👉 బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచే బిల్లు...

 

👉 ఏమిటి : బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 74శాతానికి పెంచే బిల్లుకు రాజ్యసభ ఆమోదం

👉 ఎప్పుడు : మార్చి 18

👉 ఎవరు : రాజ్యసభ

👉 ఎక్కడ : భారత్

👉 ఎందుకు : బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల ను ఎక్కువ శాతానికి పెంచడం కోసం.. బీమా సంస్థలు ఆర్థిక పరమైన ఒత్తిడి ని తగ్గించడం కోసం  

👉 బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 74 శాతానికి పెంచే బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది.

👉బీమా(సవరణ) బిల్లు-2021పై జరిగిన చర్చలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..ప్రస్తుతం బీమా సంస్థలు ఆర్థిక పరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

👉బీమా పరిశ్రమలో అధిక విదేశీ పెట్టుబడులతో దేశీయ దీర్ఘకాలిక వనరులను భర్తీ చేయడంతో పాటు దేశీయ బీమా పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందనిచెప్పారు.

👉 బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ వాటాదారులతో సవివరమైన సంప్రదింపులు జరిపిన తర్వాతే ఎ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచే నిర్ణయం తీసుకున్నామని సీతారామన్ పేర్కొన్నారు.

👉 కాగా, బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని చివరిసారిగా 2015లో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు.

👉కాగా, మన దేశంలో జీవిత బీమా ఉత్పత్తులు జీడీపీలో 3.6శాతంగా ఉండగా, ప్రపంచ సగటు 7.13 శాతంతో పోల్స్తే తక్కువ.

👉 అదేవిధంగా సాధారణ బీమా ప్రపంచ సగటు 2.88 శాతం ఉండగా, మన దేశంలో ఇది 0.94 శాతం మాత్రమే ఉంది.

 ప్రయత్నిచండి :

  1. Q ... బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని ఎంత  శాతానికి పెంచే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది ??
  2. Q..బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని చివరిసారిగా 2015లో 26 శాతం నుంచి ఎంత శాతానికి పెంచారు ??
  3. Q.. జీవిత బీమా ఉత్పత్తులు జీడీపీలో ప్రపంచ సగటు శాతం ఎంత ??
  4. Q.... మన దేశంలో జీవిత బీమా ఉత్పత్తులు జీడీపీలో సగటు  శాతం ఎంత ??

 

Post a Comment

0 Comments

Close Menu