👉 భార‌త్‌లో రైతు నిర‌స‌న‌లు బ్రిటన్ లో చర్చ

 

👉 ఏమిటి : భార‌త్‌లో జ‌రుగుతున్న రైతు నిర‌స‌న‌లు బ్రిటన్ లో చర్చ

👉 ఎప్పుడు:  ఇటివల

👉 ఎవరు : బ్రిటీష్ పార్ల‌మెంట్‌లో

👉 ఎక్కడ : భారత్ లో జరుగుతున్న అంశం  

👉 ఎందుకు  : మూడు కొత్త సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు ఉద్య‌మిస్తున్న విష‌యం.

👉 భార‌త్‌లో జ‌రుగుతున్న రైతు నిర‌స‌న‌లుప‌త్రికా స్వేచ్ఛ అంశాల‌పై సోమ‌వారం రోజున బ్రిటీష్ పార్ల‌మెంట్‌లో చ‌ర్చ చేప‌ట్టారు.  

👉బ్రిట‌న్ ఎంపీలు ఈ అంశాల‌పై చేప‌ట్టిన చ‌ర్చ‌ను లండ‌న్‌లో ఉన్న భార‌తీయ హై క‌మీష‌న్ త‌ప్పుప‌ట్టింది. 

👉 ఈ నేప‌థ్యంలో హై క‌మీష‌న్ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేసింది.

👉చ‌ర్చ స‌రైన రీతిలో స‌మ‌తుల్యంగా జ‌ర‌గ‌లేద‌ని, త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌తో చ‌ర్చించార‌ని, త‌మ వాద‌న‌ల‌కు ఎటువంటి ఆధారాలు లేవ‌ని, ప్ర‌పంచంలోని అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశంపై అనుచిత ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, భార‌త వ్య‌వ‌స్థ‌ల‌ను త‌ప్పుగా చిత్రీక‌రిస్తున్నార‌ని హై క‌మీష‌న్ త‌న లేఖ‌లో పేర్కొన్న‌ది. 

👉 విదేశీ మీడియాతో పాటు బ్రిటీష్ మీడియా కూడా ఇండియాలో ఉన్న‌ద‌ని, భార‌త్‌లో ప‌త్రికా స్వేచ్ఛ లేద‌న్న అంశం ఏ ర‌కంగా ఉత్ప‌న్నంకాదు అని భార‌తీయ హై క‌మీష‌న్ త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది.

👉సోమ‌వారం రోజున బ్రిటీష్ పార్ల‌మెంట్ సుమారు 90నిమిషాలు భార‌త్‌లో జ‌రుగుతున్న రైతు నిర‌స‌న‌ల‌పై చ‌ర్చించింది. 

👉 అలాగే ఇండియాలో ఉన్న ప్రెస్ ఫ్రీడం అంశాన్ని కూడా చ‌ర్చించారు. 

👉రైతు నిర‌స‌న‌ల ప‌ట్ల ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరును లేబ‌ర్ పార్టీ, లిబ‌ర‌ల్ డెమోక్రాట్స్‌, స్కాటిష్ నేష‌న‌ల్ పార్టీ ఎంపీలు ఖండించారు. 

👉త్వ‌ర‌లో ప్ర‌ధాని మోదీతో బ్రిటన్ ప్ర‌ధాని క‌లుసుకుంటార‌ని, ఆ స‌మ‌యంలో రైతు నిర‌స‌న‌ల అంశాన్ని లేవ‌నెత్తుతామ‌ని బ్రిట‌న్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 

👉భార‌త సంత‌తికి చెందిన లిబ‌ర‌ల్ డెమోక్రాట్ నేత గుర్చ్ సింగ్ వేసిన పిటిష‌న్ ఆధారంగా బ్రిట‌న్ పార్ల‌మెంట్‌లో చ‌ర్చ చేప‌ట్టారు. 

👉 ఆ పిటిష‌న్‌పై బ్రిట‌న్‌లో ఉన్న స్థానికుల నుంచి ల‌క్ష‌ల సంఖ్య‌లో సంత‌కాలు సేక‌రించారు. 

👉 స్కాటిష్ నేష‌న‌ల్ పార్టీకి చెందిన మార్టిన్ డే.. ఈ అంశంపై చ‌ర్చ‌ను మొద‌లుపెట్టారు.  

👉 రైతు సంస్క‌ర‌ణ‌లు భార‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ని, ఆ సంస్క‌ర‌ణ‌ల గురించి మ‌నం చ‌ర్చించ‌డం లేద‌ని, కేవ‌లం నిర‌స‌న‌కారుల ర‌క్ష‌ణ గురించి మాత్ర‌మే చ‌ర్చిస్తున్నామ‌ని మార్టిన్ అన్నారు.

👉రైతు నిర‌స‌న‌కారుల‌పై టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించార‌ని, ప‌లు చోట్ల ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయ‌ని, ఇంట‌ర్నెట్ క‌న‌క్టివిటీ దెబ్బ‌తిన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

👉రైతు నిర‌స‌న‌ల‌కు మ‌ద్దతుగా బ్రిట‌న్ ఎంపీలు మాట్లాడినా.. ఆ దేశానికి చెందిన ఆసియా విదేశాంగ మంత్రి  నీగ‌ల్ ఆడ‌మ్స్ భార‌త ప్ర‌భుత్వానికి బాస‌ట‌గా నిలిచారు. 

👉లేబ‌ర్ పార్టీ నేత జెర్మీ కార్బిన్ మాట్లాడుతూ.. ఎందుకు రైతులు అంత పెద్ద సంఖ్య‌లో నిర‌స‌న‌లు చేప‌డుతున్నారో ఆలోచించాల‌న్నారు.  జ‌ర్న‌లిస్టుల అరెస్టు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ద‌న్నారు. 

👉బ్రిట‌న్‌లోనూ నిర‌స‌న‌లు జ‌రిగిన‌ప్పుడు పోలీసుల‌కు వ్య‌తిరేకంగా ఫిర్యాదులు అందుతుంటాయ‌ని, అంటే దాని అర్థం ప్ర‌జాస్వామ్యానికి బ్రిట‌న్ వ్య‌తిరేకం కాదు అని క‌న్జ‌ర్వేటివ్ ఎంపీ థెరిసా విల్లియ‌ర్స్ తెలిపారు. 

👉బ్రిట‌న్ పార్ల‌మెంట్‌లో జ‌రిగిన చ‌ర్చ గురించి లండ‌న్‌లోని భార‌తీయ హై క‌మిష‌న్ త‌న ప్ర‌క‌ట‌న‌లో ప్ర‌స్తావిస్తూ.. భార‌త్‌తో మైత్రి క‌లిగి ఉన్న దేశాలు ఎటువంటి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసినా.. ఆ అంశాల‌ను స‌రిచేయ‌డం త‌మ క‌ర్త‌వ్య‌మ‌ని పేర్కొన్న‌ది.


Post a Comment

0 Comments

Close Menu