👉 ఏమిటి : అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్) 2023
👉 ఎప్పుడు : మార్చి 4
👉 ఎవరు : ఐక్యరాజ్యసమితి
👉ఎందుకు : చిరు ధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రపంచ దేశాల్లో అవగాహన కల్పించేందుకు.
👉 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ (అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం) గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
👉 చిరు ధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రపంచ దేశాల్లో అవగాహన కల్పించడం, మారుతున్న వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా చిరు ధాన్యాల సాగుని ప్రోత్సహించడం వంటివి 2023 ఏడాది చేపడతారు.
👉 భారతదేశ తీర్మానం మేరకు 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐరాస ప్రకటించింది.
👉 బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, నైజీరియా, రష్యా, సెనెగల్ దేశాలతో కలిపి భారత్ ఈ తీర్మానాన్ని తీసుకురాగా మరో 73కి పైగా దేశాలు మద్దతు తెలిపాయి.
ఐక్యరాజ్యసమితి...
ఐరాసాలో చివరిగా చేరిన దేశాలు ….
ఐక్యరాజ్యసమితి సమితి ఆశయాలు
0 Comments