👉 దేశవ్యాప్తంగా కొత్త చెక్కు ట్రంకేషన్ విధానము

 

👉 ఏమిటి : దేశవ్యాప్తంగా కొత్త చెక్కు ట్రంకేషన్ విధానము

👉 ఎప్పుడు : ఇటివల

👉 ఎవరు : RBI   

👉 ఎక్కడ : భారత్ లో

👉 ఎందుకు : దేశవ్యాప్తంగా కొత్త చెక్కు ట్రంకేషన్ విధానాన్ని సెప్టెంబరు 30 నాటికి విస్తరించాలని

👉దేశవ్యాప్తంగా కొత్త చెక్కు ట్రంకేషన్ విధానాన్ని విస్తరించాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్ణయించింది.

👉ఈ విధానం ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే అమలవుతోంది. దీనిని అన్ని బ్యాంకుల శాఖలకు సెప్టెంబరు 30నాటికి విస్తరించాలని ఆదేశించింది.

👉బ్యాంకులకు ఆర్బీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఇమేజ్ బేస్డ్ చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్)ను అన్ని శాఖలకు సెప్టెంబరు 30 నాటికి విస్తరించాలని పేర్కొంది.

👉సీటీఎస్ విధానం సమగ్రంగా అందుబాటులో ఉండాలని, కస్టమర్ ఉండే చోటుతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా సేవలు అందాలని తెలిపింది.

👉దేశంలోని అన్ని బ్యాంకుల శాఖలన్నిటికీ సీటీఎస్ విధానాన్ని విస్తరించాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

👉 సీటీఎస్ అంటే ఏమిటి ??

  • చెక్కును జారీ చేసినప్పటి నుంచి నగదు చెల్లింపు జరిగే వరకు బ్యాంకు శాఖల మధ్య భౌతికంగా ఆ చెక్కు తిరగవలసిన అవసరం లేకుండా చేయడమే సీటీఎస్ విధానం అని పిలుస్తారు.

👉 సీటీఎస్ విధానం ఎప్పటి నుంచి అమలులో ఉంది ??

  • ఇదిలావుండగా, సీటీఎస్ విధానం 2010 నుంచి అమల్లో ఉంది. ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల్లోని బ్యాంకు శాఖల్లో అందుబాటులో ఉంది

Post a Comment

0 Comments

Close Menu