👉 ఏమిటి : Green Revolution (GR) చరిత్ర
👉 ఎప్పుడు : 1940-70ల మధ్యకాలంలో
👉 ఎవరు : Rock Feller Foundation Ford Founden నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ (అమెరికా )
👉 ఎందుకు : పంటల దిగుబడి ని పెంచడం కోసం.
👉 హరిత విప్లవము Green Revolution (GR)
👉 బ్రిటిష్ ప్రబుత్వ పాలనలో దాదాపు ప్రతి పది సంవత్సరాలకు ఒక తీవ్రమైన కరువు ఏర్పడి లక్షలాది మంది ప్రజలు మరణించే వారు 1943 లో వచ్చిన బెంగాల్ కరువు దాదాపు 30 లక్షల మంది మృతికి కారణం.
👉 ఆహారధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పిడింది.
👉 తరువాత దేశ విభజన వలన 60% గోధుమ, 40% వరి పండే ప్రాంతాన్ని కోల్పోవడం జరిగింది ఇదే సమయంలో జనాభా మాత్రం కేవలం తగ్గింది 18% మాత్రమే కాబట్టి తీవ్ర ఆహార కొరత ఏర్పడింది.
👉 అమెరికా PL - 480 (Public Law - 480) చట్టం ప్రకారం ఇండియాకు గోధుమ, మొక్కజొన్న ,పాలపిండి ఉచిత సరఫరా చేసింది.PL - 480 ను "Food for Peace' చట్టం అని కూడా అంటారు.
👉 విశ్లేషకులు India పరిస్థితిని అప్పట్లో SHIP TO MOUTH అని వ్యవహరించారు.
👉అమెరికాకు చెందిన నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్, Rock Feller Foundation Ford Founden సహకారాలకో గోధుము పై మెక్సికో దేశంలో ప్రయోగం చేసాడు.
👉నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ పరిశోధనలను Dwart, Semi-Dwarf Technology అంటారు. ఈయన మొక్క ఎత్తు తగ్గించడంలో విజయం సాదించాడు.
👉 జన్యు పరమైన మార్పుల ద్వారా కృతిమ పోషకాలు కృత్రిమ అందిస్తూ పంట పండే కాలం కుదించబడినది.
👉 గోధుమ పరిశోధన జరిపిన తరువాత మొక్క జొన్న మీద పరిశోదన చేసారు.
Green Revolution (GR) చరిత్ర పుటల్లో ....
👉 మెక్సికోలో 1940వ దశకంలో వ్యవసాయ రంగంలో పాత పద్ధతుల స్థానంలో నూతన విధానాలు ప్రవేశపెట్టారు.
👉 ఇవి వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయమైన పెరుగుదలకు దోహదపడ్డాయి.
👉నూతన పద్ధతులు విజయవంతమైన నేపథ్యంలో 1950, 1960వ దశకాల్లో హరిత విప్లవ సాంకేతిక విజ్ఞానం (Green Revolution Technologies) ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
👉 మెక్సికోలోని రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్‌కు చెందిన ఆచార్యులు నార్మన్ బోర్లాగ్‌ను హరిత విప్లవ పితామహునిగా పేర్కొంటారు.
👉1940వ దశకంలో బోర్లాగ్ తన పరిశోధనల ద్వారా వ్యాధిని తట్టుకోగలిగే (Disease resistance) మేలు రకమైన అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడాలను అభివృద్ధి చేశారు.
👉 తద్వారా మెక్సికోలో దేశీయంగా ఉన్న డిమాండ్‌ను అధిగమించి గోధుమ ఉత్పత్తి జరిగింది.
👉బోర్లాగ్ అభివృద్ధి చేసిన గోధుమ వంగడాలను వినియోగిస్తూ యాంత్రీకరణ ప్రవేశపెట్టడం ద్వారా మెక్సికో వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు సాధించింది.
👉 తద్వారా ఈ దేశం 1960వ దశకంలో గోధుమ ఎగుమతిదారుగా రూపొందింది.
నూతన గోధుమ వంగడాలను వినియోగించడానికి ముందు మెక్సికో దేశీయ డిమాండ్‌కు తగినట్లుగా 50 శాతం గోధుమలు దిగుమతి చేసుకునేది.
👉 1940వ దశకంలో అమెరికా దేశీయ అవసరాలకు సుమారు 50 శాతం గోధుమను దిగుమతి చేసుకునేది.
👉 హరిత విప్లవ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం వల్ల 1950వ దశకంలో అమెరికా గోధుమ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడమే కాకుండా 1960వ దశకంలో ఎగుమతిదారుగా అవతరించింది.
👉1950, 1960 దశకాల్లో ప్రపంచ వ్యవసాయ చరిత్రకు సంబంధించి నూతన అధ్యాయం ప్రారంభమైంది.
👉 మెక్సికోకు చెందిన గోధుమ పంట; తైవాన్, సింహాళం (శ్రీలంక), మలేషియాలోని వరి పంట వ్యవసాయ రంగంలో దిగుబడుల చరిత్రను మార్చివేశాయి.
👉ఈ విత్తనాల విప్లవం ఫోర్డ్ ఫౌండేషన్ వారి సూచన మేరకు భారతదేశానికి కూడా వ్యాపించింది.
👉 భారత్‌తో పాటు ఆసియాలోని అనేక దేశాలు ఈ నూతన వంగడాలను వినియోగించి వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకోవడం ప్రారంభించాయి.
👉భారత్‌లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు కూడా కొన్ని కొత్త రకం వంగడాలను, సంకరజాతి విత్తనాలను అభివృద్ధి చేశాయి.
👉నూతన వ్యవసాయిక వ్యూహంలో భాగంగా ఈ అధిక దిగుబడినిచ్చే విత్తనాల వాడకం ద్వారా ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి కృషి చేశారు.
0 Comments