👉ఏమిటి : కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతించే వ్యవహారం
👉ఎప్పుడు : మర్చి 31 ౨౦౨౧
👉ఎవరు : అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్
👉ఎక్కడ : భారత్ లో
👉ఎందుకు: ఈ విషయాన్ని సొలిసిటర్ జనరల్ ముందుకు తీసుకెళ్లాలి అని వారు సూచించారు.
👉సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూపై కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతించే వ్యవహారం నుంచి నేను వైదొలగుతున్నాను అని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ తెలిపారు.
👉కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతించే వ్యవహారం అనుమతి విషయాన్ని సొలిసిటర్ జనరల్ ముందుకు తీసుకెళ్లాలి అని వారు సూచించారు.
👉విషయం ఏమిటంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడు నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే విషయమై బ్రిటన్ కోర్టులో విచారణ సందర్భంగానూ,ఆ తర్వాతా మనదేశ సర్వోన్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా జస్టిస్ కట్జూ వ్యాఖ్యలు చేశారని,ఇందుకు గాను ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదుకు అనుమతించాలని కోరుతూ అటార్నీ జనరల్‌కు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ మార్చి1న పిటిషన్ సమర్పించారు.
👉కోర్టు ధిక్కరణ కేసు నమోదుకు అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ ఆమోదం అవసరం.
👉అయితే, జస్టిస్ కట్జూతో తనకు 16 ఏళ్లకు పైగా పరిచయం ఉందని, తరచూ తామిద్దరం అనేక విషయాలు చర్చించుకుంటూ ఉంటామని శ్రీవాస్తవకు రాసిన లేఖలో కె.కె.వేణుగోపాల్ తెలిపారు.
👉అందువల్ల ఈ అనుమతి వ్యవహారం నుంచి తాను వైదొలగుతున్నానని, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు దరఖాస్తు చేసుకోవాలని శ్రీవాస్తవకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
నోట్ :
👉భారతదేశానికి అటార్నీ జనరల్ భారత ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారు, మరియు భారత సుప్రీంకోర్టులో ప్రాథమిక న్యాయవాది. వారు ప్రభుత్వ పక్షం నుండి ఉండే న్యాయవాది అని చెప్పవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 (1) ప్రకారం కేంద్ర మంత్రివర్గం సలహా మేరకు వీరిని భారత రాష్ట్రపతి నియమిస్తారు మరియు రాష్ట్రపతి ఆనందం మేరకు వీరు పదవిలో కొనసాగుతారు.
👉వీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడటానికి కావలసిన అర్హత కలిగిన వ్యక్తి అయిఉండాలి (ఐదేళ్లపాటు కొన్ని హైకోర్టు న్యాయమూర్తిగా ఉండాలి లేదా పదేళ్లపాటు కొన్ని హైకోర్టు న్యాయవాదిగా లేదా ప్రముఖ న్యాయమూర్తిగా ఉండాలి. మరియు భారత పౌరుడు అయి ఉండాలి).
👉15 వ మరియు ప్రస్తుత అటార్నీ జనరల్ కె. కె. వేణుగోపాల్. ఈయనను భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరిగి నియమించారు.
0 Comments