👉 ఏమిటి : 3డీ ఇమేజింగ్ సాంకేతికతతో మిస్టరీ ఛేదన
👉 ఎప్పుడు : ఇటివల
👉 ఎవరు : యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు
👉ఎందుకు : 2,000 ఏండ్ల క్రితమే గ్రీకులు ఓ కంప్యూటర్‌ను తయారు చేశారన్న విషయం మీకు తెలుసా ?
👉 1822లో చార్లెస్ బాబేజ్ కంప్యూటర్ భావనను ప్రపంచానికి పరిచయం చేశారు.
👉 అయితే 2,000 ఏండ్ల క్రితమే గ్రీకులు ఓ కంప్యూటర్‌ను తయారు చేశారన్న విషయం మీకు తెలుసా?
👉ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్‌గా పిలుస్తున్న దాని మిస్టరీని తాజాగా పరిశోధకులు చేధించారు.
👉గ్రీసు తీరంలోని మధ్యధరా సముద్రంలో మునిగిపోయిన ఓ పురాతన ఓడలో 1901లో పరిశోధకులు ఓ పరికరాన్ని గుర్తించారు.
👉 క్రీస్తుపూర్వం 65వ సంవత్సరానికి చెందిన పురాతన గ్రీకులు దీన్ని తయారు చేసినట్టు ఒక నిర్ణయానికి వచ్చారు.
👉దీని సాయంతో గ్రహ గమనాలు, సూర్య-చంద్రోదయాలు, జ్యోతిష శాస్త్రం, క్యాలెండర్, గణిత శాస్త్రం, గ్రహణాలు వంటి కచ్చితమైన వివరాలను వందల ఏండ్ల ముందుగానే కచ్చితంగా లెక్కగట్టేవారని పరిశోధనల్లో తేలింది.
👉‘యాంటికిథెరా’గా నామకరణం చేసిన ఈ పరికరాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి అనాలజీ కంప్యూటర్‌గా పిలుస్తున్నారు.
👉దశాబ్దాల ముందుగా జరుగబోయే విషయాలను అంత కచ్చితంగా ‘యాంటికిథెరా’ ఎలా అంచనా వేయగలుగుతున్నదన్న అంశంపై పరిశోధకులు 120 ఏండ్లుగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు.
👉‘యాంటికిథెరా’కు సంబంధించిన ముప్పావు శాతం అవశేషాలు ధ్వంసమవ్వడంతో ఈ కంప్యూటర్ వెనకున్న సూత్రం ఇప్పటివరకూ బయటపడలేదు.
👉 అయితే యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు 3 డీ ఇమేజింగ్ సాంకేతికతతో ‘యాంటికిథెరా’ను తాజాగా పునర్నిర్మించారు.
👉 దీని సాయంతో ‘యాంటికిథెరా’లో వాడిన మ్యాథమెటికల్ టేబుల్స్, అల్గారిథమ్స్‌ను కనుగొన్నారు.
👉‘ప్రస్తుతం మనం ఊహించిన దానికంటే అప్పటి పురాతన గ్రీకులు శాస్త్ర, అంతరిక్ష, గణిత శాస్ర్తాల్లో ఎంతో ముందున్నారు’ అని పరిశోధనల్లో పాలు పంచుకున్న ఆడమ్ వోజ్‌కిక్ తెలిపారు.
👉‘యాంటికిథెరా’ సాయంతో ఇంకా ఎన్ని రకాల సాధనలు చేసేవారో తెలుసుకోవాల్సి ఉన్నదన్నారు.
👉3డీ ఇమేజింగ్ సాయంతో త్వరలోనే మరింత సమాచారం తెలుస్తుందన్నారు.
0 Comments