👉జంతువుల నుంచే కదా కరోనా మరి టికా జంతువుల నుంచే మొదలు పెట్టాలి

 

👉ఏమిటి: జంతువుల నుంచే కదా కరోనా మరి టికా జంతువుల నుంచే మొదలు పెట్టాలి

👉ఎప్పుడు: ఇటివల   

👉ఎవరు : రష్యా ప్రబుత్వం  

👉ఎక్కడ : రష్యా    

👉ఎందుకు: ‘‘గబ్బిలాల(జంతువుల) నుంచి ఒక జంతువులోకి ప్రవేశించిన వైరస్.. ఆ తర్వాత మనుషులకు సోకింది. ల్యాబ్ నుంచి లీక్ అవ్వడానికి అవకాశమే లేదు” : WHO

👉ప్రపంచ దేశాలకంటే ముందుగా కరోనా టీకాను ప్రజావినియోగానికి అనుమతించిన రష్యా తాజాగా మరో సంచలన ప్రక్రియ చేపట్టింది.

👉‘‘గబ్బిలాల(జంతువుల) నుంచి ఒక జంతువులోకి ప్రవేశించిన వైరస్.. ఆ తర్వాత మనుషులకు సోకింది. ల్యాబ్ నుంచి లీక్ అవ్వడానికి అవకాశమే లేదు” : WHO అని ప్రకటించింది. దిన్నె రష్యా మరోలా ఆలోచించింది కాబోలు జంతువులకు టికా వేస్తే అన్న కోణం లో జంతువుల కోసం ఉద్దేశించిన కరోనా టీకాను రిజిస్టర్ చేసింది.

👉ప్రపంచంలోనే తొలిసారిగా జంతువుల కోసం ఉద్దేశించిన కరోనా టీకాను రిజిస్టర్ చేసింది.

👉కార్నికావ్-కొవ్ పేరిట ప్రవేశపెట్టిన ఈ టీకాను ఏప్రిల్ 1 నుంచి పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి చేయనున్నట్టు సమాచారం అందించింది.

👉జంతువుల నుంచి మనుషులకు కరోనా వ్యాపించవచ్చంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ఆందోళన వ్యక్తం చేసింది.

👉ఇలా పలు మార్లు జంతువులు, మనుషులు కరోనా బారిన పడటం ద్వారా వైరస్‌లో జన్యుమార్పులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.ఇలాంటి టీకాతో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా చేయవచ్చని రష్యా ఆలోచించింది.

Post a Comment

0 Comments

Close Menu