👉 వస్తు మార్పిడిని తెరమీదకు తెచ్చిన వెనుజులా ??

 

👉ఏమిటి : వస్తుమార్పిడి వ్యవస్థను తెరపైకి తెచ్చిన వెనిజులా

👉 ఎప్పుడు : మార్చ్ 29  

👉 ఎవరు : వెనిజులా  ప్రబుత్వం

👉 ఎక్కడ :  అంతర్జాతీయంగా   

👉ఎందుకు : తమకు టీకాలు ఇచ్చిన వారికి చమురు ఇస్తామని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో ప్రకటించారు


👉కరోనా విజృంభిస్తున్న వేళ వెనిజువెలా అధ్యక్షుడు కొత్త తరహా దౌత్యానికి తెరతీశారు. మరోసారి పాతకాలపు వస్తుమార్పిడి వ్యవస్థను తెరపైకి తెచ్చారు. చమురు ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన ఈ దేశం ఇప్పుడు  దాన్నే  టీకాలకు పెట్టుబడిగా మార్చుకునేందుకు సిద్ధమైంది.

👉తమకు టీకాలు ఇచ్చిన వారికి చమురు ఇస్తామని ఆ దేశ అధ్యక్షు డు నికోలస్‌ మదురో ప్రకటించారు.

👉వెనిజువెలా వద్ద చమురు ఉంది. దాన్ని కొనేందుకు వినియోగదారులూ సిద్ధంగా ఉన్నారు. అయితే, మా ఉత్పత్తిలో కొంత భాగాన్ని టీకా పొందేందుకు వినియోగించాలనుకుంటున్నాం. టీకాలిచ్చే వారికి చమురు ఇస్తాం అని నికోలస్‌ మదురో, వెనిజువెలా అధ్యక్షుడు ప్రకటించాడు.

👉వెనిజువెలా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించి ఉండటం తో  భారత్‌ వంటి దేశాలు అక్కడి నుంచి చమురు దిగుమతిని పూర్తిగా నిలిపివేశాయి.

👉ఇప్పటి వరకు వెనిజువెలాలో రష్యా రూపొందించిన స్పుత్నిక్‌ టీకాతో పాటు చైనాలో అభివృద్ధి చేసిన మరో టీకా వినియోగానికి మాత్రమే అనుమతులు లభించాయి.

👉ఆస్ట్రాజెనెకా రూపొందించిన టీకాను తాము అంగీకరించబోమని పాన్‌ అమెరికా హెల్త్‌ ఆర్గనైజేషన్‌(పీఏహెచ్‌ఓ)కు ఇప్పటికే వెనిజువెలా తెలిపింది.

👉మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెనిజువెలా పెద్ద మొత్తంలో రుణపడి ఉండటం తో WHO అనుమతించిన టీకాలు సైతం ఇప్పటి వరకు అక్కడికి చేరలేదు.

👉ప్రభుత్వ లెక్కల ప్రకారం.. వెనిజువెలాలో ఇప్పటి వరకు 1,50,000 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,500మంది మృతి చెందారు.

👉ఇటీవలి కాలంలో కేసులు మరోసారి భారీ స్థాయిలో విజృంభిస్తున్నాయి. బ్రెజిల్‌ వేరియంట్‌ ప్రబలరూపంగా ఉన్నట్లు గుర్తించారు.

👉వెనుజులా Venezuela దక్షిణ అమెరికా లోని ఒక సుసంపన్న దేశము. అధికారికంగా " బొలివేరియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనుజులా " అంటారు.ఫెడరల్ రిపబ్లిక్ అయిన ఇది దక్షిణ అమెరికా ఉత్తర సముద్రతీరంలో ఉంది.

రాజధాని: కారకాస్

కరెన్సీ: వెనుజులన్ బొలివర్

ఖండం: దక్షిణ అమెరికా

అధికారిక భాష: స్పానిష్ భాష

 

👉 వెనిజులా గురించి ఆసక్తికరమైన విషయాలు ?

  • వెనిజులాను 23 రాష్ట్రాలుగా విభజించారు. 
  • ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం వెనిజులాలో ఉన్న ఏంజెల్ ఫాల్స్ ఇది  3,000 అడుగుల ఎత్తు ఉంది . 
  • మరణశిక్షను తొలగించిన మొదటి దేశం వెనిజులా.

Post a Comment

0 Comments

Close Menu