👉 అత్తారింట్లో ఎవరు వేధించినా.. బాధ్యత భర్తదే

 

👉 ఏమిటి : అత్తారింట్లో మహిళను ఎవరు వేధించినా.. బాధ్యత కట్టుకున్న భర్తదే

👉 ఎప్పుడు :  ఇటివల   

👉 ఎవరు : సుప్రీం కోర్టు తీర్పు

👉 ఎక్కడ : భారత్ లో

👉 ఎందుకు  : మహిళలపై వేధింపులకు బాధ్యతలు ఉండాలి

👉మహిళలపై వేధింపులకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అత్తారింట్లో మహిళలపై వేధింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.



👉 అత్తారింట్లో మహిళను ఎవరు వేధించినా.. బాధ్యత కట్టుకున్న భర్తదే అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది.

👉 వేధింపుల కేసులో భర్తకు ముందస్తు బెయిల్‌ ఇవ్వడాన్ని కూడా సుప్రీం నిరాకరించింది.

👉 ఈ తీర్పుపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల అత్తారింట్లో మహిళలకు వేధింపులు బాగా ఎక్కువవుతున్నాయి.

👉 అదనపు కట్నం తీసుకురావాలని లేదా మరో కారణంతో అత్తారింట్లో మహిళలు వేధింపులకు గురవుతున్నారు.

👉 ఈ క్రమంలో సుప్రీం తీర్పు మహిళల్లో భరోసా నింపుతుందని మహిళా సంఘాలు చెబుతున్నాయి.

👉 పంజాబ్‌కు చెందిన ఒక మహిళ భర్తపై వేధింపుల కోసం పెట్టింది. అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ భర్త మహాజన్ సుప్రీంను ఆశ్రయించాడు.

👉 ఈ కేసు విచారణ సందర్భంగా.. అత్తివారింట్లో భార్య ఎలాంటి వేధింపులు గురైనా బాధ్యత భార్యదే అతి తీర్పు ఇచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu