👉ఏమిటి : పుట్టిన రోజు వంటి ఫంక్షన్లు మెట్రో రైల్ కోచుల్లో
👉 ఎప్పుడు : ఇటివల
👉 ఎవరు : జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్
👉 ఎక్కడ : రాజస్థాన్‌లో
👉 ఎందుకు : అదనపు ఆదాయం కోసం ఈ నిర్ణయం
👉 ఇకపై పుట్టిన రోజు వంటి ఫంక్షన్లు మెట్రో రైల్ కోచుల్లో జరుపుకోవచ్చు.
👉 ఇలాంటి వేడుకల కోసం వీటిని అద్దెకు తీసుకోవచ్చని రాజస్థాన్‌లోని జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది.
👉ఒక కోచ్‌కు నాలుగు గంటలకు రూ.5,000 ప్రతి అదనపు గంటకు రూ.1,000 చార్జ్ అవుతుందని తెలిపింది. నాలుగు కోచ్‌లకు నాలుగు గంటలకు రూ.20,000, ప్రతి అదనపు గంటకు రూ.5,000 చార్జ్ వసూలు చేస్తామని చెప్పింది.
👉అలాగే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలతో కలిసి స్వల్ప కాల ప్రకటనలు, బ్యానర్లు, ప్రకటనల స్టాండ్లను సంబంధింత చార్జీలతో మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేస్తామని జైపూర్ మెట్రో రైల్ తెలిపింది.
👉అదనపు ఆదాయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
0 Comments