👉 259 పాఠశాలల గుర్తింపు రద్దు

 

👉ఏమిటి : 259 ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల గుర్తింపును రద్దు

👉 ఎప్పుడు : ఇటివల

👉 ఎవరు : ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి

👉 ఎక్కడ : ఆంధ్ర  

👉 ఎందుకు : రాష్ట్ర వ్యాప్తంగా రెన్యూవల్‌ చేసుకోని .... వీటికి సంబంధించి 2019-20 విద్యా సంవత్సరంలోనే గుర్తింపు గడువు ముగిసిందని, రెన్యూవల్‌ చేసుకోని కారణంగా వాటి గుర్తింపును రద్దు చేస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేశారు.

👉 రాష్ట్ర వ్యాప్తంగా రెన్యూవల్‌ చేసుకోని 259 ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

👉 వీటికి సంబంధించి 2019-20 విద్యా సంవత్సరంలోనే గుర్తింపు గడువు ముగిసిందని, రెన్యూవల్‌ చేసుకోని కారణంగా వాటి గుర్తింపును రద్దు చేస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేశారు.

👉అంతేకాకుండా, సదరు పాఠశాలల్లో వసతుల కల్పనపై పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు.

👉 దీంతో 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలల గుర్తింపును ప్రభుత్వం నిలిపివేసిందని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా పాఠశాలల ఆన్‌లైన్‌ నామినల్‌ రోల్స్‌ను స్వీకరించబోమని స్పష్టం చేశారు.

👉ఎపిలో ఈ ఏడాది జూన్‌లో పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. విద్యార్థులు సంబంధిత పాఠశాల లాగిన్‌ ద్వారా తమ పరీక్షల ఫీజును ఆన్‌లైన్‌లో మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు చెల్లించవచ్చునని సుబ్బారెడ్డి తెలిపారు.

👉 అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ద్వారా కూడా మార్చి 20వ తేదీ నుంచి ఏప్రిల్‌ 5వ తేదీ వరకు చెల్లించవచ్చునని పేర్కొన్నారు. రూ.50 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 12వ తేదీ వరకు, రూ.200 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 20వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 30వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు.

👉బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన పాఠశాలల పూర్తి వివరాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌ www.bse.ap.gov.in తెలుసుకోవచ్చు.

పరీక్ష ఫీజు వివరాలు..

1. రెగ్యూలర్‌ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.125 చెల్లించాల్సి ఉంది.

2. బ్యాక్‌లాగ్‌ విద్యార్థులు 3 సబ్జెక్ట్స్‌ కంటే ఎక్కువగా ఉంటే ఫీజు రూ.125 చెల్లించాలి.

3. 3 సబ్జెక్ట్‌లలోపు ఉంటే రూ.110 చెల్లించాలి.

4. నిర్ణీత వయసు కంటే తక్కువ వయసు గల విద్యార్థులు రూ.300 ఫీజు కట్టాలి.

5. మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ కోసం రూ. 80 చెల్లించాలి

Post a Comment

0 Comments

Close Menu