👉 సామాజిక మాధ్యమాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు వెలువరించింది. ట్విటర్, వాట్సప్, ఫేస్‌బుక్, ఒటిటి సంస్థలు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే చట్ట రీత్యా చర్యలు తప్పవని హుంకరించింది.
👉సోషల్ మీడియా వంటి విస్తృత ప్రజా భాగస్వామ్య అంశాలపై ఆయా సంస్థలు, సంఘాలు, రాజకీయ పార్టీలతో చర్చలు, సంప్రదింపులు జరిపి సూచనలు తీసుకొని ఉభయ తారకంగా అంతిమ నిర్ణయాలు చేయడం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల బాధ్యత.
👉 పాలనాపరమైన ఉత్తర్వుల ద్వారా సోషల్ మీడియా నియంత్రణ నిబంధనలను ప్రకటించింది.
👉2018లో రాజ్యసభ కమిటీల చర్చను, అప్పటి ముసాయిదాను ఇప్పుడు ఉటంకించి సంప్రదింపులు జరిపి ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయ ధోరణితో వెలువరిచింది.
👉 సోషల్ మీడియా అనేది స్వతంత్ర వ్యవస్థ. ఎవరి విధానాలపైన అయిన నిరసనలను, అసమ్మతి అసంతృప్తులను తెలపడానికి ఒక సాదనం గా ఉపయిగిస్తారు.
👉 కొత్త నియమావళి ప్రకారం..ఎలా ??
👉దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగించే వ్యాఖ్యలను 24 గంటల్లో తొలగించడంతో పాటు.. వాటిని మొదటిగా చేసిన వ్యక్తి ఎవరో గుర్తించాల్సిన బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే.
👉అలాగే, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీలను నియంత్రించే నిబంధనలను కూడా కేంద్రం రూపొందించింది. డిజిటల్ మీడియాలో పారదర్శకత, జవాబుదారీ తనం లోపించడం.. వినియోగదారుల హక్కులపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సంబంధిత వర్గాలన్నింటితో చర్చలు జరిపి ఈ నియమావళిని రూపొందించినట్టు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావడేకర్ తెలిపారు.
👉సోషల్ మీడియా సంస్థలు భారత దేశంలో వ్యాపారం చేయడాన్ని, లాభాలు ఆర్జించడాన్ని స్వాగతిస్తాం. కానీ, ఆయా సంస్థలు రాజ్యాంగాన్ని, మన దేశ చట్టాలను గౌరవించాలి.
👉సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు.. సాధారణ వినియోగదారులకు తమ సృజనాత్మకతను ప్రదర్శించుకునే, ప్రశ్నించే, తమ అభిప్రాయాలను పంచుకునే, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వ్యవస్థలను విమర్శించే అవకాశాన్ని వారికిచ్చాయి.
👉 అయితే, ఈ క్రమంలో ఆయా ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే. సోషల్ మీడియాను వాడుకునే సాధారణ వినియోగదారులకు ఈ కొత్త నిబంధనలు సాధికారతనిస్తాయి.
👉వారి ఫిర్యాదులను పట్టించుకుని సకాలంలో పరిష్కరించే ఒక వ్యవస్థను రూపొందిస్తాయి.
👉 కొత్త నియమావళి ప్రకారం కేంద్రం సామాజిక మాధ్యమాలను.. వాటి వినియోగదారుల సంఖ్య ఆధారంగా రెండు రకాలుగా విభజించింది.
👉తక్కువ వినియోగదారులున్న వాటిని సాధారణ సామాజిక మాధ్యమాలుగా, ఎక్కువ వినియోగదారులున్నవాటిని ప్రముఖ సామాజిక మాధ్యమాలుగా పరిగణిస్తామని పేర్కొంది. రెండు రకాల మాధ్యమాలూ నిబంధనలను పాటించాలి.
👉ప్రముఖ సామాజిక మాధ్యమాలు అదనంగా మరిన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
👉 రెండు రకాల మాధ్యమాలూ పాటించాల్సిన నిబంధనలు..
👉 అన్ని రకాల సామాజిక మాధ్యమాలూ తమతమ ప్లాట్‌ఫామ్‌లపై పోస్ట్ అయ్యే సమాచారం విషయంలో జాగరూకతతో ఉండాలి.
👉 ఐటీ చట్టం ప్రకారం సామాజిక మాధ్యమాలకు కొన్ని ‘సేఫ్ హార్బర్ ప్రొవిజన్లు’ ఉంటాయి. అంటే.. ఆయా ప్లాట్‌ఫామ్‌లపై వినియోగదారులు చేసే పోస్టుల బాధ్యత సోషల్ మీడియా సంస్థలకు ఉండదు. ఇక నుంచి అలా కుదరదు.
👉 జాగ్రత్తగా ఉండకపోతే సేఫ్ హార్బర్ ప్రొవిజన్ వాటికి వర్తించదు.
👉వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి సోషల్ మీడియా సంస్థలు ఒక అధికారిని నియమించాలి.
👉 ఆ అధికారి పేరు, వివరాలు అందుబాటులో ఉంచాలి.
👉 ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా అధికారి ఆ విషయాన్ని వారికి తెలియజేయాలి.
👉 15 రోజుల్లోగా పరిష్కరించాలి.
👉 సోషల్ మీడియా వినియోగదారుల.. ముఖ్యంగా మహిళా యూజర్ల ఆన్‌లైన్ భద్రతను, గౌరవాన్ని కాపాడాలి.
👉ఫిర్యాదులు వచ్చిన 24 గంటల్లోగా వారిని ఇబ్బంది పెట్టే కంటెంట్‌ను, వారి రహస్య అవయవాలను బహిర్గతం చేసే చిత్రాలు, శృంగారంలో పాల్గొనే దృశ్యాలు, మార్ఫింగ్ చిత్రాలు ఉంటే తొలగించాలి.
👉 ‘అదనపు’ జాగ్రత్తలు..ఏమిటి ??
👉 కేంద్రం విభజించిన ప్రకారం ‘ప్రముఖ సామాజిక మాధ్యమాల’కు మరికొన్ని అదనపు బాధ్యతలు ఇవి..
👉సోషల్ మీడియా సంస్థలు చట్టాలు, నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూడడం కోసం ‘చీఫ్ కంప్లయన్స్ అధికారి’ని నియమించాలి.
👉పోలీసులు, సీబీఐ వంటి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు 24 గంటలూ అందుబాటులో ఉండేలా ‘నోడల్ కాంటాక్ట్ పర్సన్’ను నియమించాలి.
👉 ఫిర్యాదుల పరిష్కారాల కోసం రెసిడెంట్ గ్రీవన్స్ అధికారిని నియమించాలి. వీరంతా భారత్‌లో నివసించేవారై ఉండాలి.
👉 అందుకున్న ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలతోపాటు.. ఫిర్యాదులు రాకముందే తొలగించిన కంటెంట్ తాలూకూ వివరాలతో ప్రతి నెలా సవివరమైన నివేదికను సామాజిక మాధ్యమాలు ప్రచురించాలి.
👉దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి, భద్రతకు సంబంధించిన.. విదేశాలతో సత్సంబంధాలను దెబ్బతీసే.. అత్యాచారం, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన.. కంటెంట్‌ను ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశించిన 24 గంటల్లో తొలగించాలి.
👉 వాటిని సామాజిక మాధ్యమాల్లో తొలిసారి పోస్ట్ చేసిన వ్యక్తి ఎవరో గుర్తించాలి. ఇది మెసేజింగ్ రూపంలో సేవలు అందించే ప్రముఖ సామాజిక మాధ్యమాలకు ముఖ్యం గా వర్తిస్తుంది (అంటే.. వాట్సాప్ వంటివాటికి. నిజానికి వాట్సాప్ సామాజిక మాధ్యమం కాదు.
👉మెసేజింగ్ యాప్ మాత్రమే. కానీ, వాట్సాప్ ద్వారా దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిబంధన పెట్టారు).
👉 దర్యాప్తు సంస్థల నుంచి లిఖితపూర్వక అభ్యర్థన వస్తే.. వారు అడిగిన సమాచారాన్ని 72 గంటల్లోగా సమర్పించాలి.
👉ఆ రికార్డులను దర్యాప్తు నిమిత్తం 180 రోజులు దాచి ఉంచాలి. ప్రముఖ సామాజిక సంస్థలు భారతదేశంలో తమ కార్యాలయం చిరునామాను వెబ్‌సైట్‌లో, యాప్‌లో తప్పనిసరిగా ఇవ్వాలి.
👉తమ ఖాతాలను ధ్రువీకరించడానికి సిద్ధమయ్యే వారికోసం ‘వాలంటరీ యూజర్ వెరిఫికేషన్ మెకానిజమ్’ను రూపొందించాలి.
👉వినియోగదారులు చేసిన పోస్టును తొలగించే ముందు.. వారి వాదన చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. అయినప్పటికీ ఆ సమాచారాన్ని తొలగించాలనుకుంటే ఆ విషయాన్ని వారికి ముందు గా తెలపాలి.
👉దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగించే.. విదేశాలతో సత్సంబంధాలను దెబ్బతీసే అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలంటూ కోర్టు ఆదేశించినప్పుడు.. ప్రభుత్వ వ్యవస్థలు కోరినప్పుడు అలాంటి నిషేధిత సమాచారాన్ని తొలగించాలి. సామాజిక మాధ్యమాలకు సంబంధించిన నిబంధనలు గెజెట్‌లో ప్రచురితమైనప్పటి నుంచి అమల్లోకి వస్తాయి.
👉ప్రముఖ సామాజిక మాధ్యమాలు అదనంగా పాటించాల్సిన నిబంధనలు గెజెట్‌లో ప్రచురితమైన 3 నెలల తర్వాత అమల్లోకి వస్తాయి.
👉 డిజిటల్ మీడియా నిబంధనలు..
👉 డిజిటల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణకు రూపొందించిన ఎథిక్స్ కోడ్ ప్రకారం..
👉ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు తాము ప్రసారం చేసే కంటెంట్‌ను వయసు ఆధారంగా ఐదు కేటగిరీలుగా విభజించాలి.
👉అవి.. అన్ని వయసులవారూ చూడదగ్గవి (యు), ఏడేళ్లు, అంతకుమించి వయసున్నవారు చూడగలిగే యూఏ 7+ చిత్రాలు, యూఏ 13+, యూఏ 16+, పెద్దలే చూడాల్సిన ఏ కేటగిరీ.
👉ఇంట్లో పిల్లలు చూడకుండా చేసే పేరెంటల్ లాక్‌ను, వయసు ధ్రువీకరించుకునే విధానాలను అందుబాటులోకి తేవాలి.
👉ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్ పబ్లిషర్లు (వివిధ సోర్సుల నుంచి సేకరించిన సమాచారానికి తమదైన వ్యాఖ్యానాన్ని జోడించి తమ యూట్యూబ్ చానల్ ద్వారానో, ఫేస్‌బుక్ ఖాతా ద్వారానో ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేసేవారు) ఆ కంటెంట్ ఏ విభాగంలోకి వస్తుందో ముందే తెలపాలి.
👉నిర్ణీత వయసులవారు మాత్రమే వాటిని చూడాలనే సూచన ముందుగానే చేయాలి. డిజిటల్ మీడియా పబ్లిషర్లు.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలను పాటించాలి. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
0 Comments