👉తమిళ తంబీలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ?

 

👉తమిళ తంబీలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ?

👉 OPS & EPS ద్వయం ఈసారి నెగ్గేనా ?

👉 స్టాలిన్ కష్టానికి ఫలితం దక్కేనా ?

👉 సూపర్ స్టార్ రజనీకాంత్ స్నేహితుడు కమలహాసన్ ప్రభావమెంత ?

👉 బీజేపీ , కాంగ్రెస్ ల పాత్ర నామమాత్రమేనా ?

👉 మొత్తానికి వార్ వన్ సైడ్ ఏ నా ?

                తమిళనాడు దక్షిణ భారతదేశంలో రాజకీయాలకు,వ్యక్తిపూజ ఎక్కువగా చేసే  రాజకీయాలకు ప్రసిద్ధి. దివంగత అన్నాదురై, కరుణానిధి,MG రామచంద్రన్,జయలలిత వంటి ఎందరో రాజకీయ ఉద్దండులు ప్రాతినిథ్యం వహించిన రాష్టం.తమిళనాడు లో రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా ప్రధానంగా రెండు పార్టీలదే ఆధిపత్యం వారే D.M.K , AIDMK  పార్టీలు.గత ఎన్నికలవరకు ఉన్న రాజకీయ ఉద్దండులు కరుణానిధి మరియు జయలలిత లు అనారోగ్యంతో మరణించడం అనంతరం రాజకీయ సమీకరణాలు మారడం వెంటవెంటనే జరిగిపోయాయి.మొదటిసారిగా రాజకీయ ఉద్దండులు లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో కాస్త ఆసక్తే నెలకొంది.

                దివంగత కరుణానిధి ఒకానొక సమయంలో నా రాజకీయ వారసుడు D.M.K పార్టీ బాధ్యతలను సమర్ధవంతంగా నడపాలిగేది నా కుమారుడు స్టాలిన్ మాత్రమే అని బహిరంగంగా ప్రజలకే చెప్పడం జరిగింది . అప్పటి నుండి కూడా స్టాలిన్ పార్టీ వ్యవహారాలు అన్నీ తానే అయ్యి నడిపిస్తుండేవాడు తండ్రి నుంచి పుణికిపుచుకున్న వారసత్వ లక్షణాలు కానివ్వండి , నాయకత్వ లక్షణాలు కానివ్వండి తన తండ్రి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో నేర్చుకున్న అనుభవాలు కానివ్వండి స్టాలిన్ యెక్క అదనపు బలాలు.

               అదేవిధంగా దివంగత జయలలిత తన తరువాత రాజకీయ వారసులను తయారు చేయకపోవడం వల్ల తన మరణానంతరం AIDMK  పార్టీ లో వచ్చిన చీలికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం చూసాం. జయ కు నమ్మిన బంటులు గా ఉన్న పన్నీరు సెల్వం , పళనీ స్వామి , శశికళ లు ముగ్గుగురు మూడు దారులు అవ్వడం మళ్ళీ అదే క్రమంలో ఒక్కరోజు ఆగివుంటే ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసియాల్సిన శశికళ జైలుకు పోవడం(అందులో రాజకీయ ప్రేరేపితాలు కారణాలు లేకపోలేదు) , వెంటనే పన్నీరు సెల్వం , పళనీ స్వామి లు కలిసి శశికళ ని పార్టీకి దూరం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. జయ మరణం తరువాత పళనీ స్వామి,పన్నీరు సెల్వం ద్వయం అనుచరులకు మంత్రి పదవులు, అసంతృప్తి ఉన్న నేతలకు కాంట్రాక్టులు కట్టబెట్టి ప్రభత్వాన్ని మాత్రం ఎలాగోలా నడుపొకొచ్చేసారే కానీ పార్టీని చీలికలు లేకుండా చూసుకోలేకపోయారు.

                ఎన్నికలకు ముందువరకు ఇదిగో వచేస్తున్నారు అదిగో వచేస్తున్నారు అని ఎదురు చూసిన అభిమానులకు సూపర్ స్టార్ రజనీ కాంత్  చివరకి రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అని చెప్పి  పెద్ద షాక్ ఏ ఇచ్చారు. రజనీకాంత్ నిర్ణయం తరువాత కొంతమంది అభిమాన సంఘ నాయకులు D.M.K పార్టీలో చేరడం కూడా జరిగింది.రజనీకాంత్ రాజకీయాలకు దూరం కావడంతో అది ఏ పార్టీకి అనుకూలం అవ్వబోతుంది అనేది ప్రధాన చర్చ.

           ఎలాగో ఎన్నికల బరిలో నిలిచిన కమలహాసన్ ఎంతవరకు ప్రభావం చూపబోతున్నారో వేచి చూడాలి. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో మా పార్టీని గెలిపించండి , అధికారం ఇవ్వండి , ఇది మా సిద్ధాంతం మేము గెలుస్తున్నాం అని చేసుకోవాల్సింది పోయి దయచేసి హాంగ్ వచ్చేలా చేయొద్దు అని ఓటర్స్ ని అడగడం వింతగానే అనిపిస్తుంది. దీన్నిబట్టి అధికారంలోకి రావాలి గెలవాలి అనే ఉద్దేశం కాకుండా నేను పోటీలో వున్నాను అని చెప్పుకోడానికేనేమో అన్నటుంది కమలహాసన్ తీరు.

              ఇకపోతే కాంగ్రెస్, బీజేపీ లు ఉన్నప్పటికీ  D.MK తో కాంగ్రెస్ మిత్రపక్షంగా, AIDMK తో  బీజేపీకి మిత్రపక్షంగా కొనసాగుతున్నపట్టికి వారి పాత్ర ప్రేక్షకపాత్ర మాత్రమే. కాంగ్రెస్ D.M.K  పార్టీలు మాత్రం కరుణానిధి టైమ్ నుండి కూడా మంచి స్నేహాన్నే కొనసాగిస్తోంది అధికారంలో ఉన్నా ప్రతిపక్షం లో వున్నా వారి స్నేహం చెదరలేదు. బీజేపీ A.I D.M.K స్నేహం మాత్రం ప్రత్యేక కారణాలవల్ల , ప్రత్యేక వ్యక్తులవల్లా వచిందనేది విదితం.


👉 ప్రస్తుత అధికార A.I.D.M.K పార్టీ పరిస్థితి:


                  2011 మరియు 2016  ఎన్నికల్లో తన చరిష్మా తో సింగల్ హ్యాండుతో A.I.D.M.K పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత. తమిళనాడు రాజకీయాలలో ఒక సంప్రదాయం ఏంటంటే ప్రజలు ఒకసారి అధికారం ఇచ్చిన పార్టీకి వరుసగా రెండోసారి అధికారం కట్టబెట్టరు కానీ ఆ సంప్రదాయాన్ని జయ చేరిపేసి 2016 లో కూడా అధికారాన్ని అందిపుచుకున్నారు. జయ మరణం వరకు A.I.D.M.K పరిస్థితి బాగానే ఉండేది ఆమె మరణం తరువాత ఆధిపత్య పోరులో పార్టీలో చీలికలు రావడం , గ్రూప్ లు ఎక్కువ అవడం జయ నిచ్చెలి గా పేరొందిన శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేస్ లో జైలుకు వెళ్లడం లాంటి వ్యవహారాలు పార్టీకి తీరని నష్టాలు.

                గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారిని చూసి చూసి వారి పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలను దగ్గరగా చూస్తున్న ప్రజలు విసిగిపోయి అధికార పార్టీకి కాస్త వ్యతికంగా ఉన్నట్టే అన్నీ సర్వేలు,మేధావులు,ప్రజల అభిప్రాయం అనేది బహిరంగ రహస్యం. ఎలాగూ అధికారం రాలేము అనిపించిందో ఏమో A.I.D.M.K పార్టీ మ్యానిఫెస్టో కూడా సహజత్వానికి దూరంగాఆచరణ సాధ్యం కాని హామీలు కురిపిస్తున్నారు. ఉదాహరణకు ప్రతి ఇంటికి సంవత్సరానికి 6 గ్యాస్ సిలెండర్ ఉచితంగా ఇస్తాం అనడం, ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం అనడం, ప్రతి ఇంటికి ఉచ్చితంగా వాషింగ్ మిషన్ ఇస్తాం అనడం.

                   ఏమాత్రం ప్రభావం లేని బీజేపీ తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లడం, గత కొన్ని దశాబ్దాల నుండి చరిత్ర తీసుకున్నా బీజేపీ కి తమిళనాడు లో వోట్ బ్యాంక్ లేదు ఉన్న కాస్త గెలిపించే స్థాయిలో లేదు అనేది నగ్నసత్యం తద్వారా బీజేపీ తో కలిసినంతగా మాత్రాన A.I.D.M.K కి వరిగేది ఏమీలేదు.

                   జయలలిత మరణం తరువాత ఆమె లాగా ప్రజా రంజక పాలన అందించడంలో విఫలం అవ్వడం, జయ అంతటి రాజకీయ గ్లామర్ ఉన్న నాయకులు లేకపోవడం, పార్టీలో చీలికలు పెద్ద సమస్యలు కాగా జైలు నుండి వచ్చిన శశికళ A.I.D.M.K పార్టీని స్వాధీనం చేసుకుంటారు పార్టీలో చీలికలు తెస్తారు మేనల్లుడు దినకరన్ తో కిలిసి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తారు అని ఊహించినడానికి భిన్నంగా ఆమె రాజకీయాలకు దూరం గా ఉంటానని ప్రకటించడం, A.I.D.M.K అధికారంలోకి రావాలి అని జయ         అభిమానులు అంతా దానికి సహకరించాలని కోరడం కాస్త ఊరటనిచ్చే అంశం.అలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో దాదాపుగా అందరికి తెలిసే ఉండొచ్చు అది ఎందుకంటే అవతలి ప్రత్యర్థి D.M.K అధికారంలోకి వస్తే జయలలిత మరణం పై C.B.I విచారణ చేయిస్తానని స్టాలిన్ చెప్పిన విషయమై తనపై మళ్ళీ రకరకాల కేసులు వేస్తారని ఎట్టిపరిస్థితుల్లోనూ తనవల్ల ఇబ్బంది వచ్చి A.I.D.M.K అధికారం కోల్పోకూడదు , D.M.K అధికారంలోకి రాకూడదు అని కావొచ్చు. సొంత పార్టీవాళ్ళు అయితే చూసి చూడనట్టు వదిలేస్తారనీ కావొచ్చు.

                      పార్టీలో ఎన్ని చీలికలున్నా , A.I.D.M.K కి పెర్మినెంట్ వోట్ బ్యాంక్ ఉండనే ఉంది అది సానుకూల విషయం అది అధికారాన్ని కట్టబెడతాదా అంటే పార్టీ టికెట్ ఇచ్చే అభ్యర్ధులని బట్టి తారుమారు అయ్యే అవకాశం కనిపిస్తోంది.జయలలిత ఉన్నప్పటి తీరున పార్టీ టిక్కెట్లు కేటాయించట్లేదు మరి అది ఎంతవరకు లాభిస్తుందో వేచిచూడాలి.అన్నింటికీ కీలకంగా మారుతుంది తటస్థ ఓటర్ మరి తటస్థ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారో అనేది కీలకం.

👉 ప్రతిపక్ష D.M.K పరిస్థితి:

                         జయలలిత మరణం తరువాత A.I.D.M.K పార్టీలో ఎన్ని చీలికలొచ్చాయో , ప్రభుత్వంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చాయో అంతకు రెట్టించి దానిని సొమ్ము చేసుకుని D.M.K పార్టీ అధినేత స్టాలిన్ పుంజుకున్నారు , ప్రజలకు చేరువ అయ్యారు అనేది జగమెగిరిన సత్యం. ప్రతిపక్ష నాయకుడు గా ఆ పాత్రను సమర్ధవంతంగా నిర్వహించుకుంటు ఎన్నికలకు 2 సంవత్సరాల సమయానికి ముందునుండి ప్రజలతో మమేకమవుతూ సాగుతున్నారు . తన సోదరుడు అళగిరి తిరుగుబాటుని సమర్ధవంతంగా ఎదుర్కొంటు పార్టీలో చీలికలు లేకుండా చూడటంలో జాగ్రత్త పడ్డారు.

       వరదలు వచ్చినా, కరువు వచ్చినా, కరోనా వచ్చినా ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా అధికారపక్షం నిద్రలేవకముందే ప్రజాలమద్యకెళ్లి మంచిపేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ వ్యతికతను స్టాలిన్ కి అదనపు బలం.

                  గత 10 సంవత్సరాలుగా ఓటములనుండి పాఠాలు నేర్చుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఈదఫా ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని శ్రామిస్తూ పట్టుదలతో కనిపిస్తున్నారు. దానికి అనుగుణంగానే పార్టీ మేనిఫెస్టో కూడా కనిపోయిస్తుంది ఉదాహరణకు ప్రతి గ్యాస్ సిలెండర్ కి 100రూపాయల సబ్సీడీ ఇస్తాం అనడం , రేషన్ కార్డ్ ఉన్న ప్రతి మహిళా యజమానికి నెలకు 1000రూపాయలు చొప్పున ఏడాదికి 12000రూపాయలు నేరుగా ఖాతాలో జమచేస్తాం అనడం ముఖ్యంగా మహిళ ఓటర్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ప్రభుత్వ బడులల్లో చదివే పిల్లలకు టాబ్స్ ఉచితంగా ఇస్తాం అనడం జనాలను ఆకట్టుకుంటుంది.

                      గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 39 M.P స్థానాలకు గాను 38 M.P స్థానాలు  ఏకపక్షంగా D.M.K పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే పార్టీ క్యాడర్ కూడా అదే ఉత్సహంతో పనిచేస్తూ ముందుకు సాగడం D.M.K పార్టీకి వెయ్యేనుగుల బలం.స్టాలిన్ సమర్థతను ఈ ఫలితాలే నిదర్శనం.

👉 తటస్థ ఓటర్ ఎటు ?

                    పార్టీలు , బలాలు , బలగాలు పక్కనబెడితే అన్నింటికీ కీలకం తటస్థ ఓటర్ వీరు ఎటు మొగ్గు చూపితే వారే అధికారం చేపట్టబోయేది. తమిళనాడు రాజకీయ సమీకరణాలు తీసుకున్నా, గత అనుభవాలు తీసుకున్నా, ఎక్కువ అవకాశాలు ఏ పార్టీకి ఉందో గమనించి అటుగా వోట్ వేస్తుంటారు ఈసారి అన్నీ విధాలుగా అన్నీ సమీకరణాలు, అన్నీ సర్వేలు , మెజారిటీ ప్రజల అభిప్రాయం D. M.K పార్టీకి పట్టం కట్టబోతున్నారని అర్థం అవుతుంది. D.M.K అధినేత స్టాలిన్ తొలిసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించబోతున్నారని సుస్పష్టం.

ముఖ్య గమనిక : మద్యం , డబ్బు , ప్రలోభాలకు లోనుకాకుండా బాధ్యతాయుతంగా సరైన పార్టీని, నాయకుడిని ఎన్నుకుందాం.

 

విశ్లేషకులు : ఆర్.కె.శాతరాసి

                    : +91 9629301038


Post a Comment

0 Comments

Close Menu