👉 అనంగ్‌పాల్ తోమర్ II ఎవరు ??

 

👉ఏమిటి : అనంగ్‌పాల్ తోమర్ II

👉ఎప్పుడు : ఇటివల

👉ఎవరు : ప్రభుత్వ సదస్సు

👉ఎక్కడ : డిల్లి  

👉ఎందుకు : చరిత్రలో సరైన స్థానం  అనంగ్‌పాల్ II కి ఇవ్వడం కోసం

👉అనంగ్‌పాల్ II: చరిత్రలో సరైన స్థానం పొందాలి ప్రభుత్వ సదస్సు

👉డిల్లి లో ఇటీవల నిర్వహించిన ప్రభుత్వ సదస్సు దీర్ఘకాలంగా మరచిపోయిన తోమర్ రాజు - అనంగ్‌పాల్ II యొక్క వారసత్వాన్ని హైలైట్ చేసింది.

👉8 వ మరియు 12 వ శతాబ్దాల మధ్య ప్రస్తుత డిల్లి  మరియు హర్యానాలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించిన తోమర్ రాజవంశానికి చెందిన ఈయనని  అనంగ్‌పాల్ తోమర్ అని పిలుస్తారు.

👉అనంగ్‌పాల్ తోమర్ II తరువాత అతని మనవడు పృథ్వీరాజ్ చౌహాన్ వచ్చాడు. గురిద్ దళాలు తారైన్ యుద్ధంలో (ప్రస్తుత హర్యానా) పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయిన తరువాత 1192 లో డిల్లి  సుల్తానేట్ స్థాపించబడింది.

👉అనంగ్‌పాల్ తోమర్ II ధిల్లికాపురి స్థాపకుడు, ఇది  చివరికి డిల్లి గా  మారింది. ఇంద్రప్రస్థ జనాభాలో మరియు దాని ప్రస్తుత పేరు డిల్లి కి ఇవ్వడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

👉ఇతను  11 వ శతాబ్దంలో సింహాసనాన్ని అధిష్టించినప్పుడు ఈ ప్రాంతం శిథిలావస్థకు చేరింది; లాల్ కోట్ కోట మరియు అనాంగ్ తాల్ బయోలిని నిర్మించినది అతనే.

👉డిల్లి  విమానాశ్రయంలో అనంగ్‌పాల్ II విగ్రహాన్ని నిర్మించడానికి మరియు .డిల్లి లో ఇతని వారసత్వానికి అంకితమైన మ్యూజియం నిర్మించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సదస్సులో నిర్ణయించారు.

👉ఖిలా రాయ్ పిథోరా అని కూడా పిలువబడే లాల్ కోట్ యొక్క కోట వెంట తవ్వకం ప్రారంభించడానికి ASI పరిశీలిస్తోంది.

👉అనంగ్‌పాల్ II పాలనలో తోమర్ రాజ్యం డిల్లి , హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాలలో విస్తరించింది.

👉తోమర్స్ రాజధాని మొదట్లో అనంగ్‌పూర్ వద్ద ఉన్నప్పటికి తరువాత  అనంగ్‌పాల్ I పాలనలో నుంచి  చివరకు అనంగ్‌పాల్ II పాలనలో చివరికి ధిల్లికాపురి (డిల్లి ) గా మారింది.

Post a Comment

0 Comments

Close Menu