👉అమెరికా సర్జన్ జనరల్​ గా భారతీయ అమెరికన్

 

👉ఏమిటి : అమెరికా సర్జన్ జనరల్ పదవికి భారతీయ అమెరికన్

👉 ఎప్పుడు : ఇటివల  

👉 ఎవరు :  వివేక్ మూర్తి

👉 ఎక్కడ : అమెరికా

👉 ఎందుకు : సర్జన్ జనరల్ జెరోమ్ అడమ్స్ స్థానంలో మూర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు

👉 అమెరికా సర్జన్ జనరల్ పదవికి భారతీయ అమెరికన్ వైద్యుడు వివేక్ మూర్తిని ఎంపిక చేస్తూ జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని సెనేట్ ఆమోదించింది.

👉 57-43 ఓట్ల తేడాతో ఆయన నియామకాన్ని సెనేటర్లు సమర్థించారు.

👉ఏడుగురు రిపబ్లికన్లు సైతం మూర్తికి మద్దతుగా ఓటేశారు.

👉కరోనా సహా ప్రజారోగ్య విషయాల్లో అధ్యక్షుడికి సలహాదారుడిగా వ్యవహరించనున్నారు వివేక్.

👉కరోనా కట్టడి దిశగా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నారు.

👉బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనూ ఓసారి అమెరికా సర్జన్ జనరల్గా పనిచేశారు వివేక్.

👉సెనేట్లో తన ఎంపికపై మాట్లాడిన వివేక్.. గత ఏడాది కాలంగా దేశం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు.

👉వీటిని చక్కదిద్దేందుకు చట్టసభ్యులతో కలిసి పనిచేస్తానని చెప్పారు.ప్రస్తుతం బైడెన్ కొవిడ్-19 సలహా బృందంలోని ముగ్గురు సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు వివేక్ మూర్తి. ప్రజా ఆరోగ్య విభాగంలో ప్రభుత్వ చీఫ్గా నాలుగేళ్ల పాటు వ్యవహరించనున్నారు.

👉 ప్రస్తుత సర్జన్ జనరల్ జెరోమ్ అడమ్స్ స్థానంలో మూర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు.

👉వివేక్ హల్లెగెర్ మూర్తి (కన్నడి: జూలై 10, 1977 న జన్మించారు) ఒక అమెరికన్ వైద్యుడు ఇతను యునైటెడ్ స్టేట్స్ యొక్క 21 వ సర్జన్ జనరల్ గా పనిచేస్తున్నాడు. అతను గతంలో 2014 నుండి 2017 వరకు 19 వ సర్జన్ జనరల్‌గా కూడా పనిచేశాడు.

  • పుట్టిన తేదీ: 10 జులై, 1977 (వయస్సు 43 సంవత్సరాలు)
  • పుట్టిన స్థలం: హడ్డర్స్‌ఫీల్డ్, యునైటెడ్ కింగ్డమ్
  • పార్టీ: డెమోక్రాటిక్ పార్టీ

Post a Comment

0 Comments

Close Menu