👉 ఒక‌వేళ నోటా కార‌ణంగా అంద‌రు అభ్య‌ర్థులు తిరస్క‌ర‌ణ‌కు గురైతే ?? : సుప్రీంకోర్టు

 

👉 ఏమిటి : నోటాకు ఎక్కువ ఓట్లు వ‌స్తే??

👉 ఎప్పుడు : మార్చి 15

👉 ఎవరు :   సుప్రీంకోర్టు

👉 ఎందుకు : ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ర‌ద్దు చేసి తిరిగి ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందిగా ఎన్నిక‌ల సంఘాన్ని  ఆదేశించాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై సోమ‌వారం సుప్రీంకోర్టు విచార‌ణ జ‌రిపింది.

👉 నోటాకు ఎక్కువ ఓట్లు వ‌స్తే ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ర‌ద్దు చేసి తిరిగి ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందిగా ఎన్నిక‌ల సంఘాన్ని  ఆదేశించాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై సోమ‌వారం సుప్రీంకోర్టు విచార‌ణ జ‌రిపింది.

👉దీనిపై అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్ర న్యాయ‌శాఖ‌, ఎన్నిక‌ల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

👉 బీజేపీ నేత, అడ్వొకేట్ అశ్విని కుమార్ ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. తిర‌స్క‌రించే హ‌క్కు ఉంది. కానీ మేము కోరుకునేది గుర్తింపు కోరుకునే హ‌క్కు అని ఆయ‌న త‌ర‌ఫున వాదించిన సీనియ‌ర్ న్యాయ‌వాది మ‌నేకా గురుస్వామి కోర్టును కోరారు.

👉ఈ పిటిష‌న్‌పై చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే, జ‌స్టిస్ ఏఎస్ బోప‌న్న‌, జ‌స్టిస్ వి రామ‌సుబ్ర‌మ‌ణియ‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపింది.

👉 పిటిష‌న‌ర్ త‌ర‌ఫు వాద‌న‌లు విన్న కోర్టు.. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం, ఎన్నిక‌ల సంఘం అభిప్రాయం అడిగింది.

👉పేరున్న రాజ‌కీయ పార్టీల అభ్య‌ర్థుల‌ను ఓట‌ర్లు తిర‌స్క‌రిస్తే.. పార్ల‌మెంట్‌లో సీట్లు ఖాళీగా ఉంటాయి కదా అని విచార‌ణ సంద‌ర్భంగా సీజేఐ బోబ్డే ప్ర‌శ్నించారు.

👉దీనిపై గురుస్వామి స్పందిస్తూ.. 50 శాతం నోటా ఓట్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌న్న నిబంధ‌న ఉంది.

👉 కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితి ఎలా ఉందంటే 99 శాతం మంది అభ్య‌ర్థిని తిరస్క‌రించి, ఒక్క శాతం మంది ఓటు వేసినా వాళ్లు గెలుస్తున్నారు అని చెప్పారు. ఇది రాజ్యాంగం స‌మ‌స్య‌. ఒక‌వేళ నోటా కార‌ణంగా అంద‌రు అభ్య‌ర్థులు తిరస్క‌ర‌ణ‌కు గురైతే, ఆ నియోజ‌క‌వ‌ర్గానికి అస‌లు ప్రాతినిధ్య‌మే ఉండ‌దు క‌దా.

👉అలాంట‌ప్పుడు స‌రైన పార్ల‌మెంట్‌ను ఎలా ఏర్పాటుచేయ‌గ‌లం అని సీజేఐ ప్ర‌శ్నించారు.

నోటా గురించి :

👉అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, బ్రెజిల్, గ్రీస్, ఉక్రెయిన్, చిలీ, రష్యా, బంగ్లాదేశ్, కొలంబియా, స్పెయిన్, స్వీడన్, ఇండియా తదితర దేశాల్లో నోటాపద్ధతి అమలులో ఉంది.

👉 కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా కౌంటీ ఎన్నికల్లో 1976లో తొలిసారిగా నోటావిధానాన్ని ప్రవేశపెట్టారు. 

👉నిజానికి అభ్యర్థులెవరూ నచ్చకుంటే తిరస్కార ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. 

👉ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 49 (ఓ) సెక్షన్ కింద ఓటర్లు ఈ హక్కును ఉపయోగించుకునే వీలుంది. దిని ప్రకారం  పోలింగ్ బూత్‌లోని ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి, దీనికోసం 17-ఏ ఫారం తీసుకుని, ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేయవచ్చు.

👉నోటా పోటీ చేసే అభ్యర్థుల పట్ల అసంతృప్తి వ్యక్తులకు తమ అసమ్మతిని తెలియజేసే అవకాశాన్ని ఇస్తుంది.

👉ఇది, ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోయినా, ఎక్కువ మంది ప్రజలు తమ ఓట్లను వేసే అవకాశాలను పెంచుతుంది మరియు బోగస్ ఓట్ల సంఖ్యను తగ్గిస్తుంది.

👉 అలాగే, ప్రతికూల ఓటింగ్ "ఎన్నికలలో దైహిక మార్పును తీసుకువస్తుందని మరియు రాజకీయ పార్టీలు స్వచ్ఛమైన అభ్యర్థులను ప్రోత్సహించవలసి వస్తుంది" అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐ) మరియు నోటా 

👉 ECI ఇలా పేర్కొంది ... "ఏదైనా తీవ్రమైన సందర్భంలో, నోటాకు వ్యతిరేకంగా ఓట్ల సంఖ్య అభ్యర్థులు సాధించిన ఓట్ల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, పోటీ చేసే అభ్యర్థులలో అత్యధిక సంఖ్యలో ఓట్లు సాధించిన అభ్యర్థిని ప్రకటించాలి ఎన్నుకోబడాలి ... "

👉 సెక్యూరిటీ డిపాజిట్ యొక్క జప్తును నిర్ణయించడానికి నోటాకు పోల్ చేసిన ఓట్లను పరిగణించలేమని 2013 లో విడుదల చేసిన ఒక వివరణలో ఇసిఐ పేర్కొంది.

👉 2014 లో రాజ్యసభ ఎన్నికలలో ఇసిఐ నోటాను ప్రవేశపెట్టింది.

👉అహ్మదాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడి) చేత డిజైన్ చేయడంతో, 2015 లో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 'నోన్ అబోవ్' ఎంపికకు చిహ్నాన్ని ప్రకటించింది.

👉 ఇంతకుముందు, నోటా కోసం గాడిద చిహ్నాన్ని ఎన్నికల సంఘం కేటాయించాలని డిమాండ్ చేశారు కుడా ...

Post a Comment

0 Comments

Close Menu