👉 లింగ సమానత్వ నివేదిక .... అధమ దేశాల్లో భారత్ (140)

 

👉ఏమిటి : లింగ సమానత్వ నివేదికలో భారత ర్యాంకు గణనీయంగా దిగజారింది.

👉 ఎప్పుడు : మార్చి 31 ౨౦౨౧  

 👉 ఎవరు : ప్రపంచ ఆర్థిక వేదిక

 👉ఎక్కడ : 156 దేశాల్లో    

👉ఎందుకు: 156 దేశాల్లో పరిస్థితుల్ని అధ్యయనం చేసి రూపొందించిన జాబితాలో భారత్ 140వ స్థానంలో నిలిచింది.గతేడాదితో పోలిస్తే 28 ర్యాంకులు పతనమైంది.

 

👉ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించిన లింగ సమానత్వ నివేదికలో భారత ర్యాంకు గణనీయంగా దిగజారింది.

👉156 దేశాల్లో పరిస్థితుల్ని అధ్యయనం చేసి రూపొందించిన జాబితాలో భారత్ 140వ స్థానంలో నిలిచింది.గతేడాదితో పోలిస్తే 28 ర్యాంకులు పతనమైంది.

👉ఇప్పటివరకు భారత్ 62.5 శాతం లింగ భేదాన్ని రూపుమాపగలిగిందని నివేదిక తెలిపింది.

👉2020లో 153 దేశాల జాబితాలో భారత్ 112వ స్థానం దక్కించుకుందని గుర్తు చేసింది.

👉తగ్గిన మంత్రుల సంఖ్యరాజకీయ సాధికారత విభాగంలో లింగ భేదం భారీగా పెరిగిందని నివేదిక పేర్కొంది.

👉2019లో మహిళా మంత్రుల సంఖ్య 23.1 శాతంగా ఉంటే.. 2021 నాటికి అది 9.1 శాతానికి తగ్గిందని వివరించింది.

👉కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పడిపోయిందని తెలిపింది. సీనియర్, మేనేజ్​మెంట్ స్థాయిల్లో మహిళల సంఖ్య తగ్గిందని వెల్లడించింది. ఈ క్షీణత మహిళల శ్రామిక శక్తి పాల్గొనే రేటు 24.8 శాతం నుండి 22.3 శాతానికి తగ్గింది. అదనంగా, వృత్తిపరమైన మరియు సాంకేతిక పాత్రలలో మహిళల వాటా 29.2 శాతానికి తగ్గింది.

👉సీనియర్ మరియు మేనేజిరియల్ స్థానాల్లోని మహిళలు కూడా తక్కువగా ఉన్నారు: ఈ పదవులలో కేవలం 14.6 శాతం మాత్రమే మహిళలు కలిగి ఉన్నారు మరియు మహిళా టాప్ మేనేజర్లతో 8.9 శాతం సంస్థలు మాత్రమే ఉన్నాయి.

👉పురుషులు వేతనంలో మహిళలు ఐదో వంతు మాత్రమే సంపాదిస్తున్నారని పేర్కొంది. ఈ విభాగంలో పది అధమ దేశాల్లో భారత్ ఒకటని వివరించింది.

👉విద్యలో మెరుగుభారతదేశ లింగ నిష్పత్తి(వెయ్యి మంది పురుషులకు ఉండే మహిళల సంఖ్య)లోనూ అంతరాలు తీవ్రంగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

👉నలుగురు మహిళల్లో ఒకరు ఆత్మీయుల నుంచే హింస ఎదుర్కొంటున్నారని తెలిపింది. అయితే, విద్య సంబంధిత విభాగంలో లింగ భేదాన్ని భారత్ దాదాపుగా నివారించినట్లు స్పష్టం చేసింది.

👉ప్రాథమిక, మాధ్యమిక విద్యా విధానం ద్వారా 96.2 శాతం లింగ భేదం తొలగిపోయినట్లు వివరించింది.

👉పొరుగుదేశాల్లో మనమెక్కడ ఉన్నాం అని చూస్తే దక్షిణాసియాలో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మాత్రమే భారత్​ కన్నా తక్కువ ర్యాంకుల్లో ఉన్నాయి.

👉పొరుగుదేశాలైన బంగ్లాదేశ్ 65, నేపాల్ 106, శ్రీలంక 116, భూటాన్ 130 స్థానాలనుదక్కించుకోగా.. పాకిస్థాన్ 153, అఫ్గానిస్థాన్ 156వ ర్యాంకుల్లో నిలిచాయి.

👉 గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ గురించి :

👉 ఇది మొట్టమొదట 2006 లో WEF చే ప్రచురించబడింది.

👉ఇది 156 దేశాలను లింగ సమానత్వం వైపు నాలుగు కోణాలలో బెంచ్ మార్క్ చేస్తుంది:

  • 👉 ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశం,
  • 👉 విద్యా సంబంధమైన నైపుణ్యం,
  • 👉ఆరోగ్యం మరియు మనుగడ 
  • 👉 రాజకీయ సాధికారత అంశాలను చూస్తుంది.

👉 సూచికలో, సాధ్యమైనంత ఎక్కువ స్కోరు 1 (సమానత్వం) మరియు సాధ్యమైనంత తక్కువ స్కోరు 0 (అసమానత).

లక్ష్యం:

👉ఆరోగ్యం, విద్య, ఆర్థిక వ్యవస్థ మరియు రాజకీయాలపై మహిళలు మరియు పురుషుల మధ్య సాపేక్ష అంతరాలపై పురోగతిని తెలుసుకోవడానికి దిక్సూచిగా పనిచేయడం. ఈ వార్షిక యార్డ్ స్టిక్ ద్వారా, ప్రతి దేశంలోని వాటాదారులు ప్రతి నిర్దిష్ట ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక సందర్భంలో సంబంధిత ప్రాధాన్యతలను సెట్ చేయగలరు

👉 ప్రపంచ ఆర్థిక వేదిక

  • ప్రధాన కార్యాలయం: కొలోనీ, స్విట్జర్లాండ్
  • స్థాపకులు: క్లౌస్ ష్వాబ్
  • స్థాపించబడింది: జనవరి 1971
  • నాయకుడు: క్లౌస్ ష్వాబ్
  • ప్రయోజనం: అంతర్జాతీయ సంస్థ for ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం
  • నినాదం: Committed to improving the state of the world

Post a Comment

0 Comments

Close Menu