👊 ఆన్లైన్ లో కత్తులను డెలివరీ చేయద్దు

 

👊ఏమిటి : కత్తులను డెలివరీ చేయద్దు

👊ఎప్పుడు : ఇటివల  

👊ఎవరు : ఛత్తీస్గఢ్ ప్రబుత్వం విన్నపం

👊ఎక్కడ : ఛత్తీస్గఢ్ లో

👊 ఎందుకు : ఛత్తీస్గఢ్ రాజధానిలో కత్తిపోటు ఘటనలు పెరుగుతున్న తరుణంలో వినియోగదారులకు కత్తులు డెలివరీ చేయవద్దని ఈ-కామర్స్ సంస్థలను కోరారు



👉ఆన్లైన్లో వినియోగాదారులు ఆర్డర్ చేసిన కత్తులను డెలివరీ చేయొద్దని అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలను కోరారు ఛత్తీస్గఢ్ పోలీసులు. రాష్ట్ర రాజధాని రాయ్పుర్లో కత్తిపోటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేసారూ.

👉 గత కొన్ని నెలలుగా కత్తిపోటు ఘటనలు, మరణాలు పెరిగాయని.. ఈ కేసులకు ఆన్లైన్లో కొనుగోలు చేసిన కత్తులతో సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.

👉ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే పలువురి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో ఎక్కువగా మైనర్లే ఉన్నట్లు తెలిపారు.

👉రాజధాని నగరంలో పెరుగుతున్న కత్తిపోటు ఘటనలను దృష్టిలో ఉంచుకుని రాయ్పుర్ పోలీసులు ఓ ప్రచారాన్ని ప్రారంభించారు. గతేడాది కత్తులను ఆర్డర్ చేసిన వ్యక్తుల కోసం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ ఈ-కామర్స్ సంస్థల నుంచి డేటాను పోలీసులు సేకరించారు.

👉ఈ జాబితా ఆధారంగా 2020లో 800 మంది కత్తులు ఆర్డర్ చేసినట్లు తేలింది. వీటిలో రాయ్పుర్ నుంచి 502, ఛత్తీస్గఢ్ జిల్లా నుంచి 298 ఆర్డర్లు వచ్చినట్లు  తెలిపారు.

👉ఛత్తీస్గఢ్ రాజధానిలో కత్తిపోటు ఘటనలు పెరుగుతున్న తరుణంలో వినియోగదారులకు కత్తులు డెలివరీ చేయవద్దని ఈ-కామర్స్ సంస్థలను కోరారు పోలీసులు.

Post a Comment

0 Comments

Close Menu