👉 శీతలపానీయాలు ఎక్కువగా తాగడం వల్ల త్వరగా మరణించే ముప్పు

 👉ఏమిటి : రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న వారుతీయటి శీతలపానీయాలు ఎక్కువగా తాగడం వల్ల త్వరగా మరణించే ముప్పు పొంచిఉంది

 👉ఎప్పుడు : ఇటివల

 👉ఎవరు : క్యాన్సర్‌ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్‌ అండ్‌ ప్రివెన్షన్‌'

 👉ఎక్కడ : అమెరికా

 👉ఎందుకు : సోడాలో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది, పోషక విలువలు ఏమాత్రం ఉండవు, ఫలితంగా రొమ్ము క్యాన్సర్‌కు అది దారి తీస్తుంది.

 👉రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు తీయటి శీతలపానీయాలు ఎక్కువగా తాగడం వల్ల త్వరగా మరణించే ముప్పు పొంచి ఉన్నదని తాజా అధ్యయనం వెల్లడించింది.

 👉సోడా లేదా తీయటి కూల్‌డ్రింక్స్‌ ఎన్నడూ తాగని లేదా అత్యంత అరుదుగా తాగే మహిళలతో పోలిస్తే వారానికి కనీసం ఐదుసార్లు తాగే మహిళల్లో మరణం ముప్పు 62శాతం ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనం తెలిపింది.

 👉ఇక రొమ్ము క్యాన్సర్‌తో బాధపడే మహిళలు కూల్‌డ్రింక్స్‌ తాగితే వారి ప్రాణాలకు ముప్పు 85శాతం అధికమని పేర్కొన్నది.

 👉ఈ అధ్యయన నివేదిక క్యాన్సర్‌ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్‌ అండ్‌ ప్రివెన్షన్‌' జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైంది.

 👉సోడా లేదా తీయటి పానీయాలు, రొమ్ము క్యాన్సర్‌పై పరిశోధన వినూత్నమైనదని అమెరికాలోని బఫెలో స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి నాడియా కోయరాట్టి పేర్కొన్నారు.

 👉సోడా తాగడం వల్ల బరువు పెరగడం, టైప్‌-2 మధుమేహం వ్యాధికి గురి కావడం, గుండె సంబంధిత జబ్బులు రావడం వంటి ముప్పు పొంచి ఉన్నప్పటికీ చాలామంది తీయటి సోడాను తాగడం కొనసాగిస్తున్నారని చెప్పారు.

👉తాము రొమ్ము క్యాన్సర్‌కు గురైన 35 నుంచి 79 ఏండ్ల మధ్య మహిళలపై 19 ఏండ్లపాటు అధ్యయనం చేశామని, వీరిలో 927 మంది కేవలం తీయటి శీతల పానీయాలు తాగడం వల్ల మృత్యువాత పడ్డారని వెల్లడించారు.

 👉రొమ్ము క్యాన్సర్‌ను నిర్ధారించడానికి 12 నుంచి 24నెలల ముందు వారు ఏమి తిన్నారు, ఏమి తాగారన్నదానిపై వారిని ప్రశ్నించామని తెలిపారు.

 👉వారిలో 900 మంది మహిళలు శీతల పానీయాలు తాగడం వల్లనే రొమ్ము క్యాన్సర్‌కు గురైనట్టు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.

 👉వీరిలో 41 శాతం మంది అతి త్వరగా మరణించారని తెలిపారు.

కారణం అధిక చక్కెర స్థాయి

 👉సోడాలో చక్కెర స్థాయి అధికంగా ఉంటుందని, పోషక విలువలు ఏమాత్రం ఉండవని, ఫలితంగా రొమ్ము క్యాన్సర్‌కు అది దారి తీస్తుందని కోయరాట్టి వివరించారు.

 👉చక్కెరలేని టీ, కాఫీలు, పండ్ల రసాలతో కూడిన శీతలపానీయాలలో పోషక విలువలు, విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయని తెలిపారు.

 👉చక్కెరతో కూడిన సోడాలో సుక్రోస్‌, ఫ్రక్టోస్‌ అధిక స్థాయిలోఉంటాయని, వీటిలోని గ్లూకోజ్‌, ఇన్సులిన్‌ రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతాయని పరిశోధకులు పేర్కొన్నారు.

 👉అమెరకాలో ప్రస్తుతం 35 లక్షల మంది రొమ్ముక్యాన్సర్‌ బాధితులు ఉన్నారని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu