👉 పెన్నా నది పునరుజ్జీవనం మీద రెండు శాతం కమీషన్‌

 

👉ఏమిటి : పెన్నా నది పునరుజ్జీవనం పనుల బాధ్యతను కర్ణాటకకు చెందిన ఒక ఆధ్యాత్మిక సంస్థకు అప్పగించేందుకు రంగం

👉 ఎప్పుడు : ఇటివల  

👉 ఎవరు : కర్ణాటకకు చెందిన ఒక ఆధ్యాత్మిక సంస్థకు

👉 ఎక్కడ : ఆంధ్ర

👉 ఎందుకు : ఈ నది దశాబ్దాలుగా పూర్తి సామర్థ్యంతో ప్రవహించడం లేదు.

👉 పెన్నా నది పునరుజ్జీవనం పనుల బాధ్యతను కర్ణాటకకు చెందిన ఒక ఆధ్యాత్మిక సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది.

👉 ఆ సంస్థకు రెండు శాతం కమీషన్‌ ఇవ్వనున్నట్లు సమాచారం.

👉పనుల కోసం సుమారు వంద కోట్ల రూపాయలకుపైగా నిధులు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా.

👉 ఇందుకు ఉపాధి హామీ చట్టం నిధులను వెచ్చించనున్నాయి.

👉గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనల మేరకు ఏప్రిల్‌ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వానికీ, ఆ ఆధ్యాత్మిక సంస్థకు మధ్య అవగాహన ఒప్పందం కుదిరే అవకాశముంది.

👉 అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల మీదుగా పెన్నా నది ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తోంది.

👉నదికి ఎగువన కర్ణాటకలో నీటి వాడకం పెరగడం, వర్షాభావ పరిస్థితులతో అనంతపురం, కడప జిల్లాల్లో ఈ నది దశాబ్దాలుగా పూర్తి సామర్థ్యంతో ప్రవహించడం లేదు.

👉అనేక చోట్ల నది ఆక్రమణలకు గురైంది. ఈ నేపథ్యంలో పునరుజ్జీవనం పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నదిలో పూడిక తీత, నది పరివాహక ప్రాంతాల్లో మొక్కల పెంపకం తదితర పనులు చేపట్టనున్నారు.

👉నది ప్రవాహక ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలు, రైతులతో కమిటీలను ఏర్పాటు చేసి ఈ పనుల్లో భాగస్వామ్యులను చేసే బాధ్యత ఆ ఆధ్యాత్మిక సంస్థ చూడనున్నట్లు సమాచారం.

👉 ఇటువంటి ప్రయత్నం గడిచిన రెండు సంవత్సరాలుగా కర్ణాటకలోని వేదవతి నదిపై ఆ సంస్థ చేస్తోంది.

👉భూగర్భ జలాలు మెరుగు పర్చేందుకు, నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామీణులకు ఉపాధి కల్పించేందుకు, నది ఆక్రమణకు గురి కాకుండా ఉండేందుకు ఈ పనులు దోహదం చేస్తాయని అధికారులు చెప్తున్నారు.

👉పూర్తి స్థాయి నివేదికలు రూపొందించే పనిలో వారు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో దీనిపై గడిచిన రెండు మాసాలుగా కసరత్తు సాగుతోంది.

👉గత ఆదివారం అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎంపిలు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రతినిధులు ఈ విషయమై సమావేశమయ్యారు.

👉ఉపాధి నిధులతో చేపట్టే ఈ పనులను ఆధ్యాత్మిక సంస్థకు కట్టబెట్టాలని, ఆ సంస్థకు దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు కమీషన్‌ రూపంలో ముట్టజెప్పాలని చూడడడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

👉ప్రభుత్వమే నేరుగా ఈ పనులు చేపడితే ఎవరికీ కమీషన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

👉 పెన్నానది లేదా పెన్నార్ అనేది దక్షిణ భారతదేశపు ఒక నది. పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలో కోలారు సమీపానగల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. ప్రవహిచి నెల్లూరుకు ఈశాన్యంగా 20 కి.మీ.

  • Øపొడవు: 597 km
  • Øపరివాహక ప్రాంతం: 55,213 km²
  • Øమూలం: నంది హిల్స్
  • Øద్వారం: బంగాళాఖాతము
  • Øజిల్లాలు: చిక్కబల్లాపూర్, కోలార్, తుంకూర్, అనంతపురం, వైయస్ఆర్ జిల్లా, నెల్లూరు
  • Øనగరాలు: నెల్లూరు

👉 పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: కుముదావతి, జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు, బొగ్గేరు, బిరపేరు. పెన్నా నది పరీవాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది భారత దేశపు మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.),, కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.

👉 పెన్నానది పాలకొండల వద్ద ప్రవాహం సన్నగా ఉంటుంది. తదుపరి కుందేరు, చెయ్యేరు వంటి చిన్న్ అప్రవాహాల ద్వారా తిరిగి జమ్మలమడుగు వద్ద నుండి పెద్ద నదిగా మారుతున్నది.

Post a Comment

0 Comments

Close Menu