👉 పరిశ్రమలనేనా దేశాన్ని కూడా అమ్మేస్తారా ?

పరిశ్రమలనేనా దేశాన్ని కూడా అమ్మేస్తారా ?
  • విశాఖ ఉక్కు-ఆంధ్రుల ఆత్మగౌరవం
  • ఆత్మగౌరవం అమ్మేస్తుంటే చూస్తుండిపోతారా? కాపాడుకుంటారా?
  • ఎందుకు ఈ ప్రైవేటీకరణ? ఎవరికోసం? ఏం సాధించాలని ? ఎవరిని ఉద్ధరించాలని ?
  • రాజకీయ ప్రాబల్యం లేని పార్టీలకి ప్రజల మనోభావాలు పట్టవా ?
  • ఆంద్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీల తీరుతెన్నులు
  • ఒకవైపు ప్రైవేటీకరణ కు వేగంగా చర్యలు మరోవైపు  20,400 టన్నుల అల్ టైం రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి సామర్ధ్యాన్ని చూపుతున్న పరిశ్రమ కార్మికులు
  • విశాఖ ఉక్కు విషయంలో ఏమి జరగవచ్చు
                విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ తెన్నేటి విశ్వనాధం ఆ మహానుభావుడు నడిపిన ఉద్యమం లో భాగంగా, 1966 నవంబర్ ఒకటో తేదీ.. విశాఖపట్నంలో ప్రదర్శన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ముగ్గురు విద్యార్థులు, మరో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఆ రోజు విశాఖతో పాటు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో మొత్తం 32 మంది చనిపోయారు
              ఎన్నో పోరాటాల మధ్య ఆంధ్ర ప్రజల ఉక్కు సంకల్పానికి తలొగ్గి అప్పటి దేశ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ 1970 ఏప్రిల్ 10 విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది.
(ఇప్పుడున్న సమకాలీన ప్రధానులు, మంత్రులు,పార్లమెంట్ సభ్యులు సాక్షాత్తు పార్లమెంట్ లో చేసిన వాగ్ధానాలు, చెప్పిన మాటలకు గౌరవం లేదు విలువ లేదు విశ్వసనీయత లేదనుకోండి). కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలను 1970లో దానం చేసారు. 1971 జనవరి 20న శ్రీమతి ఇందిరా గాంధీచేత కర్మాగారం యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
               3.6 MTగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3MTకి పెంచే రూ. 8,692కోట్ల విస్తరణ ప్రాజెక్టుని దేశ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ 2009 మే 29న ప్రారంభించారు.(బిడ్డల పై మమకారం రక్తసంబంధీకులకు ఉన్నంతగా పెంపుడు మనుషులకి ఉండదు కదా)
              విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రారంభ దశనుండి కూడా ఆంధ్రుల ఆత్మస్తైర్యం వలే దినదినాభివృద్ది చెందుతూనే ఉంది.
           దేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది అనతి కాలంలోనే "నవరత్నాలు" హోదా పొందగలిగింది అంతలా శ్రమించి ఫలితాలు రాబట్టినారు ఉక్కు కార్మికులు(ఆంధ్రులు). ఎక్కడో ఎప్పుడో సర్వసాధారణం గా సొంత గనుల లేక ఒకటో రెండో సార్లు నష్టాలు వచ్చినంత మాత్రాన ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం ఎంతవరకు సమంజసం? గత అర్థశతాబ్దపు కాలంలో 2 % లేదా 3 % సార్లు నష్టాలకు అమ్మేస్తుంటే మరి మిగిన 97% సార్లు లాభాలు గణించిన వాటిని పరిగణలోకి తీసుకోరా ?


👉ఎందుకు ఈ ప్రైవేటీకరణ ? ఎవరికోసం ? ఏం సాధించాలని? ఎవరిని ఉద్ధరించాలని ?

              రాజకీయ పార్టీల విషయానికి వద్దాం జాతీయ పార్టీలు కావొచ్చు ప్రాంతీయ పార్టీలు కావొచ్చు స్థాపించాక ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేక ఓడిపోతే? , పోనీ గెలిచిన తరువాత మళ్ళీ గత కొంతకాలానికి ఓడిపోతే ? ఎన్నికల్లో గెలవలెకున్నాం పార్టీని నడపాలంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది ఎవరికైనా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేద్దాం అని అమ్మేస్తున్నారా ? వేరే రాజకీయ పార్టీలో కలిపేస్తారు తప్పా ? అలాంటి ఆలోచన విశాఖ ఉక్కు విషయంలో ఎందుకు చేయట్లేదు ? వేరే ప్రభుత్వ సంస్థ తో కలపొచ్చు కదా. ఇప్పుడు విశాఖ ఉక్కు ని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ నే తీసుకుందాం పార్టీ స్థాపించాక ఎన్ని ఏళ్లకు అధికారం లోకి వచ్చింది ? మధ్యలో ఎన్ని ఎన్నికల్లో ఓటమి చూసారు ఏ? పార్టీని ఏ ప్రైవేట్ వ్యక్తులకో అమ్మేయలేదే ? 
           ఆంద్రప్రదేశ్ లో బీజేపీ కి వోట్ బ్యాంక్ లేదు 1 శాసనసభ్యుడు, 1 పార్లమెంట్ సభ్యుడు కూడా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఆంధ్ర ప్రజల మనోభావాలతో మాకు పనేంటి అని ఆలోచిస్తుందేమో కేంద్ర ప్రభుత్వం. కానీ ఆంద్రప్రదేశ్ భారత దేశంలోనే ఉంది ఈ విషయాన్ని ప్రభుత్వాలు మరచిపోతే ప్రజలు మాత్రం బాగా గుర్తుంచుకుంటారు తగిన పాఠం చెప్తారనడం సందేహం లేదు.

👉 ఆంద్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీల తీరుతెన్నులు

అధికార YSRCP :

      మొదటగా ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్ గారు ప్రధానికి లేఖరాయడం అందులో ఆంధ్రుల మనోభావాలతోపాటు సాధ్యాసాధ్యాలు ప్రస్తావించడం , సొంత గనుల కేటాయించమనడం, అవసరం అయితే రాష్టప్రభుత్వమే తీసుకుంటుంది అనడం తో పాటు పార్టీ మరియు ప్రభుత్వం పరంగా ప్రైవేటీకరణ ను వ్యతిరేకించడం, ఉద్యమాలకు సంఘీభావం తెలపడం, ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా పాదయాత్రలు చేయడం, పార్లమెంట్ లో ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా మాట్లాడటం వంటివి చేస్తున్నా .. గత ప్రభుత్వం (టీడీపీ) ఉన్నప్పేదే బీజం పడింది అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు తెలిసి కూడా మౌనంగా వున్నారు వంటి రాజకీయ విమర్శలు చేస్తూనే ఉంది. 
       ఇది సరిపోద్దా? విశాఖ ఉక్కుని కాపాడు కోగలమా ? అనేది నెమరువేసుకోవాలి తీవ్రత పెంచాలి అవసరం అయితే సాక్షాత్ ముఖ్యమంత్రే నిరాహారదీక్ష కు కూర్చోవాలి అలా చేస్తే ఫలితం ఉండొచ్చేమో. అవకాశం ఉన్న ఏ ఒక్క మార్గాన్ని విడిచిపెట్టకుండా పోరాడితే సాదించుకోగలం.

ప్రతిపక్ష టీడీపీ: 

          కార్మిక సంఘాలకి సంఘీభావం తెలపడం, దీక్షలు చేయడం, రాష్టప్రభుత్వం పై వత్తిడి తేవడం లో ముందు వరుసలోవున్నా దానితో పాటు  ప్రభుత్వాన్ని నిందించడం , రాజకీయ విమర్శలు చేయడం మాని వాస్తవంలోకి రావాల్సిన అవసరం ఉంది. అధికార పక్షానికి సూచనలు చేస్తూ ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష నేత శ్రీ చంద్రబాబు గారు ఆయన స్థాయికి తగ్గ ప్రణాళిక విశాఖ ఉక్కుపై చూపడట్లేదేమో అనిపిస్తుంది. అమరావతి ఉద్యంలో చంద్రబాబు గారు చూపిన ఆసక్తి విశాఖ ఉక్కు మీద చూపట్లేదేమో అనిపిస్తుంది. ఆయనకున్న రాజకీయ సంబంధాలను ఉపయోగించుకొని కేంద్రంలో పెద్దలతో చర్చించి అవసరం అయితే అమరావతి ఉద్యమంలో ఏవిధంగా అయితే న్యాయపరంగా పోరాటం చేస్తున్నారో అదే తరహాలో చేస్తే ఫలితం ఉండొచ్చు. 

కాంగ్రెస్ పార్టీ:

         ఆంధ్రప్రదేశ్ కి చేయాల్సిన ద్రోహం అంతా చేసి, ఏమి ఎరగనట్టు ప్రేక్షక పాత్రలో ఉండిపోతుంది. తప్పు రాష్ట్ర ప్రభుత్వానిది , కేంద్ర ప్రభుత్వానిది వాళ్లది వీళ్ళది అని కేవలం రాజకీయ విమర్శలకు పరిమితం అయిపోయింది.ఇప్పటికైనా కేంద్రంలో ప్రతిపక్షం లో ఉన్న వాళ్ళ రాజకీయ పెద్దలతో చర్చించి గతంలో ఆంధ్రకు చేసిన ద్రోహాన్నికి ప్రతిగా కొంత అయిన విశాఖ ఉక్కు లో సహాయపడి ఆంధ్ర ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

బీజేపీ పార్టీ:

         వాళ్ళు నమ్మిన సిద్ధాంతం అది అందరికీ ఆమోదయోగ్యమా కదా అనేది పరిగణలోకి తీసుకోకుండా గుడ్డిగా ముందుకు సాగిపోయే తత్వం. జీ.యస్.టీ కానివ్వండి,నోట్లరద్దు కానివ్వండి, బ్యాంకులు విలీనం కానివ్వండి, బ్యాంకులు ప్రైవేటీకరణ కానివ్వండి ఇపుడు చేయబోతున్న పరిశ్రమల ప్రైవేటీకరణ వరకు ఏదైనా సరే వారి పార్టీ పెద్దలు అనుకుంటే దేశమంతా అమలు జరగాల్సిందే అన్నట్టుంది వారి వ్యవహారం. విశాఖ ఉక్కు దగ్గరకొస్తే బీజేపీ వాళ్ళు చెప్పేది నష్టాల్లో ఉంది అమ్మేస్తున్నాం మరి భారతదేశం మొత్తం మీద ఎన్ని పరిశ్రమలు నష్టాల్లో ఉన్నాయి ? అన్నీ అమ్మేశారా? పోనీ ప్రధానమంత్రి సొంత రాష్టం గుజరాత్ లో ఎన్ని పరిశ్రమలు నష్టాల్లో ఉన్నాయి ? అవన్నీ అమ్మేశారా ? అంటే వాటికి సమాధానం లేదు.బీజేపీ అధికారంలో ఉన్న రాష్టల విషయంలో అయితే కొంచం ఆలోచిస్తారేమో బీజేపీ కి ప్రాధాన్యత లేని రాష్టాలల్లో ప్రజల మనోభావాలు అస్సలు పట్టించుకోరేమో. గతంలో రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ తో చేయికలిపి ఆంద్రకి చాలా ద్రోహమే చేశారు మళ్ళీ అదే ధోరణితో ముందుకు పోతే తగిన మూల్యం చెల్లించుకోవలేమో.

👉 వామపక్షాలు, కార్మిక, ప్రజా సంఘాల తీరు:

           వీరు పోరాడటంలో రాజీపడకుండా చేస్తున్నారు రాజకీయాల జోలికి వెళ్లకుండా తమవంతు తాము అన్నివిధాల పోరాడుతున్నపటికి వారికి ప్రజాలనుండి మద్దతు లభిస్తున్న రాష్ట్రప్రభుత్వం, ప్రతిపక్షం అండదండలు ఇంకా పూర్తి స్థాయిలో అవసరం. 
            ఒకవైపు ప్రైవేటీకరణ కు వేగంగా చర్యలు జరుగుతున్న వేళా మరోవైపు  ఎపుడు లేనంతగా మార్చ్ 23 2021 తేదీన 20,400 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యాన్ని చూపుతున్న పరిశ్రమ కార్మికులు ఇది అల్ టైం రికార్డ్ .

👉 విశాఖ ఉక్కు విషయంలో ఏమి జరగవచ్చు:

      నష్టాలు వస్తున్నాయన్న సాకుతో పరిశ్రమలని ఆర్థిక పరిస్థితి సరిలేదని దేశాలన్నీ అమ్మేస్తారా ?
         గత అనుభవాల దృష్ట్యా బీజేపీ ప్రభుత్వం ఏదైనా చేయడలుచుకుంటే చేసి తీరుతుంది అది ప్రజల మద్దతు వున్నా లేకున్నా ఉదాహరణకి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన సమయంలో ముక్తకంఠంతో ఆంధ్ర ప్రజలు విభజన వద్దు అన్నా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి విభజనను వ్యతిరేకించినా ఆనాడు కేంద్రంలో ప్రతిపక్షలో ఉన్న బీజేపీ ప్రజల పక్షాన ఉండకుండా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడంతో మాత్రమే విభజన జరిగింది ఆరోజు బీజేపీ ఆంధ్ర ప్రజలకి మద్దతు ఇచ్చి ఉంటే విభన జరిగేది కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఆవిభవించిన ఆంధ్రాబ్యాంక్ విషయంలో జరిగింది కూడా ఇదే ఆంధ్రప్రదేశ్ కోడలిని అని చెప్పుకునే ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలోనే ఆంధ్రాబ్యాంకు వేరే బ్యాంకు లో విలీనం అయ్యింది ఎన్నో వినతులు ఇచ్చినప్పటికీ కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు కదా కనీసం ఆంధ్రా అన్న పేరే వినపడకుండా చేశారు బీజేపీ పెద్దలు దీనికి కారణం? ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కి ప్రాబల్యం లేదు రాదు జరగదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలతో పనిలేదు.
        ఇన్ని అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కావొచ్చు ప్రతిపక్ష పార్టీలు కావొచ్చు వామపక్ష ప్రజా, కార్మిక సంఘాలు కావొచ్చు...
 
         రాజకీయాలు ఎన్ని ఉన్నా.. ‘‘పోరాడనిదే ఆంధ్రులకు ఏ హక్కులూ రావు’’ అన్న నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారి మాటలు గుర్తు తెచ్చుకుని అందరూ ఏకతాటిపై వచ్చి విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సిన సమయం అసన్నమయ్యింది. పోరాటాన్ని ఇంకా తీవ్రస్థాయికి తీసుకెళ్లాలి, అవసరం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నేతలిద్దరు కలిసి నిరాహార దీక్షకు దిగాలి . ఏమాత్రం అలసత్వం చూపిన రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని చంపేసివారిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

       పోరాటంతో సాదించుకోలేని పక్షంలో అన్ని దారులు మూసుకుపోయిన సరే చివరి అస్త్రంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియలో టెండర్లు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొని ఎంత వ్యయప్రాసలుకు అయిన వెనకాడక ప్రైవేట్ వ్యక్తుల చేతులలోకి పోనివ్వకుండా కాపాడుకోవాలి.
✊ విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు 
   విశ్లేషకులు : ఆర్.కె.శాతరాసి
                  : +91 9629301038
x

Post a Comment

0 Comments

Close Menu