👉 స్పేస్‌ లో హోటల్

👉 ఏమిటి :  స్పేస్‌ లో  హోటల్‌

👉 ఎప్పుడు : ౨౦౧౭

👉 ఎవరు : ఆర్బిటాల్‌ అసెంబ్లీ కార్పొరేషన్‌

👉 ఎక్కడ : స్పేస్‌ లో  

👉 ఎందుకు : ఆదునికత పెంపు ప్రక్రియ

👉 ఆకలి గా ఉందా  మరో ఆరేళ్లు ఓపిక పడితే అక్కడ ఇక్కడ కాదు   స్పేస్‌ హోటల్‌ని కూడా చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

👉 ఆర్బిటాల్‌ అసెంబ్లీ కార్పొరేషన్‌(ఓఏసీ) అనే కంపెనీ ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ స్పేస్‌ హోటల్‌ పేరు వాయిజర్‌ స్పేస్‌స్టేషన్‌’.

👉 సుమారు 400 మందికి ఆతిథ్యం ఇవ్వనున్న ఈ హోటల్‌లో సకల సౌకర్యాలు ఉంటాయి.

👉 మన భూమి మీద హోటల్‌ రూమ్‌లకంటే ఈ రూమ్‌లు మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉండనున్నాయి. వాయిజర్‌లో బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, లైబ్రరీలు, కచేరీ వేదికలు, హెల్త్‌ స్పాలు, జిమ్‌లు, స్పేస్‌లో నుంచి భూమినీ చూసేందుకు లాంజ్‌లు, బార్‌లు కూడా ఉంటాయి.

👉 2025లో ప్రారంభమయ్యే ఈ హోటల్‌ నిర్మాణం 2027నాటికి పూర్తవుతుంది.

👉 అప్పటినుంచి పర్యాటకులను హోటల్లో బస చేసేందుకు అనుమతిస్తారు.

👉అయితే స్పేస్‌ హోటల్‌ ఉన్న వ్యక్తులు గాల్లో తేలకుండా ఉండేందుకు  హోటల్‌ భ్రమణ రేటులో హెచ్చుతగ్గుల ద్వారా కృత్రిమ గురుత్వాకర్షణ శక్తిని ఉత్పత్తి చేసే విధంగా హోటల్‌ను నిర్మించనున్నట్లు ఓఏసీ చెప్పింది.

👉 మూన్‌ ఉపరితలంపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి స్థాయిలో హోటల్‌ కృత్రిమ గురుత్వాకర్షణ శక్తి  ఉంటుంది. 

👉దాదాపు ఒక జెయింట్‌ వీల్‌ వంటి నిర్మాణంలో ఉండే ఈ హోటల్‌ 90నిమిషాలలో భూమి చుట్టూ తిరిగివస్తుంది.

👉వాయిజర్‌ పర్యాటకులకు అంతరిక్షంలో విహరించిన అనుభూతిని అందించడంతోపాటు, తక్కువ గురుత్వాకర్షణలో స్పేస్‌ ఏజెన్సీలు చేపట్టే ప్రయోగాలకు ఆవాసంగా ఉపయోగపడనుంది.

👉 ఈ హోటల్‌ నిర్మాణంలో అనుభవం కలిగిన నాసా శాస్త్రవేత్తలతోపాటు పైలెట్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు పనిచేయనున్నారు.

👉2012లోనే వాయిజర్‌ స్టేషన్‌ ఐడియా వచ్చింది. అది కార్యరూపం దాల్చేందుకు 2018లో ఓఏసీని ఏర్పాటు చేశారు. అయితే హోటల్‌ నిర్మాణానికయ్యే ఖర్చు, ఒకరోజు హోటల్‌లో గడిపేందుకు చెల్లించాల్సిన బిల్లు ఎంత అనేది ఇంతవరకు ఓఏసీ ప్రకటించలేదు.

Post a Comment

0 Comments

Close Menu