👉 ఏమిటి : రిజర్వేషన్ల మొత్తం పరిమితి 50 శాతానికి దాటకూడదనే అంశంపై అన్ని రాష్ర్టాలు తమ అభిప్రాయాలను తెలుపాలని సుప్రీంకోర్టు కోరింది.
👉 ఎప్పుడు : ఇటివల
👉 ఎవరు : రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు (సుప్రీం కోర్టు ౧౯౯౨)
👉 ఎక్కడ : భారత్ లో
👉 ఎందుకు : రిజర్వేషన్లలో 50% పరిమితిపై పునఃసమీక్ష అవసరమా? అని మీ అభిప్రాయాలు తెలుపాలని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు
👉రిజర్వేషన్ల మొత్తం పరిమితి 50 శాతానికి దాటకూడదనే అంశంపై అన్ని రాష్ర్టాలు తమ అభిప్రాయాలను తెలుపాలని సుప్రీంకోర్టు కోరింది.
👉 ఈ మేరకు అన్ని రాష్ర్టాలకు నోటీసులు పంపించింది.
👉 మహారాష్ట్రలో మరాఠా సామాజికవర్గానికి 16 శాతం రిజర్వేషన్లు కల్పించటం, తద్వారా ఆ రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 50% దాటడానికి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
👉 ఈ కేసులో తీర్పు దేశమంతటా ప్రభావం చూపనున్న నేపథ్యంలో ధర్మాసం అన్ని రాష్ర్టాల అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించింది.
👉 ఒక సామాజికవర్గాన్ని బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్ కల్పించటంలో కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పించే 102వ రాజ్యాంగ సవరణ రాష్ర్టాల అధికారాలను హరిస్తుందా.. అన్న విషయంలోనూ అభిప్రాయాన్ని తెలుపాలని ఆదేశించింది.
👉 1992లో ఇందిరా సాహ్నీ కేసులో.. ‘రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు’ అన్న తమ తీర్పుపై పునఃసమీక్షపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్టు సుప్రీంకోర్టు నోటీసుల్లో తెలిపింది.
👉 102వ రాజ్యాంగ సవరణ ఏమిటి ??
👉2018లో కేంద్రప్రభుత్వం రాజ్యాంగానికి 102వ సవరణ చేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 342Aను చేర్చారు.
👉ఈ ఆర్టికల్ ప్రకారం.. ఏదైనా రాష్ట్రంలో బీసీలను గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
👉 ఇదే ఆర్టికల్ ద్వారా వెనుకబడిన వర్గాల జాబితాను మార్చే అధికారం పార్లమెంటుకు వచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం రాష్ర్టాలకు కూడా ఇలాంటి అధికారాలే ఉన్నాయి.
👉 అయితే, ఆర్టికల్ 342A వల్ల కేంద్రం రాష్ర్టాల అధికారాలను తగ్గించిందన్న వాదనలు ఉన్నాయి.
👉 భారతదేశంలో రిజర్వేషన్ల ఉద్దేశ్యం ఏమిటి ??
👉 భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించే రెండు ప్రధాన లక్ష్యాలు:
0 Comments