👉 ఇండియా స్కిల్‌ రిపోర్టు–2021 ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు

 👉 ఏమిటి : ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న ప్రాంతాలు

 👉 ఎప్పుడు :  ౨౦౨౧

 👉 ఎవరు : ఇండియా స్కిల్‌ రిపోర్టు–2021

 👉 ఎక్కడ : భారత్ లో   

 👉 ఎందుకు : ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు

 


👉 2021 ఏడాదిలో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్తాన్‌ మొదటి స్థానంలో ఉండనుంది.

 👉 రాజస్తాన్‌ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉండనుంది.

 👉 వీబాక్స్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) కలసి దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి రూపొందించిన ‘‘ఇండియా స్కిల్‌ రిపోర్టు–2021’’లో ఈ విషయం వెల్లడైంది.

👉ఈ సర్వేలోని వివరాల ప్రకారం... పట్టణాల పరంగా ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న వాటిల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో.. బెంగళూరు రెండో స్థానంలో ఉంది.

 👉 బెంగళూరు తర్వాత వరుసగా... కోయంబత్తూరు, ఈరోడ్, లక్నో నగరాలు ఉన్నాయి.

నివేదికలోని ముఖ్యాంశాలు

 👉 దేశవ్యాప్తంగా 2020లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు 41.25శాతం ఉంటే 2021లో 46.8శాతానికి పెరగనున్నారు.

 👉 2021లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన పురుషులు 45.91శాతం మాత్రమే ఉంటారు.

 👉 వివిధ రంగాల్లో పనిచేస్తున్న పురుషులు 2020లో 77శాతం మంది ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 64శాతానికి తగ్గింది.

 👉 2020లో ఉద్యోగం చేసే మహిళలు 23శాతం మంది ఉంటే 2021ఏడాది వారి సంఖ్య 36శాతానికి పెరిగింది.

Post a Comment

0 Comments

Close Menu