👉ఏమిటి : లండన్‌లో కూర్చుని.. నెదర్లాండ్స్‌లో ఉన్న మహిళకు టాటూ వేసి కొత్త రికార్డు..
👉ఎప్పుడు : ఇటివల
👉ఎవరు : లండన్‌కు చెందిన నోయెల్ డ్రూ (వెస్ థామస్)
👉ఎక్కడ : లండన్
👉ఎందుకు : ఇదే ప్రపంచంలోని తొలి రిమోట్ టాటూగా రికార్డులకెక్కింది.
👉ఇవాళ టాటూలు వేసుకోవడం ప్రతీ ఒక్కరికి ఫ్యాషన్‌గా మారింది.
👉టాటూ వేసుకోవాలంటే మనమే ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఆర్టిస్ట్ వద్దకు వెళ్లి కూర్చోవాల్సిన అవసరం లేకుండా లండన్‌కు చెందిన ఓ టాటూ కళాకారుడు కొత్త టెక్నాలజీని తయారుచేశారు.
👉తాను లండన్‌లో కూర్చుని ఉండి.. నెదర్లాండ్స్‌లో ఉన్న మహిళకు 5 జీ టెక్నాలజీ ద్వారా టాటూ వేసి కొత్త రికార్డు సృష్టించారు.
👉ఇదే ప్రపంచంలోని తొలి రిమోట్ టాటూగా రికార్డులకెక్కింది. 483 కిలోమీటర్ల దూరంలోని నగరంలో ఉన్న వ్యక్తికి రోబోటిక్ రిమోట్ ద్వారా పచ్చ పొడిచి లండన్ టాటూ కళాకారుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారు.
👉5 జీ టెక్నాలజీతో కూడిన రియల్‌టైమ్ రోబోటిక్ ఆర్మ్‌తో టాటూ వేసే సాంకేతికతను లండన్‌కు చెందిన నోయెల్ డ్రూ తయారు చేశారు.
👉ఈ టెక్నాలజీకి ‘ఇంపాజిబుల్ టాటూ’ అని పేరు పెట్టారు.
👉పచ్చబొట్టు కళాకారుడు వెస్ థామస్ తన చేతిలో ఉన్న డిజైన్‌ను రూపొందించడానికి ఈ పరికరాన్ని వందసార్లు పరిశీలించాడు.
👉నెదర్లాండ్స్ నటి స్టిన్ ఫ్రాన్సెన్ మణికట్టు మీద టాటూ వేసి తొలి రిమోట్ వేసిన కళాకారుడుగా వెస్ థామస్ నిలిచారు.
👉లాక్డౌన్ లాక్డౌన్ సమయంలో సుమారు 6 వారాల సమయంలో ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు.
👉ఈ టెక్నాలజీ వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులకు కూడా టాటూ వేయడం సులభం చేసింది.
👉ఈ టెక్నాలజీకి సంబంధించిన చాలా వస్తువులు ఇంట్లోనే తయారు చేసుకున్నామని, కొన్నింటిని బయటి నుంచి కొనుగోలు చేసుకున్నట్లు నోయెల్ చెప్పారు.
0 Comments