👉ఏమిటి : అంతరించే భాషల జాబితాలో తెలంగాణలోని గోండీ
👉 ఎప్పుడు : ఇటివల
👉 ఎవరు : యునెస్కో (కేంద్ర ప్రబుత్వం )
👉 ఎక్కడ : భారత్ లో
👉 ఎందుకు : అంతరించే ముప్పు ముంగిట ఉన్న భాషల భద్రత, సంరక్షణకు సంబందిత అంశం
👉 యునెస్కో ప్రకటించిన అంతరించే భాషల జాబితాలో తెలంగాణలోని గోండీ భాషకు ముప్పుపొంచి ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయమంత్రి రేణుకా సింగ్ సరూతా తెలిపారని నవతెలంగాణ పేర్కొంది.
👉 లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.
గిరిజన భాషల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు.
👉ఆ కార్యక్రమంలో భాగంగా కోయ, లంబాడీ, గోండి, కొలమి భాషల్లో ప్రీమియర్స్ ప్రచురించిందన్నారు.
👉గిరిజన భాషలతో పాటు తెలుగులో వర్ణమాల, స్థానిక కవితలు, కథలను ముద్రించినట్లు వెల్లడించారు.
👉 విద్యాహక్కు చట్టం 2009, నూతన విద్యావిధానం 2020 ప్రకారం గిరిజన పిల్లలకు 1, 2 తరగతులను వారి మాతృభాషలో విధ్యను బోధించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు కేంద్రమంత్రి రేణుకా సింగ్ సరూతా వెల్లడించారు.
👉 దేశ వ్యాప్తంగా అంతరించే జాబితాలో ఉన్న 117 భాషలపై అధ్యయనం చేసి ప్రాధాన్యతా క్రమంలో డాక్యుమెంటేషన్ చేయాలని నిర్ణయించినట్లునల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
👉 అంతరించే ముప్పు ముంగిట ఉన్న భాషల భద్రత, సంరక్షణకు మైసూరులోని భారతీయ భాషల కేంద్రం పనిచేస్తోందని చెప్పారు.👉 గోండి భాష దక్షిణ-మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. ఆంధ్ర ప్రదేశ్ ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో మొత్తంగా, సుమారు ఇరవై లక్షల మంది, ఈ భాషని మాట్లాడుతున్నారు. ఇది గోండులకి చెందిన భాషే అయినప్పటికీ, ప్రస్తుతం వారిలో సగంమంది మాత్రమే దీనిని మాట్లాడుతున్నారు.
👉 వ్రాత విధానాలు: Gunjala Gondi script, Gondi writing, దేవనాగరి, తెలుగు లిపి
👉 భారతీయ భాషల కేంద్రీయ సంస్థ (Central Institute of Indian Languages)
👉 సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏడు కేంద్రాలను కలిగి ఉంది:
👉 భారతదేశంలోని 22 అధికారిక భాషలు ఏమిటి?
1) అస్సామీ, (2) బెంగాలీ, (3) గుజరాతీ, (4) హిందీ, (5) కన్నడ, (6) కాశ్మీరీ, (7) కొంకణి, (8) మలయాళం, (9) మణిపురి, (10) మరాఠీ, ( 11) నేపాలీ, (12) ఒరియా, (13) పంజాబీ, (14) సంస్కృతం, (15) సింధి, (16) తమిళం, (17) తెలుగు, (18) ఉర్దూ (19) బోడో, (20) సంతాలి, (21) ) మైథిలి మరియు (22) డోగ్రి.
0 Comments