👉 దేశానికే ఆదర్శ జిల్లా

 

👉ఏమిటి : మూడేళ్లుగా ఒక్క అత్యాచార కేసు కూడా నమోదు కాలేదు

👉 ఎప్పుడు : ఇటివల  

👉ఎవరు : లాహోల్-స్పీతి జిల్లా

👉 ఎక్కడ : హిమాచల్ ప్రదేశ్

👉ఎందుకు : సంస్కృతిలో భాగమే..మహిళలను గౌరవించడం ఇక్కడ సంస్కృతిలో భాగమే అంటారు  స్థానికులు.


👉 
అక్కడ మూడేళ్లుగా ఒక్క అత్యాచార కేసు కూడా నమోదు కాలేదు. మహిళపై దాడులు జరిగే ఘటనలు చాలా తక్కువ. అక్కడి మహిళలు ప్రతి విషయంలోనూ ముందుంటూ నిర్ణయాత్మక శక్తిగా నిలుస్తున్నారు.

👉 అత్యంత చల్లగా ఉండే రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి.

👉ఇక్కడ (లాహోల్-స్పీతి జిల్లా) ఆడవారిపై నేరాలు దాదాపు లేనట్టే. వరకట్న వేధింపుల దాఖలాలే ఉండవు. ఈ ప్రాంత మహిళలు మగవారికి ఏ విషయంలోనూ తీసిపోరు.

👉వ్యవసాయం, పూల తోటల పెంపకం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.

👉ఒక్క అత్యాచార కేసు లేదు..దేశవ్యాప్తంగా రోజుకు ఎన్నో అత్యాచార కేసులు వెలుగు చూస్తున్నాయి. కానీ లాహోల్-స్పీతి జిల్లాలో మూడేళ్లుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అంటే చాలా మంచి విషయం .

👉వేరే ప్రాంతాల్లా మహిళలపై హింసాత్మక దాడులు ఇక్కడ ఎక్కువగా ఉండవు. లింగనిష్పత్తి విషయంలో ఇక్కడ 1,000 మంది అబ్బాయిలకు 1,033 మంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిల అక్షరాస్యత రేటు మిగతా చోట్లతో పోల్చితే కాస్త  మెరుగ్గా ఉంది.

👉 సంస్కృతిలో భాగమే..మహిళలను గౌరవించడం ఇక్కడ సంస్కృతిలో భాగమే అంటున్నారు స్థానికులు. కుమార్తె పుట్టడం శుభంగా భావిస్తారు. భ్రూణహత్యలు, వరకట్న వేధింపులు లాంటివి ఏ కోశానా ఉండవు. తల్లిదండ్రులు కూడా కుమార్తెలను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తారు.

 

👉హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 12 జిల్లాలలో లాహౌల్ స్పితి జిల్లా ఒకటి. ఇందులో లాహౌల్, స్పితి అనేవి రెండు వేరువేరు జిల్లాలుగా ఉండేవి.లాహౌల్ జిల్లాకు కేలాంగ్ కేంద్రంగా ఉంది.స్పితి జిల్లాకు ధన్‌కర్ పట్టణం కేంద్రంగా ఉండేది. 1960లో రెంటినీ కలిపి లాహౌల్ స్పితి జిల్లాను ఏర్పాటు చేసారు.

  • ఎత్తు: 4,270 m
  • ప్రాంతం: 13,833 km²
  • HQ: కేలాంగ్
  • ప్రధాన రహదారులు: one (Manali-Leh National Highway)


Post a Comment

0 Comments

Close Menu