👉 క్రెడిట్​కార్డు వాడకం మెదడుకు కొకైన్​ మాదిరిగానే కిక్​ ఇస్తుంది

 

👉ఏమిటి : క్రెడిట్ కార్డు వాడకం అంటే కొకైన్‌కి బానిసవ్వడమే

👉 ఎప్పుడు : ఇటివల

👉 ఎవరు : మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటి) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది

👉ఎందుకు : ఎంఐటి అధ్యయనం ప్రకారం.. క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లు చేసే సమయంలో కొకైన్ మాదిరిగానే మెదడులో ఒక రియాక్షన్​ని, ఒక మత్తుని ఏర్పరుస్తుందని సర్వేలో తేలింది.

👉మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే జర జాగ్రత్త. క్రెడిట్ కార్డు వాడకం అంటే కొకైన్‌కి బానిసవ్వడమే అని తాజాగా మసాచుసెట్స్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటి) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

👉అయితే క్రెడిట్ కార్డుతో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

👉షాపింగ్ మాల్స్, రిటైల్ అవుట్లెట్లలో, ఈ-కామర్స్ లో క్రెడిట్ కార్డులను తరచుగా ఉపయోగించడం ఇప్పుడు సాధారణమై పోయింది. మెట్రో నగరాల్లోని ఎక్కువ మంది క్రెడిట్ కార్డులు అధికంగా వినియోగిస్తున్నారు.

👉ఇది చాలదు అన్నట్టు పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఉద్యోగులకు, వ్యాపారులకు క్రెడిట్​ కార్డులను ఆఫర్​ చేస్తున్నాయి.

👉దీంతో అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్​ కార్డులు తీసుకునేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. క్రెడిట్ కార్డు తీసుకున్నవారు అవసరం ఉన్నా లేకపోయినా విపరీతంగా ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.

👉ఎందుకంటే ఈ మత్తులో పడిపోతే తొందరగా బయటికి రాలేరని నిపుణులు అంటున్నారు.

👉ఎంఐటి అధ్యయనం ప్రకారం.. క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లు చేసే సమయంలో కొకైన్ మాదిరిగానే మెదడులో ఒక రియాక్షన్​ని, ఒక మత్తుని ఏర్పరుస్తుందని సర్వేలో తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రెడిట్​కార్డు వాడకం మెదడుకు కొకైన్​ మాదిరిగానే కిక్​ ఇస్తుందని పరిశోధకులు అంటున్నారు.

👉వివిధ రకాల ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో క్రెడిట్ కార్డు ఉంటే కోరికలు ఎక్కువ కలుగుతాయని అధ్యయనం తెలిపింది.

👉దీనివల్ల అవసరమైన వాటి కంటే అనవసరమైన ఖర్చు ఎక్కువ పెడుతున్నట్లు సర్వేలో తేలింది. ఉదాహరణకు రెస్టారెంట్లలో, సెలవు దినాలలో ఉపయోగించే క్రెడిట్ కార్డులు ఇంధనంపై ఉపయోగించే కార్డుల కంటే పెద్ద కోరికలను రేకెత్తిస్తాయి.

👉ఈ విషయంపై ప్రొఫెసర్ డ్రేజెన్ ప్రిలెక్ మాట్లాడుతూ.. కొంత మంది క్రెడిట్​కార్డు, మరికొంతమంది నగదు లావాదేవీలు చేసే వారి మెదడు ప్రతిస్పందనలను తాము స్కాన్ చేశాము. ఇందులో క్రెడిట్​ కార్డు ఉపయోగించి షాపింగ్​ చేస్తున్న వారిలో మెదడు ప్రేరేపించ బడుతున్నట్లు కనుగొన్నాము.

👉ఈ చర్య వారికి ఆనందం కలుగజేస్తోందని.. అందువల్ల అవసరం లేకున్నా ఎక్కువ కొనుగోళ్లు చేస్తుండటం పరిశీలించామని వివరించారు.

Post a Comment

0 Comments

Close Menu