👉 పెద్ద పెద్ద షిప్‌‌ల కోసం సొరంగం ప్రపంచంలో మొదటిది

 👉ఏమిటి : పెద్ద పెద్ద షిప్‌‌ల కోసం సొరంగం

 👉ఎప్పుడు : ఇటివల  

  👉ఎవరు :  నార్వే

  👉ఎక్కడ : నార్వేలోని స్టాడవెట్ సముద్రంలో

 👉ఎందుకు :  ఇక్కడ తుఫాన్లు, హరికేన్లు చాలా ఎక్కువగా వస్తుంటాయి ఆకారణం చేతనే ఈ నిర్ణయం.

 👉పెద్ద పెద్ద షిప్‌‌లు సొరంగాల్లో ప్రయాణం చేయడం...ఇది ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఒక ఇంజనీరింగ్ అద్భుతాన్ని నిర్మించబోతోంది నార్వే దేశం.

 👉నార్వేలోని స్టాడవెట్ సముద్రంలో వాయవ్య ప్రాంతంలో తుఫాన్లు, హరికేన్లు చాలా ఎక్కువగా వస్తుంటాయి ఆకారణం చేతనే ఈ నిర్ణయం తీసుకొన్నారు.

 👉ఆ ప్రాంతం మీదుగా వెళ్లే షిప్‌‌లు రోజుల తరబడి లంగర్ వేసి ఒక చోట ఆగిపోవాల్సిన పరిస్థితిఏర్పడుతోంది.

 👉ఈ ప్రాంతంలో సముద్రంలోకి సన్నగా విస్తరించి ఉన్న భూభాగంలో పెద్ద పర్వతం ఉంది ఇదే ఇప్పుడు పరిష్కారం చూపింది.

 👉ఈ పర్వతం తొలిచి సొరంగం నిర్మిస్తే సముద్రంలో చుట్టూ తిరిగి వచ్చే పని తప్పిపోతుంది. వాతావరణం బాగోనప్పుడు రోజుల తరబడివేచి  ఉండాల్సిన పని కూడా ఉండదు.

 👉అందుకే షిప్ టన్నెల్ నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు.

 👉దశాబ్దాలుగా ఈ ప్రాజెక్ట్ పెండింగ్‌‌లో ఉందని, ఎట్టకేలకు ఇప్పుడు నిర్మాణానికి అన్ని అనుమతులు క్లియర్ అయ్యి, డిజైన్స్‌‌ కూడా రెడీ అయ్యాయని తెలిపింది అని తెలిపారు.

 👉భారీ కార్గో షిప్‌‌లు కూడా ప్రయాణం చేయగలిగేలా ఓ టన్నెల్ నిర్మించబోతున్నట్లు నార్వే చెబుతోంది.

 👉దీనిని 2025–26మధ్య పూర్తి చేయాలని ఆ దేశం టార్గెట్‌‌గా పెట్టుకుంది.

 👉ఇది 51వేల అడుగుల మీటర్ల పొడవు, 1,120 అడుగుల ఎత్తు, 775అడుగుల వెడల్పు ఉండేలా నిర్మిస్తారు.

 👉ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.2,390 కోట్లు (33 కోట్ల డాలర్లు) ఖర్చవుతుందని నార్వే అధికారులు అంచనా వేస్తున్నారు.

 👉 సొరంగం నిర్మాణంలో భాగంగా 30లక్షల క్యూబిక్ మీటర్ల కొండ రాళ్లను తొలగించాల్సి వస్తుంది.

 👉నార్వే ఉత్తర ఐరోపాకు చెందిన దేశము.అధికారికంగా " కింగ్డం ఆఫ్ నార్వే " యూనిటరీ"మొనార్చీ"అంటారు. స్కాండినేవియా ద్వీపకల్పము పశ్చిమ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.జాన్ మేయెన్, స్వాల్‌బార్డ్ ద్వీపసమూహం ఇందులో భాగంగా ఉన్నాయి. ఐరోపా మొత్తంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన దేశాల్లో ఇది ఒకటి.

  • కరెన్సీ: నార్వేజియన్ క్రోన్
  • రాజధాని, అతిపెద్ద నగరం: ఓస్లో
  • ఖండం: ఐరోపా
  • అధికారిక భాష: నార్వేజియన్ భాష

👉నార్వే చుట్టూ ఏ సముద్రం ఉంది?

ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం

👉నార్వేజియన్ సముద్రం, నార్వేజియన్ నార్స్కెహావేట్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం యొక్క విభాగం, గ్రీన్లాండ్ మరియు బారెంట్స్ సముద్రాల సరిహద్దులో ఉంది (వాయువ్య దిశ నుండి ఈశాన్య దిశలో); నార్వే (తూర్పు); ఉత్తర సముద్రం, షెట్లాండ్ మరియు ఫారో దీవులు మరియు అట్లాంటిక్ మహాసముద్రం (దక్షిణ); మరియు ఐస్లాండ్ మరియు జాన్ మాయెన్ ద్వీపం (పడమర).

👉సముద్రం గరిష్టంగా 13,020 అడుగుల (3,970 మీ) లోతుకు చేరుకుంటుంది మరియు ఇది 1,000 కి 35 భాగాల లవణీయతను నిర్వహిస్తుంది.

👉గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఫారో దీవులు మరియు ఉత్తర స్కాట్లాండ్లను కలిపే జలాంతర్గామి శిఖరం నార్వేజియన్ సముద్రాన్ని బహిరంగ అట్లాంటిక్ నుండి వేరు చేస్తుంది.

👉ఆర్కిటిక్ సర్కిల్ చేత కత్తిరించబడిన ఈ సముద్రం తరచుగా ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రంతో ముడిపడి ఉంటుంది.

👉వెచ్చని నార్వే కరెంట్ నార్వే తీరంలో ఈశాన్య దిశగా ప్రవహిస్తుంది మరియు సాధారణంగా మంచు రహిత పరిస్థితులను ఉత్పత్తి చేస్తుంది.

👉ఈ వెచ్చని నీటితో కలిపే శీతల ప్రవాహాలు అద్భుతమైన ఫిషింగ్ మైదానాలను (ప్రధానంగా కాడ్, హెర్రింగ్ మరియు వైట్ ఫిష్ కోసం) సృష్టిస్తాయి, ముఖ్యంగా ఐస్లాండ్ మరియు నార్వే తీరప్రాంతాలు మరియు షెట్లాండ్ మరియు ఫారో దీవుల చుట్టూ ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu