👉ఏమిటి : చంద్రుడిపై అన్ని రకాల జీవుల వీర్యం, అండాలతో పాటు, పంటలు, వృక్షాలకు సంబంధించిన విత్తనాలను స్టోర్ చేద్దామని సూచన
👉 ఎప్పుడు : ఇటివల
👉 ఎవరు : అమెరికా
👉 ఎక్కడ : చంద్రుడి మీద
👉 ఎందుకు : జీవజాతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనుషులపై ఉంది.
👉 భూమి మీద బతికే అన్ని జీవులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఒకదానిపై ఒకటి ఆధారపడి బతుకుతున్నాయి. అయితే జీవ వైవిధ్యం దెబ్బతింటే కొన్నేండ్లకు ఒక్కో జీవి మనుగడ కోల్పోతుంది.
👉 అందుకే అన్ని జీవజాతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనుషులపై ఉంది.
👉 ఇందులో భాగంగా మొక్కలు, వృక్ష జాతులను కాపాడుకునేందుకు ఇప్పటికే డూమ్స్ డే బ్యాంక్‌లో 10 లక్షలకు పైగా వేర్వేరు పంటలు, వృక్షాలకు సంబంధించిన విత్తనాలను భద్రపరుస్తున్నాం.
👉 అలాగే భూమిపై ఉన్న అన్ని రకాల జీవులు అంతరించిపోకుండా చూసేందుకు వాటి జీన్స్ భద్రపరుచుకుంటే, వాటిని మళ్లీ సృష్టించవచ్చు.
👉ఇందుకోసం జీన్ బ్యాంకులు పుట్టుకొస్తున్నాయి. అయితే దీని కోసం ఇప్పుడు అమెరికా సైంటిస్టులు ప్రతిపాదిస్తున్న విధానం ఎవ్వరూ ఊహించి ఉండరు. అదే చంద్రుడిపై అన్ని రకాల జీవుల వీర్యం, అండాలతో పాటు, పంటలు, వృక్షాలకు సంబంధించిన విత్తనాలను స్టోర్ చేద్దామని సూచిస్తున్నారు.
👉 భూమిపై జీన్ బ్యాంకులు ఎన్ని పెట్టినా అనూహ్యంగా అగ్ని పర్వతాల పేలుడు, భారీ భూకంపాలు, సునామీలు లాంటి పెను విపత్తులు, లేదా భూమిని గ్రహ శకలాలు ఢీకొట్టడం లాంటివి జరిగితే వాటిని కాపాడుకోలేం.
👉 దాదాపు 75 వేల ఏండ్ల క్రితం భారీ అగ్ని పర్వత పేలుళ్లు జరిగినప్పుడు పొంగిన లావా చల్లబడడానికి వెయ్యేండ్ల సమయం పట్టింది.
👉మళ్లీ అటువంటి ఘటన జరిగి, భూమిపై ఒక భాగం నాశనమైతే, జీవ వైవిధ్యం దెబ్బతినడం కారణంగా మిగిలిన భాగంలో ఉన్న జీవజాలంపై పెను ప్రభావం పడుతుంది.
👉అందుకే ‘మోడర్న్ గ్లోబల్ ఇన్సూరెన్స్ పాలసీ’ అనే పేరుతో యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా సైంటిస్టులు కొత్త ప్రపోజల్ తెరపైకి తెచ్చారు.
👉 67 లక్షల జీవ జాతుల వీర్యం, అండాలను సేకరించి, వాటిని చంద్రుడిపై భద్రపరిస్తే చాలా సేఫ్‌గా ఉంటాయని చెబుతున్నారు.
👉ఈ లూనార్ జీన్ బ్యాంక్‌ను చంద్రుడి ఉపరితలానికి కింది భాగంలో కోట్ల ఏండ్ల క్రితం అగ్ని పర్వతాల లావా చల్లబడిన తర్వాత, దాని కింద ఏర్పడిన గుహల (లావా ట్యూబ్స్) వంటి వాటిలో ఏర్పాటు చేయొచ్చని తెలిపారు.
👉 ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను గత వారం వర్చువల్‌గా జరిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఎరోస్పేస్ కాన్ఫరెన్స్‌లో ప్రజెంటేషన్ ఇచ్చారు.
👉చంద్రుడిపై మనం ఇండ్లు కట్టుకుని జీవించే రోజులు భవిష్యత్తులో కచ్చితంగా వస్తాయని టీమ్‌ని లీడ్ చేసిన జెకాన్ థంగా అన్నారు.
👉జీన్ బ్యాంకులు ఏర్పాటుతో పెను విపత్తులతో కోల్పోయే బయోడైవర్సిటీని మళ్లీ బ్యాలెన్స్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
👉ఇందులో భాగంగా ఇప్పటికే 10 లక్షలకు పైగా పంటలు, మొక్కల శాంపిల్స్ ఆర్కిటిక్ సముద్రం మధ్యలో ఉన్న నార్వే దీవిలో స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాలెట్ (డూమ్స్ డే బ్యాంక్)లో స్టోర్ చేశారు.
👉 అయితే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న గ్లోబల్ వార్మింగ్, క్లైమెట్ చేంజ్ లాంటి సవాళ్ల వల్ల ఏ క్షణంలో ఎటువంటి విపత్తు ముంచుకొస్తుందో చెప్పలేని స్థితిలో ఉన్నామని జెకాన్ తన ప్రజెంటేషన్‌లో అన్నారు.
👉అందుకే సేఫ్ లొకేషన్‌గా తాము చంద్రుడిని ఎంచుకున్నామని చెప్పారు. భూమిపై ఉన్న 67 లక్షల జీవ జాతుల వీర్యం, అండాలను మైనస్ 196 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్‌లో ఫ్రీజ్ చేసి భద్రపరిస్తే, ఎన్ని వేల సంవత్సరాలైనా అలాగే ఉంటాయన్నారు.
👉ఆ తర్వాత అవసరమైనప్పుడు డీఫ్రీజ్ చేసి ఫర్టిలైజేషన్ ద్వారా ఆ జీవులను మళ్లీ సృష్టించవచ్చని అన్నారు.
👉ఈ ప్రాజెక్ట్‌లో చంద్రుడిపై జీన్ బ్యాంక్ నిర్మాణమే అతి పెద్ద టాస్క్.
👉ఇది సాధ్యం అవుతుందని జెకాన్ అన్నారు. చంద్రుడిపై లావా ట్యూబ్స్ ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారని, వాటిలో మైనస్ 24 డిగ్రీల టెంపరేచర్ ఉందని ఇటీవలే కనిపెట్టారని చెప్పారు.
👉అయితే ఈ లావా ట్యూబ్స్‌లో ప్రతి 100 మీటర్లకు ఒక జీన్ బ్యాంక్‌గా విభజించి, నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఈ పని పూర్తి చేయడంతో పాటు, 67 లక్షల జీవజాతులకు సంబంధించి ఒక్కొక్కటి 50శాంపిల్స్ చొప్పున సేకరించి వాటిని చంద్రుడిపైకి చేర్చడానికి 250 రాకెట్లు లాంచ్ చేయాల్సి వస్తుందని అంచనా వేశారు.
👉అంతరిక్షంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి 40 రాకెట్లు లాంచ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జెకాన్ గుర్తు చేశారు.
👉లావా ట్యూబ్స్‌లో ఏర్పాటు చేసిన జీన్ బ్యాంకుల్లో మైనస్ ఉష్ణోగ్రతలను మెయింటెయిన్ చేసేందుకు చంద్రుడి ఉపరితలంపై భారీ సోలార్ ప్యానెల్స్ పెట్టాల్సి వస్తుందని జెకాన్ చెప్పారు.
👉మైనస్ 196 డిగ్రీల టెంపరేచర్ ఉండే ప్లేస్‌లో కొత్త శాంపిల్స్ పెట్టాలన్నా, ఉన్న వాటిని బయటకు తీయాలన్నా కూడా చాలా పెద్ద టాస్క్.
👉అయితే దీనికి స్పియర్–ఎక్స్ అనే పేరుతో తయారు చేసే టెంపరేచర్ రెసిస్టెంట్ ప్లైయింగ్ రోబోలను డెవలప్ చేయొచ్చని సైంటిస్టులు వివరించారు.
👉100 మీటర్ల వెడల్పుతో ఉండే లావా ట్యూబ్స్‌లో ఇవి ఈజీగా లోపల ట్రావెల్ చేయొచ్చన్నారు.
👉చంద్రుడిపై జీన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసే ముందు కొన్ని ప్రయోగాలు జరగాల్సి ఉందని సైంటిస్టులు చెప్పారు.
👉ఆ టెంపరేచర్స్‌లో స్టోర్ చేసేటప్పుడు పరిసరాలు, స్టోరేజ్‌కు వాడే మెటీరియల్ డ్యామేజ్ కాకుండా ఉంటుందా అన్న దానిపై మరింత రీసెర్చ్ జరగాలన్నారు. ఇప్పటి వరకు ల్యాబ్‌లో జరిగిన పరిశీలనలో పాజిటివ్ రిజల్టే వచ్చిందన్నారు. అయితే చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి (గ్రావిటీ) భూమిపై కంటే ఆరింతలు తక్కువగా ఉంటుంది.
👉ఈ తక్కువ గ్రావిటీలో స్టోర్ చేసిన శాంపిల్స్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందన్నదానిపై కూడా రీసెర్చ్ జరగాల్సి ఉందని సైంటిస్టులు చెప్పారు. ఇదంతా ఇప్పటికిప్పుడు జరిగేదేం కాదని, దీనిపై కనీసం దశాబ్దానికి పైగా ప్రయోగాలు జరగాలని ప్రజెంటేషన్‌లో వివరించారు.
0 Comments