👉పేదలు లేని దేశం గా చైనా ? చైనా లో పేదరికాన్ని ఎలా కొలుస్తారు ?
👉 చైనా లో పేదరికాన్ని ఎలా కొలుస్తారు?
👉 గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రోజువారి ఆదాయం 2.30 డాలర్ల(రూ.169.05) కన్నా తక్కువ ఉంటే వారిని పేదవారిగా చైనా ప్రభుత్వం గుర్తిస్తుంది. జీవన ప్రమాణాలు, విద్య, వైద్య సౌకర్యాల ఆధారంగా 2010లో దీన్ని నిర్ణయించారు.
👉 చైనా ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి రాష్ట్రాలు (ప్రావిన్సులు) పోటీపడ్డాయి. ఉదాహరణకు జియాంగ్సు అనే రాష్ట్రాన్నే తీసుకుంటే, తమ ప్రాంతంలోని 8కోట్ల మంది జనాభాలో ప్రస్తుతం కేవలం17 మంది మాత్రమే పేదలని వెల్లడించింది.
👉 పేదరికాన్ని గుర్తించడానికి రోజువారి ఆదాయం 1.90డాలర్లు(రూ.139.65)గా వరల్డ్ బ్యాంక్ గుర్తించగా, చైనా దానికన్నా కాస్త ఎక్కువ ఆదాయాన్నే పేదరికానికి ప్రమాణంగా నిర్ధరించింది
👉 ప్రపంచ బ్యాంక్ డేటా
👉వరల్డ్ బ్యాంక్ నిర్ధరించిన ప్రమాణాన్నే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పాటిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 1990ల నాటికి చైనాలోని 75 కోట్ల మంది అంటే ఆ దేశంలోని మూడింట రెండువంతుల జనాభా పేదరికంలో ఉంది.
👉 2012 నాటికి ఇది 9కోట్లకు, 2016నాటికి 72లక్షలకు పడిపోయిందని ప్రపంచ బ్యాంక్ డేటా సూచిస్తోంది. దీనిని బట్టి 2016 నాటికి చైనా తన లక్ష్యానికి చేరువగా ఉంది.
👉 అయితే, ప్రపంచ బ్యాంకు వద్ద తాజా గణాంకాలు లేకపోయినప్పటికీ, ట్రెండ్ మాత్రం చైనా ప్రకటించుకున్న డేటాకు చేరువగా ఉంది.
👉 ఇదే సమయంలో వియాత్నాం కూడా చైనా మాదిరిగానే పేదరికం నుంచి బైటపడింది. ఇక ఇండియాలో 2011 నాటికి 22%మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు.
👉 అంటే వీరి రోజువారి ఆదాయం ఇప్పటి కరెన్సీ లెక్కల్లో రోజు రూ.139.64.
👉 ఇక బ్రెజిల్‌లో 4.4%మంది రోజుకు 1.90డాలర్లకన్నా ఎక్కువ సంపాదించలేని వారు ఉన్నారు.
👉 ఆర్ధిక వృద్ధిని నిలకడగా కొనసాగించడం ద్వారా పేదరికంపై యుద్ధంలో చైనా విజయం సాధించగలిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధిపై దృష్టిపెట్టడం కలిసొచ్చింది.
👉 కొత్త పట్టాణాల నిర్మాణమేకాక, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త కాలనీలను నిర్మించారు.
👉 అయితే, ఇంట్లో ఉండాలా, పనికెళ్లాలా అన్నది నిర్ణయించుకునే స్వేచ్ఛ చైనాలో ప్రజలకు లేదు అని విమర్శకులు తెలిపారు.
👉రైతు రాజ్యాన్ని పారిశ్రామిక రాజ్యంగా మార్చాలన్న 1950ల నాటి మావో విధానాలు ముఖ్యంగా 1958లోఆయన ప్రారంభించిన గ్రేట్ లీప్ ఫార్వర్డ్ రైతులను బలవంతంగా శ్రామిక వర్గాలుగా మార్చిందని, దీనివల్ల చాలామంది గ్రామీణ ప్రాంత ప్రజలు ఆకలితో మరణించారు.
👉పేదరిక నిర్మూలనకు చైనా తీవ్రప్రయత్నాలు చేసిన మాట నిజమే. కానీ అవి ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా ? అన్నది ఇక్కడ ఇంకొక ప్రశ్న. ఉన్నత, మధ్యతరగతి ఆదాయం ఉన్న దేశాలకు దారిద్ర్యరేఖ పరిధిని వరల్డ్ బ్యాంక్ అధికంగానిర్ధారించింది.
👉 ఈ ప్రమాణాల ప్రకారం చైనా జనాభాలోని పావువంతు మంది పేదరికంలో ఉన్నట్లు లెక్క.
👉 దేశంలోని 60కోట్ల మంది ప్రజల నెలవారీ ఆదాయం 1000 యువాన్(154డాలర్లు)లకు మించదని చైనా ప్రధాని లీ కెకియాంగ్ గత ఏడాది ప్రకటించారు. ఈ ఆదాయంతో పట్టణాల్లో ఇల్లు అద్దెకు తీసుకోవడం కూడా సాధ్యం కాదని ఆయన చెప్పారు.
👉 ఏది ఏమైనా పేదరికాన్ని నిర్మూలించడానికి గత కొన్ని దశాబ్దాలుగా చైనా ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకున్నదని మాత్రం చెప్పాల్సిందే.
0 Comments