👉వేంకటేశ్వరుని సాక్షిగా విజయం ఎవరి సొంతం

 

👉మెజారిటీ చూసి దేశమంతా మాట్లాడుకోవాలి : సీయం జగన్

👉దివంగత ఎంపీ ఆపిన చోటే మొదలెడతా : వైస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి

👉నన్ను గెలిపిస్తే పార్లమెంట్ లో నా గొంతు వినిపిస్తా : టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ

👉మాతృభూమికి సేవచేసే అవకాశం ఇవ్వండి : బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ

👉మరి ప్రజా తీర్పు ఎటు ?

👉వైస్సార్సీపీ కి పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయా ?

👉టీడీపీ గెలిచేందుకు అవకాశాలు ఏమున్నాయ్?

👉బీజేపీ కి జనసేన సహకరిస్తుందా ?

 


                దివంగత తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి.దుర్గాప్రసాద్ గారు ఇటీవల కాలంలో  కరోనా సోకడంతో ఆకాలమరంణం చెందారు.అందువల్ల ఉపఎన్నిక అనివార్యం కాగా ఏప్రిల్ 06 2021 న పోలింగ్ జరగబోతుంది.తిరుపతి పార్లమెంట్ స్థానం చరిత్ర 1952 నుండి 2021 వరకు తీసుకుంటే ఎక్కువసార్లు  కాంగ్రెస్ పార్టీ మధ్యలో టీడీపీ 1984 నుండి 1991 వరకు మాత్రమే గెలిపొందింది.అలాగే 1999 ఒక్కసారి మాత్రమే బీజేపీగెలవడం జరిగింది. గత రెండుదపాలుగా 2014 నుండి ప్రస్తుతం వరకు వైస్సార్సీపీ గెలవడం జరిగింది.

                గత 2019 ఎన్నికల్లో గణాంకాలు తీసుకున్నట్లయితే వైస్సార్సీపీ అభ్యర్థి బల్లి.దుర్గాప్రసాద్ గారు 55.03% శాతం ఓట్లతో, 2,28,376 ఓట్ల  మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అలాగే సమీప ప్రత్యర్ధులు టీడీపీ పార్టీకి 35.75%శాతం ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి 1.83%, బియస్పి - జనసేన పార్టీలకి కలిపి 1.68%, బీజేపీ పార్టీకి  1.22% ఓట్లు రావడం జరిగింది. కొసమెరుపు ఏంటంటే బీజేపీ,జనసేన,బియస్పి,కాగ్రెస్ ఒక్కొపార్టీకి వచ్చిన ఓట్లకంటే ఎక్కువ ఓట్లు నోటా కి 1.96% శాతం రావడం.గత ఎన్నికల ఫలితాలు పక్కనబెడితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా వుందో చూద్దాం.


👉 బీజేపీ-జనసేనలో కనిపించని హడావిడి

                   ఏ రాష్టంలో ఎన్నికలన్నా అందరికన్నా ముందు హడావిడి చేసే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి భిన్నంగా వ్యవహరిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే మొన్న ఈమధ్యనే పక్క రాష్టం అయినట్టి తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగితే బీజేపీ వారు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు ఫలితం కూడా బీజేపీ కి అనుకూలంగానే వచిందనుకోండి. అక్కడ చేసిన ప్రచారం, హంగామా, కేంద్ర మంత్రులు రాకపోకలు, హామీలు, రాష్టప్రభుత్వం పై విరుచుకుపడటం అబ్బో చాలానే జరిగింది.ఆ పరిస్థితి ఇక్కడ లేదు దానికి కారణం ఏమయ్యివుండొచ్చు ?.

              ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ-జనసేన పొత్తులో ఉండటం, గతంలో తెలంగాణా  GHMC ఎన్నికల్లో బీజేపీ కోసం జనసేన త్యాగాలు చేయడం, తిరుపతి ఎంపీ స్థానాన్ని జనసేన ఆశించడం, చివరికి తిరుపతి ఎంపీ స్థానాన్ని కూడా జనసేన వదులుకోవడం లాంటి పరిణామాలతో పాటు.

                 ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ చేసిన నమ్మకద్రోహం, ప్రత్యేక హోదా ఇస్తానని సాక్షాత్తు నరేంద్రమోడీ ఇదే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాలచెంత హామీ ఇవ్వడం అధికారంలోకి రాగాన్నే నెరవేర్చకపోవడం, రైతు వ్యతిరేక చట్టాలు కావొచ్చు, పరిశ్రమల ప్రైవేటీకరణ మరీ ముఖ్యంగా విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను  ప్రైవేటీకరణ చేసే విషయంలో కావొచ్చు, విభజన చటంలో ఉన్న పెండింగ్ హామీలు కావొచ్చు ఒక్కటా రెండా ఇలాంటి అన్నీ వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్టంలో తలెత్తుకోలేని పరిస్థితి కాబోలు బీజేపీ హడావిడి ఆంధ్రప్రదేశ్ లో తగ్గిందనే చెప్పాలి .

                మొత్తానికి బీజేపీ పార్టీ అధిష్టానం మాజీ IAS అధికారిణి రత్నప్రభ గారిని తెరమీదకు తెచ్చింది. ఎన్నో ఏళ్లనుండి పార్టీ కోసం కష్టపడుతున్న దాసరి.శ్రీనివాసులు గారిని, బలమైన సామాజికవర్గం అండ ఉన్న మాజీ ఎంపీ వెంకటస్వామి గారి కుటుంబాన్ని, ఇంకా కొందరు పార్టీకి విధేయులను కాదని రత్నప్రభ గారిని తెరమీదకు తీసుకురావడం ఆశ్చర్యం కలగచేయక మానదు. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ హవా నడుస్తున్న సమయంలోనే 1.22% ఓట్లు మాత్రమే రాబట్టగలిగిన బీజేపీ కనీసం గౌరవం దక్కలన్నా స్థానికంగా పార్టీకోసం కష్టపడేవాళ్లకు టిక్కెట్ కేటాయించి వుండవొచ్చు.

             రాజకీయాలకు కొత్త అయిన రత్నప్రభ గారు ఏమాత్రం ప్రభావం చూపగలరు అనేది పెద్ద సందేహమే.మొదటి ప్రెస్ మీట్ లొనే ఆంధ్ర ప్రజలు ఎంతో ఎమోషనల్ గా అనుకునే ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పడం పెద్ద మైనస్ అనే చెప్పాలి.

              కనీసం ఆవిడ నామినేషన్ వేసేటప్పుడు బీజేపీ పెద్దలు కానీ కేంద్ర పెద్దలు కానీ ఆఖరుకు తమమిత్రపక్షంగా ఉన్న జనసేన పెద్దలు కూడా పక్కన లేకపోవడంతో జనసేన కనీసం సహకరిస్తుందా లేదా అనే సందేహం ప్రజల్లో మొదలైంది.

            పాపం రత్నప్రభ గారు మాత్రం మాతృభూమికి సేవచేసే అవకాశం ఇవ్వండి అంటూ తిరుగుతున్నారు ఆమెను ప్రజలు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి.

             ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోమువీర్రాజు గారు ఉన్నట్టుండి ఎన్నికలు రాగానే పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకులని వారిని రాష్టానికి ముఖ్యమంత్రి చేయాలని అప్పట్లోనే మోదీ గారు నాతో చెప్పారని ప్రెస్సుమీట్ లో చెప్తుంటే ప్రజలు పగలబడి నవ్వుకుంటున్నారు.


👉 కాంగ్రెస్ పార్టీ ఉన్న కూడా  లేనట్టే

             ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయినమాట తెలిసింది వారు పోటీలో ఉన్నా లేనట్టే.వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

 

👉 మేకపోతు గంభీర్యం చూపుతున్న తెలుగుదేశం పార్టీ

            గతంలో అయిన ప్రస్తుతం అయిన తిరుపతి ఎంపీ స్థానంలో కాస్త ఓట్ బ్యాంకు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ గత రెండుదఫాలు కూడా రెండొస్తానంలో ఉన్నది మాత్రం టీడీపీ నే.అభ్యర్థి విషయం జాప్యం జర్లుగాలేదు కానీ ప్రచారంలో మాత్రం YCP తో పోల్చితే కాస్త  వెనకబడే ఉన్నారని చెప్పొచ్చు.

              టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ గారు గత ఎన్నికల్లో కూడా తిరుపతి నుండి పోటీ చేసి వైస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ గారి చేతిలో ఓడిపోయున్నారు. ఉపఎన్నికకు కూడా ఆమెకే టికెట్ రావడం పెద్ద ఆశ్చర్యం ఏమి కలిగించలేదు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కాస్త నిరాశ ఉన్నమాట వాస్తవం. దినికి కారణం  గడిచిన పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడటం. ఆ ఓటమినుండి బయటకి రాకమునుపే మల్లి తిరుపతి ఉపఎన్నికలు ఇవి కుడా  అదే ఫలితాలు పునరావృతం అవుతుందేమో అనే ఆందోళన అయితే కొంత మందిలో  ఉన్నట్టుంది.

               నామినేషన్ కార్యక్రమంలో పార్టీ పెద్దలు పాల్గొన్నప్పటికీ ప్రచారంలో జోరు చూపకపోవడం ప్రజల్లో ఆలోచన మొదలైంది. నామినేషన్ వేసిన తరువాత మొదటి ప్రసంగంలోనే పనబాక లక్ష్మీ గారు మాట్లాడుతూ ఈ ఒక్క స్థానం టీడీపీ గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు అని నోరు జారి మాట్లాడటం పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురి అయ్యారని చెప్పాలి.నా రాజకీయ అనుభవం గెలుపొందే ఆవకాశం చూపుతోంది అని ఆమె  ఆశా భావం తో ధీమా గా ఉంది.

              ఇక్కడ  పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు ఇంతవరకు ప్రచారంలో పాల్గొనకపోవడం కూడా అభ్యర్థికి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది.చంద్రబాబు గారు ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకోలేదేమో అనే సందేహము లేకపోలేదు. ప్రతి చిన్న విషయానికీ ప్రభుత్వానికి ఇది రెఫరెండం(ప్రజా తీర్పు) అనే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఈ ఎన్నికలు మాత్రం రెఫరెండం కాదు అనడంలో ఓటమిని ముందే అంగీకరిస్తున్నట్టు ఉన్నారనే అనే వాదనా వినపడుతోంది.

              అధికారంలో లేకపోవడం, గడిచిన పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడటం, ప్రభుత్వాలని మార్చేసే ఎన్నికలు కాకపోవడం, తిరుపతి పార్లమెంట్ పరిధిలో వుండే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అధికార వైస్సార్సీపీ కి చెందిన MLA's ఉండటం ప్రజల ఆలోచనా ధోరణి ప్రకారం ఈ తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో టీడీపీ గెలవడం అనేది అసాధ్యం కాని పని కాని  రెండో స్థానంలో ఉంటుంది అనడంలో సందేహమే లేదు.

 

👉 రెట్టింపు ఉత్సాహంలో వైస్సార్సీపీ శ్రేణులు

               నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడిన మాట "మన మెజార్టీ చూసి దేశంమొత్తం మాట్లాడుకోవాలి" ఆ మాటతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపుగా ఊపు అందుకొంది దిని కారణం గడిచిన పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో 85% కి పైగా స్థానాలతో విజయ దుందిభిః మోగించి ఆ విజయాలు మరువకమునుపే ఈ ఉపఎన్నిక రావడం.వైస్సార్సీపీ అభ్యర్థి జగన్ గారి పాదయాత్ర సమయంలో తన వ్యక్తిగత పిజియోతెరఫీ వైద్యుడు అయినట్టి Dr.గురుమూర్తి జగన్ రెడ్డి గారి నమ్మిన బంటు స్థానం కాబట్టి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఇంకా కాస్త ఊపు నిచ్చే అంశం. అతి సామాన్య కుటుంబం నుండి వచ్చిన గురుమూర్తి గారే అభ్యర్థి అని నోటిఫికేషన్ కి మునుపే అనధికారికంగా తెలిన విషయమే ఇప్పుడు అధికారికంగా చెప్పారు. YCP మంత్రుల వరసలో మరో ఎంపీ గా గురుమూర్తి గారు కూర్చోబోతున్నారు.

             గత ఎన్నికల్లో 25 మంది ఎంపీలను గెలిపించండి అని వైస్సార్సీపీ ప్రచారం చేసి 25కి 23 ఎంపీ స్థానాలు గెలిచినప్పటికీ ప్రత్యేక హోదా విషయంలో జరుగుతున్న జాప్యం మాత్రం ఇంకా మాసిపోలేదు.ఇంకా విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ కాపాడుకోగలరా అన్న చర్చా లేకపోలేదు. వీటి ప్రభావం ముగిసిన పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కనపడలేదు మరి ఈ ఎంపీ ఎన్నికలో ఈ విషయాల ప్రభావం ఎంత ఉంటుందో వేచి చూడాలి

              రాష్టంలో అతి ముఖ్యమైన మంత్రులు అందరూ చాలామంది MLA లు అందరి సహకారంతో నామినేషన్ కూడా దాఖలు చేశారు గురుమూర్తి గారు.దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారు ఏఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మధ్యలో ఆకాలమరణం చెందారో అక్కడనుండి మొదలుపెడతాను అంటున్నారు గురుమూర్తి. జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాల హామీలలో భాగంగా 90%కి పైగా పూర్తిస్థాయిలో చేయడం జరిగింది మా సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని అత్యదిక మెజారిటీ తో గెలిపిస్తాయి అని వైస్సార్సీపీ వారు ధీమాగా వున్నారు.

              నూతనంగా ఎన్నికయినట్టి స్థానిక సంస్థల ప్రతినిధులతో బలంగా ఉన్నటువండి తరుణంలో  వైస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి గెలుపు లాంఛనమే అని చెప్పొచ్చు.                      

విశ్లేషకులు: ఆర్.కె.శాతరాసి

                                         :+91 9629301038

Post a Comment

0 Comments

Close Menu