👉 తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి : మద్రాస్​ హైకోర్టు

👉 ఏమిటి : తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి మద్రాస్​ హైకోర్టు

👉ఎప్పుడు : మార్చి 31 ౨౦౨౧  

 👉ఎవరు : మద్రాస్​ హైకోర్టు

👉ఎక్కడ : మద్రాస్​    

👉ఎందుకు: తమ కూతురు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం తెలిపిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని మద్రాస్​ హైకోర్టు ఆదేశించింది.

👉 స్వలింగ సంపర్కుల మధ్య పెళ్ళిళ్లను చట్టబద్ధం చేసిన తొలి దేశం ఏది ?

👉ఏ బ్రిటీష్‌ పాలకుడు 1860వ సంవత్సరంలో స్వలింగసంపర్కానికి సంబంధించిన  సెక్షన్‌ను భారత శిక్ష్మా స్మృతిలో ప్రవేశపెట్టారు.??

👉స్వలింగసంపర్కానికి సంబంధించిన  సెక్షన్‌ను భారత శిక్ష్మా స్మృతిలో ఎన్నవది ?

👉 స్వలింగ వివాహం భారతదేశంలో  చేసుకోవచ్చా ?

👉తమ కూతురు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం తెలిపిన తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని మద్రాస్​ హైకోర్టు ఆదేశించింది.

👉ఈ కేసును పరిశీలించాక స్వలింగ వివాహాలపై తనకున్న పాత ఆలోచనలను మార్చుకున్నానని జస్టిస్​ ఎన్​ ఆనంద్​ వెంకటేశ్​ తెలిపారు.

👉వివాహం చేసుకోవాలనుకుంటున్న తమకు తల్లిదండ్రుల నుంచి ప్రమాదం ఉందంటూ మద్రాస్​ హైకోర్టును ఇద్దరు అమ్మాయిలు ఆశ్రయించారు.

👉ఇరువురి వాదనలు విన్న అనంతరం ధర్మాసనం ఈ మేరకు తల్లిదండ్రుల్ని ఆదేశించింది.రెండు సంవత్సరాలుగా తమ మధ్య పరిచయం ఉందని పిటిషనర్లు తెలిపారు.

👉తమ స్నేహం ప్రేమగా మారిందని.. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు.

👉అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని కోర్టుకు తెలిపారు.

👉పిటిషనర్లలో ఒక అమ్మాయి వయస్సు 22ఏళ్లు. బీఎస్సీ పూర్తిచేసి ఎంబీఏ చదువుతోంది. మరో అమ్మాయి వయస్సు 20 సంవత్సరాలు ఉన్నాయి.

👉స్వలింగ సంపర్కము అనగా ఇద్దరు పురుషుల మధ్య లేదా ఇద్దరు స్త్రీల మధ్య ఉండే లైంగిక సంబంధము. ఈ లైంగిక సంబంధము సృష్టి విరుద్ధమని అందరూ భావిస్తారు. కానీ, ఇది సృష్టికి విరుద్ధమేమీ కాదని, ప్రాకృతికమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. వైద్య శాస్తం ప్రకారం కూడా స్వలింగ సంపర్కము ఒక మానసిక వ్యాధియో, లేక జన్యుపరమైన లోపమో కాదని, లైంగికతలో ఒక భిన్నమైన కోణంగా దీనిని పరిగణించాలని ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు నిర్ధారించాయి. ఇటీవల దీనిని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ కూడా ఆమోదించింది.

👉భారతీయ శిక్షాస్మృతి (ఐపిసీ 377 సెక్షన్) ప్రకారం స్వలింగ సంభోగం నేరంగా పరిగణింపబడుతుంది. అయితే, ఢిల్లీ హైకోర్టు 2.7.2009న ఇద్దరు వయస్కుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంభోగం నేరం కాదని, సెక్షన్ 377 భారత రాజ్యాంగంలోని అధికరణాలు 14, 15, 21ల ప్రకారం తప్పని తీర్పు ఇచ్చింది.

👉బ్రిటీష్‌ పాలకుడు లార్డ్‌ మెకాలే 1860వ సంవత్సరంలో స్వలింగసంపర్కానికి సంబంధించిన 377 సెక్షన్‌ను భారత శిక్ష్మా స్మృతిలో ప్రవేశపెట్టారు. అప్పుడు ఈ సెక్షన్‌ ప్రకారం ఎవరైనా ప్రకృతి ఆదేశాలకు విరుద్ధంగా స్వచ్ఛందంగా ఒక పురుషుడితో కాని, మహిళ లేదా జంతువులతో కానీ భౌతికంగా సంభోగిస్తే జీవిత కాల శిక్షార్హులు. ఈ శిక్షను మరో పదేళ్లపాటు పొడిగించే అవకాశంతో పాటు జరిమానా విధించవచ్చుఅని అందులో పొందుపరిచారు.

👉 స్వలింగ సంపర్కుల మధ్య పెళ్ళిళ్లను చట్టబద్ధం చేసిన తొలి దేశం డెన్మార్క్.

👉ఆ తర్వాత ఉరుగ్వే, న్యూజీలాండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, కెనడా, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే, పోర్చుగల్, ఫ్రాన్స్, బ్రెజిల్, బెల్జియం, ఐస్‌ల్యాండ్, అర్జెంటీనా వంటి దేశాలు స్వలింగ సంపర్కుల మధ్య పెళ్ళిళ్లను చట్టబద్ధం చేశాయి.

👉 స్వలింగ వివాహం భారతదేశంలో  చేసుకోవచ్చా ??

👉స్వలింగ వివాహాలు భారతదేశంలో చట్టబద్ధంగా గుర్తించబడలేదు లేదా స్వలింగ జంటలు సివిల్ యూనియన్ లేదా దేశీయ భాగస్వామ్యం వంటి పరిమిత హక్కులను ఇవ్వవు. 2011 లో, హర్యానా కోర్టు ఇద్దరు మహిళలతో కూడిన స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu