీర్‌ను ఆమె ఇంటికి గానీ, ఆస్పత్రికి గానీ పంపుతారు.
0 Comments