ఫాల్ట్‌ పరిహార ప్రణాళిక కింద పరిహారం WHO

 

  • ఏమిటి : ఫాల్ట్‌ పరిహార ప్రణాళిక కింద పరిహారం చెల్లించేందుకు డబ్ల్యుహెచ్‌ఒ అంగీకరించింది
  • ఎప్పుడు : జూన్‌ 30, 2022వరకు
  • ఎవరు : ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • ఎక్కడ : పేద దేశాలలో  
  • ఎందుకు : 92 పేద దేశాలకు వ్యాక్సిన్‌ ఉచితంగా పంపుతున్న నేపధ్యంలో

👉అంతర్జాతీయ కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం ద్వారా 'కొవాక్స్‌' ను ప్రపంచ ఆరోగ్య సంస్థ 92పేద దేశాలకు వ్యాక్సిన్‌ ఉచితంగా పంపిణీ చేస్తోంది.

👉 అయితే ఈ వ్యాక్సిన్‌ కారణంగా దుష్పరిణామాలు తలెత్తితే నోఫాల్ట్‌ పరిహార ప్రణాళిక కింద పరిహారం చెల్లించేందుకు డబ్ల్యుహెచ్‌ఒ అంగీకరించింది.

👉ఇది కొవిడ్‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో అమలు కానున్న ఏకైక నష్ట పరిహార కార్యక్రమం, అలాగే అలాగే అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే మొదటి, ఏకైక వ్యాక్సిన్‌ దుష్పరిణామాల పరిహార యంత్రాంగం ఇదేనని డబ్ల్యుహెచ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

👉అర్హులందరికీ వేగవంతమైన, సముచితమైన, ఆరోగ్యవంతమైన, పారదర్శకమైన న్యాయం అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొంది.

👉 భారత్‌తో సహా పలు ఆఫ్రికా, ఆగేయాసియా దేశాలు కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.

👉ఈ పథకం ద్వారా టీకాలను ఉచితంగానే అందిస్తున్నప్పటికీ.. వాటి వల్ల కలిగే దుష్పరిణామాలకు ఎవరు భాద్యులంటూ పలు విమర్శలు వెల్లువెత్తాయి.

👉మరోవైపు ఈ ఫిర్యాదులను ఏ విధంగా పరిష్కరించాలనేది ఆయా ప్రభుత్వాలకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది.

👉 ఈ కార్యక్రమాన్ని అనుసరించి కొవాక్స్‌ పథకం కింద టీకా తీసుకున్న వారిలో ఎక్కువ దుష్పరిణామాలు తలెత్తితే న్యాయస్థానం, ఫిర్యాదులు తదితర విధానాలతో నిమిత్తం లేకుండా అర్హులకు వెంటనే పరిహారం చెల్లిస్తారు.

👉కరోనా వ్యాక్సిన్‌ పరిహారానికి పరిహారానికి సంబంధించిన దరఖాస్తులు మార్చి 31నుంచి అందుబాటులో ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా, వెసులుబాటు జూన్‌ 30, 2022 వరకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

👉 ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization)

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్య రాజ్య సమితి సహకారంతో నడిచే ఈ సంస్థ 1948 ఏప్రిల్ 7న స్థాపించబడింది.
  • ప్రధాన కార్యాలయం: జెనీవా, స్విట్జర్లాండ్
  • ముఖ్య అధికారి: టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్
  • స్థాపించబడింది: 7ఏప్రిల్, 1948
  • కస్టమర్ సేవ నెంబర్ : 011 6656 4800
  • మాతృ సంస్థ: యునైటెడ్ నేష‌న్స్ ఎక‌నామిక్ అండ్ సోషియ‌ల్ కౌన్సిల్‌

Post a Comment

0 Comments

Close Menu