👉 అంతరిక్షంలో మరణించాలన్న నా కోరిక ఆ విధంగా తీరుతుంది కదా

 

👉 అంతరిక్షంలో మరణించాలన్న నా కోరిక ఆ విధంగా తీరుతుంది కదా

👉ఏమిటి : అంతరిక్షంలో అడుగు పెట్టిన భారత సంతతికి చెందిన తొలి మహిళా ఆస్ట్రోనాట్‌

👉ఎప్పుడు : కల్పన జయంతి  మార్చి 17

👉 ఎవరు : భారత సంతతికి చెందిన మహిళ

👉ఎక్కడ : హర్యానాలోని కర్నాల్‌లో

👉ఎందుకు : అంతరిక్షంలో అడుగు పెట్టిన భారత సంతతికి చెందిన తొలి మహిళా ఆస్ట్రోనాట్‌గా చరిత్ర సృష్టించిన కల్పన జయంతి సందర్భంగా...

👉అంతరిక్షంలో అడుగు పెట్టిన భారత సంతతికి చెందిన తొలి మహిళా ఆస్ట్రోనాట్‌గా చరిత్ర సృష్టించిన కల్పన జయంతి సందర్భంగా ఆమె జర్నీ విశేషాలు

👉కల్పనా చావ్లా 1962 మార్చి 17న హర్యానాలోని కర్నాల్‌లో బనారసి చావ్లా, సంజ్యోతి చావ్లా దంపతులకు జన్మించారు.

👉చిన్న వయస్సులో ఆరు బయట మంచం మీద పడుకుని ఆకాశంలోని నక్షత్రాల వైపు తన చేయి చూపిస్తూ తన అమ్మ సంజ్యోతితో ఇలా .. అమ్మా అక్కడికి ఎలా వెళ్లాలని అడిగేదని చావ్లా తల్లి సంజ్యోతి ఓ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

👉అలా చిన్ననాటి నుంచే విమానాల పట్ల ఆకర్షితురాలైన కల్పనా చావ్లా పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు.

👉 అనంతరం తన కలను సాకారం చేసుకునేందుకు అమెరికాకు వెళ్లారు. కల్పనా చావ్లా పూర్తి శాఖాహారి.., అయితే అక్కడ నెట్టుకురావటం కష్టం అంటూ చాలా మంది పెదవి విరిచారు.

👉 అయినా పై చదువుల కోసం తన 20వ ఏట అమెరికా వెళ్లిన మరుసటి సంవత్సరమే జేన్ పియరి హారిసన్ అనే అమెరికన్ ను వివాహం చేసుకున్నారు.

👉1984 యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి మాస్టర్స్ డిగ్రీని, 1988లో కొలరాడో యూనివర్సిటీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ పూర్తి చేశారు.

👉1994లో అమెరికా అంతరిక్ష కేంద్రం నాసాతన పరిశోధనల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఆ విషయం తెలుసుకున్న కల్పనా చావ్లా అటెండ్ అయ్యింది. 1500మందిని ఇంటర్వ్యూ చేయగా అందులో 125మంది సెలక్ట్ అయ్యారు.

👉125మందిలో ఇద్దర్ని మాత్రమే నాసా ఫైనల్ చేసింది. వారిలో కల్పనా చావ్లా ఒకరు.

👉 ఇంటర్వ్యూ అనంతరం నాసా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చింది.

👉 ఆ ట్రైనింగ్ పూర్తి చేస్తే గాని అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం రాదు. అలా అని ఆ ట్రైనింగ్ అందరూ పూర్తి చేస్తారని గ్యారెంటీ లేదు. కానీ కల్పనా దృఢ సంకల్పం ముందు అవాంతరాలన్నీ చిన్నబోయాయి.

👉 1998లో నాసాలో తన కలల సౌధం లోకి అడుగుపెట్టిన ఆమె అర్ధాంతరంగా తనువు చాలించారు.

👉1997 లో అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా కల్పనా చావ్లా చరిత్ర సృష్టించారు. అప్పుడు ఏకంగా 376 గంటల పాటు అంతరిక్షంలో గడిపారు.

👉భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మిలియన్ మైళ్ళు అంతరిక్ష యానం చేశారు.

👉ఆ తర్వాత 2003 లో కల్పన రెండవ అంతరిక్ష మిషన్ STS-107 మిషన్ ప్రారంభమైంది.

👉STS-107 మిషన్ ప్రారంభానికి ముందే ఇది చాలా రిస్క్ తో కూడుకున్న యాత్ర, తిరిగి రాలేకపోవచ్చుఅని నాసా హెచ్చరిస్తే అంతరిక్షంలో మరణించాలన్న నా కోరిక ఆ విధంగా తీరుతుంది కదాఅంటూ నవ్వింది కల్పానా చావ్లా.

👉 మరోసారి అవకాశం వస్తుందో రాదో అనుకుంటున్న సమయంలో నాసా నుండి స్పేస్ వెళతావా అంటూ ఫోన్ రావడం, ఆమె అంగీకరించటం జరిగింది. రెండవ సారి అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకుని తిరిగి వస్తుండగా 2003 ఫిబ్రవరి 1 న కొలంబియా వ్యోమనౌక కూలిపోవడంతో ఆమెతోపాటు మరో ఆరుగురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు.

 👉 ప్రయత్నిచండి :

  1. Q....ఎన్నవ సారి అంతరిక్ష యాత్ర లో కల్పనా చావ్లా గారు మరణించారు ??
  2. Q.... 1994లో అమెరికా అంతరిక్ష కేంద్రం నాసాతన పరిశోధనల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించింది ఇందులో  1500మందిని ఇంటర్వ్యూ చేయగా అందులో 125మంది సెలక్ట్ అయ్యారు అందులో మహిళలు ఎంతమంది ??
  3. Q.... 1997 లో అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా కల్పనా చావ్లా  అప్పుడు ఏకంగా ఎన్ని గంటల  పాటు అంతరిక్షంలో గడిపారు ??

 

 

Post a Comment

0 Comments

Close Menu