👉 హాస్య రత్నాలు ... ఈ జాతిరత్నాలు

 

👉హాస్య రత్నాలు 


👉 నటీనటులు:  నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్,ఫరియా,బ్రహ్మానందం

👉 రచన & దర్శకత్వం :  అనుదీప్.కె.వి

👉 నిర్మాత :  నాగ్ అశ్విన్(మహానటి డైరెక్టర్)

👉 సంగీతం: రాధన్(అర్జున్ రెడ్డి ఫేమ్)


                         ఈ సినిమా గురించి మాట్లాడే ముందు మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తి దర్శకుడు అనుదీప్. "మిస్డ్ కాల్" అనే షార్ట్ ఫిల్మ్ తో నాగ్ అశ్విన్ దృష్టిలో పడి అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుని యావత్ సినీపరిశ్రమ నే తనవైపు తిప్పుకున్న ప్రతిభా వంతుడు. ఈ సినిమా కి నవీన్ పొలిశెట్టి , ప్రియదర్శి,రాహుల్ ని ఎంచుకున్నపుడే సగం విజయం సాదించేశాడు దర్శకుడు. కరోనా కి ముందు థియేటర్స్ లో విడుదల అవ్వాల్సి ఈ సినిమా  లాక్డౌన్  టైం లో ఓ టీ టీ లో విడుదల చేయమని ఎన్ని వత్తిడిలు వచ్చిన సినిమా మీద నమ్మకంతో లాక్డౌన్ ముగిశాక థియేటర్ లోనే విడుదల చేసి గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నారు.


👉 కథ:

గల్లీ లో అల్లరి చిల్లరగా తిరుగుతూ సరదాగా గడిపే ముగ్గురు స్నేహితులు హైదరాబాద్ వెళ్లి ఏదో సాదించాలంటూ  

అమాయకంగా పెద్ద క్రైమ్ లో చిక్కుకుని పడ్డ ఇబ్బందులనుంది ఎలా బయటపడ్డారు అనేది హాస్యభరితంగా చెప్పబడిన కథ.


👉 కథనం: 

సినిమా ప్రారంభం అయినప్పటినుండి ఏ ఒక్క నిమిషము కూడా బోర్ కొట్టకుండా ఎలా అయిపోయిందో అన్నట్టు సాగిపోద్ది ఫస్ట్ హాఫ్ .

ఇంకా సెకండ్ హాఫ్ అయితే కోర్ట్ సీన్స్ వచ్చిన ప్రతిసారి కడుపు నొప్పివచ్చేలా నవ్వుతారు జనాలు. సెకండ్ హాఫ్ లో సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ "జస్టిస్ బల్వంత్ చౌదరి" బ్రహ్మానందం. 


👉 సంగీతం:

"అర్జున్ రెడ్డి" తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు జాతగిరత్నాలు తో మరోసారి తన వైవిధ్యాన్ని చాటుకున్నారు.

 నేపధ్య సంగీతం మొదలుకొని సినిమాలో ఉన్న 3 పాటలతో సహా ప్రేక్షకులని కట్టిపడేసేలా ఉంది సంగీతం 

రామజోగయ్య శాస్త్రి రాసిన "చిట్టి" సాంగ్ "చౌరస్తా బ్యాండ్" రాం మిరియాల పాడటంతో అద్భుతమైన రెస్పాన్స్. అలాగే జాతిరత్నాలు టైటిల్ సాంగ్ బిగ్ బాస్ ఫేమ్ "రాహుల్ సిప్లిగంజ్" పడటంతో జనాలలో మంచి స్పందన వస్తుంది.


👉 హైలైట్స్ : 

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తో మంచి విజయాన్ని అందుకున్న నవీన్ జాతిరత్నాలు తో కామెడీ టైమింగ్ లో మరో మెట్టు ఎదిగారనే చెప్పాలి.

హీరో నవీన్ పొలిశెట్టి అద్భుతమైన కామెడీ టైమింగ్ , చాలా సహజంగా వుండే సంభాషణలు , "చిట్టి" సాంగ్ తో పాటు ప్రియదర్శి రాహుల్ ల అల్లరి హైలైట్ కాగా 

ద్వితీయార్థంలో వచ్చే కోర్ట్ సీన్స్ మరియు చాలా రోజులు తరువాత తళుక్కుమని మెరిసిన "జస్టిస్ బల్వంత్ చౌదరి" బ్రహ్మానందం. ఆరోగ్యకరమైన హాస్యం అదనపు బలం.


సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అడుపుబ్బా నవ్వించడమే లక్ష్యం గా పెట్టుకున్న దర్శకుడి కలని అందరూ నటీనటులు సాకారం చేశారు.


ఇలాంటి కొత్తరకం కామెడీ సినిమాలు ఇంతటితో ఆగకుండా సీక్వెల్ వస్తూఉండాలని ఆశిద్దాం.


👉 పై విశ్లేషణ సగటు సినిమా ప్రియుడిగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే . మంచి సినిమా ని ఆదరించండి . పైరసీని అరికడదాం-థియేటర్స్ లోనే సినిమా చూద్దాం

                                                                                                                                        -ఆర్.కె. శాతరాసి

Post a Comment

0 Comments

Close Menu