👉 ఏమిటి : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా
👉 ఎప్పుడు : మార్చ్ ౯ ౨౦౨౧
👉 ఎవరు : త్రివేంద్ర సింగ్ రావత్
👉 ఎక్కడ : ఉత్తరాఖండ్
👉 ఎందుకు : బీజేపీ అగ్రనాయకత్వంతో సమావేశ నిర్ణయం మేరకు
👉 అసమ్మతి వార్తల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మార్చ్ ౯ న తన పదవికి రాజీనామా చేశారు.
👉ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకత్వంతో సమావేశం అనంతరం డెహ్రాడూన్‌కు తిరిగివచ్చిన సీఎం రావత్ రాజ్‌భవన్‌లో గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలిసి రాజీనామా పత్రం సమర్పించారు.
👉 కొత్త సీఎంను ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభాపక్షం బుధవారం సమావేశమవుతుందని వారు వెల్లడించారు.
👉 రాష్ట్ర మంత్రి ధన్‌సింగ్ రావత్, ఎంపీలు అజయ్‌భట్, అనిల్ బలూనీలు రేసులో ఉన్నప్పటికీ.. ధన్ సింగ్‌కే తదుపరి సీఎం అయ్యే చాన్సుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
👉 2000 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్ నుంచి విడిపడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఇప్పటివరకు కాంగ్రెస్ నేత ఎన్‌డీ తివారీ మినహా ఏ ముఖ్యమంత్రి కూడా పూర్తిగా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగకపోవడం ఉత్తరాఖండ్ ప్రత్యేకత.
👉 2017, మార్చి 18న రావత్ ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో మొత్తం 70స్థానాలకుగాను 57సీట్లను బీజేపీ గెలుచుకుంది.
👉 ఉత్తరాఖండ్ ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రము.ఇది 2006 వరకు ఉత్తరాంచల్ గా పిలవబడింది. ఉత్తరాఖండ్ 2000 సంవత్సరము నవంబరు 9న భారతదేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది అంతకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగము.
ఎప్పుడు ఏర్పడింది : 9 నవంబర్, 2000
భూ ప్రాంతం : 53,483 km²
రాజధానులు : డెహ్రాడున్ (చలికాలం), గైర్సాయిన్ (వేసవి కాలం)
0 Comments