👉ఏమిటి : మారటోరియం సమయంలో వడ్డీ మీద వడ్డీ వసూలు చేయరాదు
👉 ఎప్పుడు : మార్చి 23
👉ఎవరు : సుప్రీంకోర్టు
👉ఎక్కడ : భారత్ లో
👉 ఎందుకు : కరోనా మహమ్మారి కారణంగా ఖాతాదారులు వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని కోరుతూ గతేడాది పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
👉ఈ సమయంలో గాను మొత్తంగా వడ్డీ మాఫీ చేయాలని, మారటోరియం కాలాన్ని పొడిగించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పు వెల్లడించింది.
👉ఈ ఆరు నెలల కాలానికి రుణ గ్రహీతలకు వడ్డీ మీద వడ్డీ వసూలు చేయరాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
👉అదే సమయంలో మారటోరియం కాలాన్ని పొడిగించడం సాధ్యం కాదన్న కోర్టు.. మొత్తం వడ్డీ మాఫీ చేయడం కూడా కుదరదని తేల్చి చెప్పింది.
👉ఖాతాదారులకు, పెన్షన్ తీసుకొనే వారికి బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయని, అలాంటప్పుడు బ్యాంకులు ఎలా రుణాలపై పూర్తిగా వడ్డీ మాఫీ చేస్తాయని కోర్టు ప్రశ్నిచింది.
👉జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎంఆర్ షా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కీలకమైన తీర్పు వెలువరించింది.
👉ఆ ఆరు నెలల మారటోరియం కాలంలో వడ్డీపై వడ్డీ ఉండకూడదు. ఒకవేళ అలా సేకరించి ఉంటే వెంటనే రీఫండ్ చేయాలని తీర్పు వెలువరించారు.
👉వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని కోరుతూ గతేడాది పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
👉గతేడాది కరోనా కారణంగా మార్చి నుంచి ఆగస్ట్ 31 వరకు రుణాలపై మారటోరియం విధిస్తున్నట్లు మార్చి 27న ఆర్బీఐ ప్రకటించింది .
👉ఈ ఆరు నెలల సమయంలో వడ్డీపై వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తే అది ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని, బ్యాంకుల ఆర్థిక వనరులకు పెద్ద దెబ్బ పడుతుందని ఆర్బీఐ వాదించింది.
0 Comments