👉మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా ...

 

👉ఏమిటి : రైళ్లలో ధూమపానం చేయడం, మండే వస్తువులను తీసుకెళ్లేవారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా

👉 ఎప్పుడు : ఇటివల

👉 ఎవరు : రైల్వే శాఖ

👉 ఎక్కడ : భారత్ లో

👉 ఎందుకు : రైళ్లలో ఇటీవల భారీగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో..


👉 రైళ్లలో ఇటీవల భారీగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తీవ్రమైన చర్యలు ప్రకటించింది రైల్వే శాఖ. రైళ్లలో ధూమపానం చేయడం, మండే వస్తువులను తీసుకెళ్లేవారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించనుంది.

👉 రైళ్లలో సిగరెట్‌, బీడీలు తాగడం, మండే స్వభావం ఉన్న వస్తువులను వెంట తీసుకెళ్లేవారికి భారీగా శిక్షలు విధించనుంది రైల్వే శాఖ.

👉 ఈ నేరానికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.వెయ్యి జరిమానా లేదా రెండూ పడనుంది. దాంతో పాటు మరో రూ.500 జరిమానా విధించనుంది.

👉 ఇటీవల జరిగిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎస్‌-5 బోగీ మంటల్లో చిక్కుకోవడానికి సిగరెట్‌ లేదా బీడీ కారణమని ప్రాథమిక నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

👉 7 రోజుల అవగాహన కార్యక్రమం..అగ్ని ప్రమాదాల నివారణపై ప్రయాణికులు, ఉద్యోగులు సహా మిగిలినవారికి పూర్తి స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని జోనల్ రైల్వేలకు రైల్వే శాఖ సూచించింది.

👉 ఈ మేరకు 7 రోజుల అవహగాహన కార్యక్రమం ప్రారంభించాలని పేర్కొంది.కరపత్రాలు ముద్రించడం, స్టిక్కర్లు అంటించడం, వీధి నాటకాల ప్రదర్శన, మైకుల ద్వారా ప్రచారం, అన్ని రకాల మీడియా ద్వారా ప్రచారం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది.

Post a Comment

0 Comments

Close Menu