👉ఏమిటి : ఏకకాలంలో ఎన్నికల కు పార్లమెంటరీ స్థాయీసంఘం మద్దతు
👉ఎప్పుడు : ఇటివల
👉ఎవరు : పార్లమెంటరీ స్థాయీసంఘం
👉ఎక్కడ : ఇండియా
👉ఎందుకు : జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని, రాజకీయ పార్టీల వ్యయం కూడా దిగివస్తుందని...
👉లోక్‌సభకు, రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ప్రభుత్వం చాలారోజులుగా ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే.
👉తాజాగా, ఈ ప్రతిపాదనకు పార్లమెంటరీ స్థాయీసంఘం మద్దతు కూడా లభించింది. జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని, రాజకీయ పార్టీల వ్యయం కూడా దిగివస్తుందని.. కాబట్టి, వాటిని నిర్వహించటం మంచిదేనని పేర్కొంటూ నివేదికను సమర్పించింది.
👉కేంద్ర సిబ్బంది, న్యాయశాఖలకు సంబంధించి ఏర్పాటైన స్థాయీసంఘం ఈ నివేదికను రూపొందించింది.
👉దీనిని మంగళవారం(మార్చ్ ౧౬) పార్లమెంట్ ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
👉జమిలి ఎన్నికల వల్ల మానవ వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు వీలవుతుందని నివేదికలో స్థాయీసంఘం పేర్కొన్నది.
👉తరచూ జరిగే ఎన్నికలతో ప్రజల్లో ఏర్పడిన అనాసక్తిని జమిలి ఎన్నికలతో తగ్గించవచ్చని, తద్వారా ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం కూడా పెరుగుతుందని అభిప్రాయపడింది.
👉దేశంలో జమిలి ఎన్నికలు కొత్తకాదని, తొలి మూడు సార్వత్రిక ఎన్నికలు (1952, 57, 62) జమిలి పద్ధతిలోనే జరిగాయని నివేదిక గుర్తుచేసింది.
👉రాజ్యాంగానికి సవరణలు చేయడం ద్వారా మళ్లీ జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపింది.
👉అయితే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా లోక్‌సభ, ఆయా రాష్ర్టాల శాసనసభల గడువులను ఒకదానికొకటి సర్దుబాటు చేయాల్సి ఉన్నదని పేర్కొన్నది.
👉ఇందుకు పలు రాష్ర్టాల చట్టసభల గడువును పొడిగించడం లేదా తగ్గించడం చేయాల్సి ఉంటుందని, దీనికి రాజకీయ ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరమున్నదని తెలిపింది.
👉నిత్యం ఎన్నికలు జరుగుతుండటం వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై భారం పడుతున్నదని, అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నదని పేర్కొన్నది.
👉1983లో ఎన్నికల సంఘం జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసిన విషయాన్ని కమిటీ ప్రస్తావించింది. అనంతరం జస్టిస్ జీవన్‌రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ కూడా ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలిపిందనిగుర్తుచేసింది.
👉వివిధ అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలు కూడా తమ నివేదికలను సమర్పించాయి. వాటిని ప్రభుత్వం పార్లమెంట్‌లో మంగళవారం ప్రవేశపెట్టింది.
👉భారత ప్రభుత్వ యంత్రాంగం ఒక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌పైనే అధికంగా ఆధారపడుతున్నదని ఒక పార్లమెంటరీ స్థాయీసంఘం తన నివేదికలో పేర్కొన్నది. అయితే ఆ సర్వీస్ పేరు మాత్రం వెల్లడించలేదు.
👉పోక్సో చట్టం కింద నమోదైన కేసులకు సంబంధించి బాలనేరస్థుల వయోపరిమితిని 18 నుంచి 16 ఏండ్లకు తగ్గించాలని మరో పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫార్సు చేసింది.
👉సీబీఐకి మరిన్ని అధికారాలు కల్పించేందుకు చట్టాలను సవరించాలని ఇంకో పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది.
0 Comments