👉 మహిళలు గర్భస్రావం బిల్లు రాజ్యసభ ఆమోదం

 

👉ఏమిటి : మహిళలు గర్భస్రావం చేయించుకోవడానికి సంబంధించిన ముఖ్యమైన బిల్లు

👉ఎప్పుడు : మార్చ్ ౧౬ ౨౦౨౧ 

👉ఎవరు : రాజ్యసభ

👉ఎక్కడ : భారత్ లో

👉ఎందుకు : అంతర్జాతీయంగా అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేశామని, మన దేశంలో కూడా విస్తృతంగా చర్చించిన తర్వాత మాత్రమే ఈ బిల్లును రూపొందించామని తెలిపారు.

👉ప్రత్యేక సందర్భాల్లో మహిళలు గర్భస్రావం చేయించుకోవడానికి సంబంధించిన ముఖ్యమైన బిల్లుకు రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలిపింది.

👉అత్యాచార బాధితులు, వావివరుసలేని లైంగిక సంబంధాల బాధితులు, మైనర్లు, దివ్యాంగులు సహా ప్రత్యేక వర్గాలకు చెందిన మహిళలు గర్భస్రావం చేయించుకోవడానికి కాల పరిమితిని పెంచేందుకు ఈ బిల్లు ప్రతిపాదించింది.

👉ప్రస్తుత నిబంధనల ప్రకారం గర్భం ప్రారంభమైనప్పటి నుంచి 20 వారాల వరకు గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతి ఉంది.

👉దీనిని 24 వారాలకు పెంచేందుకు ఈ బిల్లు ప్రతిపాదించింది.

👉మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, 1971ను సవరిస్తూ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (అమెండ్‌మెంట్) బిల్, 2020ని రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది.

👉ఈ బిల్లును ఏడాది క్రితమే లోక్‌సభ ఆమోదించింది.

👉కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేశామని, మన దేశంలో కూడా విస్తృతంగా చర్చించిన తర్వాత మాత్రమే ఈ బిల్లును రూపొందించామని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తాము మహిళలకు వ్యతిరేకంగా ఏ చట్టాన్నీ రూపొందించబోమని వివరించారు.

👉ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించాలని వచ్చిన డిమాండ్‌ను రాజ్యసభ తోసిపుచ్చింది.

👉ఈ బిల్లును ఆమోదించినట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు.

Post a Comment

0 Comments

Close Menu