H5N8 మనుషులకు సోకింది

  • ఏమిటి : బర్డ్ ఫ్లూ వైరస్ హెచ్5ఎన్8 మనుషులకు సోకినది.
  • ఎప్పుడు : ఫిబ్రవరి 20 ౨౦౨౧
  • ఎవరు : హెచ్5ఎన్8 రకం
  • ఎక్కడ : రష్యాలో
  • ఎందుకు : బర్డ్ ఫ్లూ వలన ప్రాణహాని కలగకుండా చుసుకోనేందుకు

✌బర్డ్ ఫ్లూ వైరస్ హెచ్5ఎన్8 మనుషులకు సోకిన తొలి కేసును రష్యా గుర్తించింది. ఇది పౌల్ట్రీ (పెంపుడు కోళ్లు వంటి పక్షులు) నుంచి మనుషులకు సోకింది.


దేశంలోని దక్షిణ ప్రాంతంలో గల ఒక పౌల్ట్రీ ప్లాంట్‌లో గత డిసెంబర్‌లో బర్డ్ ఫ్లూ వ్యాపించిందని.. అందులో పని చేసే ఏడుగురు కార్మికులకు ఈ బర్డ్ ఫ్లూ సోకిందని అధికారులు చెప్పారు.ఆ ఏడుగురూ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు అని రష్యా వినియోగదారుల ఆరోగ్య పర్యవేక్షణ సంస్థ తెలిపింది.

✌అంతే కాకుండా  ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్న సంకేతాలు లేవని తెలిపింది . ఈ బర్డ్ ఫ్లూ కేసుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించామని తెలిపారు.

✌రష్యాకు చెందిన వెక్టార్ లేబరేటరీ.. బర్డ్ ఫ్లూ సోకిన కార్మికుల నుంచి సేకరించిన వైరస్ జన్యు పదార్థాన్ని విజయవంతంగా వేరు చేసింది.  

✌ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే సామర్థ్యాన్ని ఇంకా సంతరించుకోలేదు.

✌ఈ మ్యుటేషన్లను గుర్తించటం.. మున్ముందు రాగల మ్యుటేషన్లను తగినవిధంగా ఎదుర్కోవటానికి, సమయానికి ప్రతిస్పందించటానికి ప్రపంచం సిద్దం అవుతుంది .

✌ఈ వైరస్‌ సోకితే గుర్తించటానికి అవసరమైన పరీక్షా వ్యవస్థలను తయారు చేయటంపై రష్యా శాస్త్రవేత్తలు ఇప్పుడు కృషి మొదలు పెట్టింది.

బర్డ్ ఫ్లూ ఇతర రకాలు అప్పుడప్పుడు మనుషులకు సోకుతుంటాయి. మరణాలకు కూడా దారితీస్తాయి. అయితే.. హెచ్5ఎన్8 రకం మనుషులకు సోకినట్లు గుర్తించటం ఇదే తొలిసారి.

✌ సాదరంగా కోళ్లలో వ్యాపించే ఈవ్యాధి 2 రకాలు గా వ్యాధి లక్షనాలు ప్రకోపించవచ్చు.

  • ఈ వైరస్ కొద్ది స్థాయిలో సోకినపుడు కోళ్ల ఈకలు చెల్లా చెదురైనట్లు కనిపిస్తాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది .
  • ఈ వైరస్ తీవ్రముగా సోకినపుడు కోడి వివిధ శరీర అవయవాలు దెబ్బతిని 48 గంటలలో చనిపోతుంది.

✌ కోళ్లు జారవిడిచే సొంగ ద్వారా ఈ వ్యాధి ఒక కోడి నుండి మరొక కోడికి త్వరితముగా వ్యాపిస్తుంది. అలాగే కోడి రెట్టలద్వారా కూడా ఈవ్యాధి వ్యాపిస్తుంది. చాలా అడవి పక్షులలో ఈవ్యాధి క్రిములు పేగులలో ఉండవచ్చును. 

✌ కాని దీప్రభావము వెంటనే కనిపించదు. ఈ పేగులు ఈ వైరస్ కి రిజర్వాయర్ గా ఉంటాయి. ఈ పేగులే ఇతర పక్షిజాతులకు ఈ వ్యాధి సోకడానికి వాహకాలుగా పనిచేస్తాయి.

మనుషులకు సోకే ఫ్లూ వ్యాధి కూడా ఈ రకానికి చెందినదే. మనుషులకు సోకే వైరస్ లకు, కోళ్లకు సోకే వైరస్ లకు కొన్ని తేడాలు ఉన్నాయి

మనుషులకు 'హెచ్1ఎన్1', 'హెచ్1ఎన్2', 'హెచ్3ఎన్2' వైరస్ లు సోకుతాయి. కోళ్లకు 'హెచ్5ఎన్1' వైరస్ సోకుతుంది. 

కోళ్లకు సోకే వైరస్ అసాధారణ పరిస్థితులలో మాత్రమే మనుషులకు సోకుతుంది. అయితే ఈవైరస్ లు త్వరితముగా రూపాంతరము చెందే శక్తి కలిగి ఉంటాయి. అందువలన మానవ జాతికి మొదట నుండి ఈ వైరస్ అంటే భయమే

1918 లో స్పానిష్ ఫ్లూ మహమ్మారిలా సోకినపుడు ప్రపంచవ్యాప్తముగా 4కోట్లు మంది మరణించారు. బర్ద్ ఫ్లూ కూడా అదేవిదముగా రూపాంతరము చెంది మానువులకు హాని కలిగింస్తుందేమోనని శాస్త్రవేత్తలు నిరంతరము నిఘాతో ఉంటూ ఉంటున్నారు. లేదంటే మానవ జాతిలో 25 - 30 శాతము ప్రజలకు దీని ప్రభావము చూపే అవకాశం ఉంటుంది.

బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ ఫ్లూయంజా అని ఆంగ్లములో వ్యవహరిస్తారు. ఈవ్యాధి కోళ్లు, బాతులు, ఇతర పక్షిజాతులకు ఒక దాని నుంచి ఒకదానికి త్వరితంగా వ్యాపిస్తుంది.'హెచ్5ఎన్1' (H5N1) అనే వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది.



Post a Comment

0 Comments

Close Menu