👉 డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోండి ఇలా

 

👉 ఏమిటి : ఆధార్-ప్రామాణీకరణ ఆధారిత కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించింది

👉 ఎప్పుడు : ఇటివల   

👉 ఎవరు : కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ

👉 ఎక్కడ : భారత్ లో

👉 ఎందుకు  : పరిపాలన  సులభతరం చేయడానికి  

👉 కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఆధార్-ప్రామాణీకరణ ఆధారిత కాంటాక్ట్‌లెస్ సేవలను ప్రారంభించింది.

👉 ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడంతో సహా 18 సేవలనుఆన్‌లైన్‌ ద్వారా ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

👉 ఆధార్ ప్రామాణీకరణత గల కొన్ని సేవలు ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసిన దాదాపు 3వారాల తర్వాత తీసుకోని రానున్నారు.

👉 ప్రస్తుతం పరివాహన్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పునరుద్ధరించవచ్చో తెలుసుకోండి.

  • దశ 1: పరివహన్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ పరివాహన్.గోవ్.ఇన్‌ లేదా మీ రాష్ట్ర సంబంధిత ఆర్టీఓ వెబ్‌సైట్ కు వెళ్ళాలి
  • దశ 2: పోర్టల్‌లోని కనిపించే ఆన్‌లైన్ సర్వీస్విభాగంలో గల డ్రైవింగ్ లైసెన్స్ సంబంధిత సేవలుఎంచుకోవాలి .
  • దశ 3: ఇప్పుడు క్రొత్త విండో ఓపెన్ అవుతుంది, అక్కడ మీ రాష్ట్ర పేరును ఎంచుకోవాలి.  
  • దశ 4: ఆపై డ్రైవింగ్ లైసెన్స్ ‌రెన్యువల్ సేవలను ఎంచుకోండి.
  • దశ 5: ఇప్పుడు, మీ దరఖాస్తు ఫారమ్‌ను ఎలా పూరించాలో మీకు సూచనలు వస్తాయి. వాటిని పూర్తిగా చదివిన తర్వాత 'కొనసాగింపు'పై క్లిక్ చేయండి.
  • దశ 6: మీ పుట్టిన తేదీ, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పిన్‌కోడ్, ఇతర వివరాలు దగ్గర పెట్టుకోండి
  • దశ 7: ఇప్పుడు మీ వ్యక్తిగత లేదా వాహన సంబంధిత వివరాలను నింపండి.
  • దశ 8: తర్వాత మీ ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.  
  • దశ 9: మీరు ఈ ప్రక్రియ పూర్తీ చేశాక మీరు మీ అప్లికేషన్ ఐడిని చూడగలిగే రసీదు పేజీ కనిపిస్తుంది. అలాగే, మీకు అన్ని వివరాలతో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది.
  • దశ 10: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఛార్జీని ఆన్‌లైన్‌ ద్వారా లేదా కార్యాలయానికి వెళ్లి చెల్లించవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu