👉ఏమిటి : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ
👉 ఎప్పుడు : ఇటివల
👉 ఎవరు : తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థుల సంఘం
👉 ఎక్కడ : తెలంగాణ
👉ఎందుకు : తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థుల సంఘం స్వేరో యూనియన్ ఏటా భీమ్ దీక్ష పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటుంది .
👉తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థుల సంఘం స్వేరో యూనియన్ ఏటా భీమ్ దీక్ష పేరుతో ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటుంది. కాన్షీరాం జయంతి నుంచి అంబేడ్కర్ జయంతి వరకూ నెల రోజుల పాటూ ఇది సాగుతుంది.
👉 ఏటా ఈ ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు స్వేరో పూర్వ, ప్రస్తుత విద్యార్థులు. ఈసారి తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట వద్ద 2 వేల ఏళ్ల నాటి ప్రాచీన బౌద్ధ స్తూపం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించారు.
👉 ఆ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా చేయి పెట్టి నుంచున్న ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో హిందూ దేవుళ్లపై తనకు నమ్మకం లేదు అన్న మాటలు వినిపిస్తాయి.
👉 అసలేమిటీ ప్రతిజ్ఞ?
👉1956లో మహారాష్ట్రలోని నాగపూర్‌లో అక్టోబరు 14న అంబేడ్కర్ ఈ ప్రతిజ్ఞ చేయించారు.
👉 అంబేడ్కర్ బౌద్ధ మతంలోకి మారుతున్న సందర్భంగా ఆయన ఇది తయారు చేశారు.
👉 ఇందులో మొత్తం 22 వాక్యాలు ఉంటాయి.
👉 అంబేడ్కర్ తనతో పాటూ మతం మారిన వేలాది మంది దళితులతో అక్కడ ఇవి చదివించారు.
👉నాగపూర్ లో అంబేడ్కర్ మతం మారిన ప్రదేశాన్ని దీక్షా స్థలిగా పిలుస్తారు. అక్కడ కొన్ని నిర్మాణాలు ఉన్నాయి.
👉వాటిలో ఒక స్తూపంపై ఆ ప్రతిజ్ఞలోని 22 పాయింట్లను అక్కడే వివిధ భాషల్లో చెక్కించారు.
👉 2017ఏప్రిల్ లో అంబేడ్కర్ పుట్టిన రోజున ప్రధాని మోదీ ఆ దీక్షా స్థలిని సందర్శించారు .
👉 దళితవాదంతో, అంబేడ్కర్ బోధనలతో ప్రభావితమై బౌద్ధంలోకి మారే దళితులు ఈ ప్రతిజ్ఞ చేస్తుంటారు.
👉‘‘ నాకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మీద నమ్మకం లేదు. నేను వాళ్లను పూజించను. నాకు రాముని మీద, కృష్ణుని మీద నమ్మకం లేదు. నేను వాళ్లను పూజించను.. నేను బుద్ధుడు ప్రవచించిన సూత్రాలకు, ప్రబోధాలకు ఏమాత్రం వ్యతిరేకమైన విధంగా ప్రవర్తించను’’ అంటూ సాగుతుందీ ప్రతిజ్ఞ.
దీక్షా స్థలిలో శిలా ఫలకంపై వివిధ భాషల్లో చెక్కించిన పాయింట్లు:
0 Comments