👉 ఏమిటి : అస్సాం లో సత్రాలు మరియు వారి రాజకీయ ప్రాముఖ్యత
👉 ఎప్పుడు : ఇటివల
👉 ఎవరు : అస్సాం లో రాజకీయనాయకులూ
👉 ఎక్కడ : అస్సాం
👉ఎందుకు : సత్రా ఓట్లు ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించకపోవచ్చు, సత్రాలు మరియు సత్రాధికారులు చాలా ప్రభావాన్ని కలిగి ఉన్నారనేది కాదనలేని వాస్తవం.
👉 అస్సాం లో సత్రాలు మరియు వారి రాజకీయ ప్రాముఖ్యత
సత్రాలు అంటే ఏమిటి?
👉 16 వ శతాబ్దపు నియో-వైష్ణవ సంస్కరణవాద ఉద్యమంలో భాగంగా వైష్ణవ సాధువు-సంస్కర్త శ్రీమంత శంకరదేవ (1449-1596) ప్రారంభించిన వె ఈ సత్రాలు.
👉సాధువు అస్సాం మీదుగా ప్రయాణించి, తన బోధలను వ్యాప్తి చేసి, సమతౌల్య సమాజాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు, ఈ సత్రాలు / థాన్లు 16 వ శతాబ్దంలో మత, సామాజిక మరియు సాంస్కృతిక సంస్కరణల కేంద్రాలుగా పని చేయడానికి స్థాపించబడ్డాయి.
👉ఈ సంస్థలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి మరియు అస్సామీ సంస్కృతి లో ఇవి ఒక బాగము గా ఉన్నాయి.
👉ఇప్పటికి అంటే ఈ రోజులలో సత్రాలు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నాయి, సంగీతం (బోర్గేట్), డ్యాన్స్ (సత్రియా) మరియు థియేటర్ (భునా) లతో శంకర్దేవ యొక్క ప్రత్యేకమైన “కళ ద్వారా ఆరాధన” విధానాన్ని ప్రోత్సహిస్తు పనిచేస్తున్నాయి.
సత్ర ఎలా ఉంటుంది ??
👉ప్రతి సత్రంలో నామ్‌ఘర్ (ఆరాధన మందిరం) ఉంటుంది ఇది కేంద్రకం అంతేకాకుండా ప్రభావవంతమైన “సత్రాధికర్” నేతృత్వం వహిస్తుంది.
👉 భకత్స్ అని పిలువబడే సన్యాసులు చిన్న వయస్సులోనే సత్రాలలోకి ప్రవేశిస్తారు.
👉వారు బ్రహ్మచారిగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు, ఈ కండిషన్లు ఆయా రకమైన సత్రాను బట్టి ఉంటాయి.
శంకర్దేవ తత్వశాస్త్రం ఏమిటి?
👉 శంకర్దేవ ఏకా-శరణ-నామ్-ధ్రమం అనే భక్తి రూపాన్ని ప్రచారం చేశాడు.
👉కుల భేదాలు, సనాతన బ్రాహ్మణీయ ఆచారాలు మరియు త్యాగాల నుండి విముక్తి పొంది సమానత్వం మరియు సోదరభావం ఆధారంగా సమాజాన్ని ఏర్పరిచేలాగా ఆయన సమర్థించారు.
👉అతని బోధన విగ్రహారాధనకు బదులుగా ప్రార్థన మరియు జపం (నామ్) పై దృష్టి పెట్టింది. అతని ధర్మం దేవా (దేవుడు), నామ్ (ప్రార్థనలు), భకత్లు (భక్తులు) మరియు గురు (గురువు) అనే నాలుగు భాగాలపై ఆధారపడింది.
సత్రానికి, రాష్ట్రానికి మధ్య సంబంధం ఏమిటి?
👉అసోం పాలనలో, సత్రులు అప్పటి రాజుల నుండి భూమి ,డబ్బు రూపంలో చాలా విరాళాలు పొందారు.
👉మన దేవాలయాల మాదిరిగా కాకుండా, సత్రాలకు ప్రోత్సాహం అవసరం లేదు ఎందుకంటే అవి స్వయం సమృద్ధిగా ఉన్నాయి, వారి స్వంత ఆదాయాలను అవి పెంచుకున్నాయి మరియు తమను తాము నిలబెట్టుకోగలవు.
👉అయితే, నేడు, ఇది భిన్నమైనది. రాజకీయ మద్దతు లభిస్తుందనే ఆశతోరాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం నుండి వార్షిక నిధులు సత్రాలకు ఇవ్వబడతాయి.
ఎన్నికలలో సత్రాలు ముఖ్యమా?
👉 సత్రా ఓట్లు ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించకపోవచ్చు, సత్రాలు మరియు సత్రాధికారులు చాలా ప్రభావాన్ని కలిగి ఉన్నారనేది కాదనలేని వాస్తవం.
👉 నాగన్, కాలిబోర్, మజులి, బార్పేట, బర్తాదర్వ వంటి సత్తా ఆధారిత నియోజకవర్గాలు ఉన్నాయి.
👉 అస్సామీ కుటుంబాలు సాధారణంగా ఒక సత్రంతో లేదా మరొకటితో సంబంధాలు కలిగి ఉంటాయి.
👉 అందుకే రాజకీయ నాయకులు - పార్టీతో సంబంధం లేకుండా తరచుగా సత్రను సందర్శించడం కనిపిస్తు ఉంటుంది మనకు.
0 Comments