👉 Mankombu Sambasivan కు హరిత విప్లవానికి సంబంధం ఏమి ??

 

👉 ఏమిటి : హరిత విప్లవం

👉 ఎప్పుడు : 1940-70ల మధ్యకాలంలో

👉 ఎవరు : నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ (అమెరికా ) స్వామినాధన్ (ఇండియా)

👉 ఎందుకు : పంటల దిగుబడి ని పెంచడం కోసం.


👉 1940-70ల మధ్యకాలంలో హరిత విప్లవానికి పునాదులు పడ్డాయి.

👉 హరిత విప్లవం వల్ల ప్రపంచవ్యాప్తంగా పంటల దిగుబడి పెరిగింది.

👉 ఈ పెరుగుదల 60 వ దశకం చివరలో ప్రారంభమైంది. హరిత (సస్య) విప్లవానికి పునాదులు వేసిన అమెరికా శాస్తవ్రేత్త నార్మన్ బోర్లాగ్ ఇంకా ముందు చూపుతో మానవాళి కోసం, ఆహార భద్రత కోసం ఆలోచించాడు.

👉1940లో మెక్సికోలో ఆయన పరిశోధనలు ప్రారంభించాడు. క్రిమి దాడులను తట్టుకోగల అధికోత్పత్తి గోధుమ వంగడాలను ఆయన అభివృద్ధి చేశాడు.

👉 బోర్లాగ్ అభివృద్ధి చేసిన గోధుమ రకాలకు, నూతన వ్యవసాయ యాంత్రిక పరిజ్ఞానం జోడించడంతో 1960లో మెక్సికో అత్యధిక గోధుమ ఎగుమతి దేశంగా అభివృద్ధి చెందింది.

👉1961లో భారతదేశంలో దారుణమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రముఖ వ్యవసాయ శాస్తవ్రేత్త, అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రికి సలహాదారు అయిన ఎం.ఎస్.స్వామినాథన్ బోర్లాగ్‌ను భారతదేశానికి ఆహ్వానించారు.

👉 స్వామినాథన్ ప్రపంచంలోని ప్రముఖ వ్యవసాయ శాస్తవ్రేత్తలలో ఒకరు.

👉1960 నుంచి 1982వరకు భారతదేశంలో 'సస్య విప్లవం' విజయవంతం కావడం వెనుక వున్న గొప్ప శాస్తవ్రేత్త.

👉 ఆయన వంగడాల జన్యు సంపదను శోధించటం, రాసి, వారి పెరిగేలా జన్యువులను అభివృద్ధి చేయడం, గోధుమ, వరి, బంగాళా దుంపల పంట దిగుబడి పెరిగేలా చూడటం, చీడ పీడల నుంచి రక్షించడం వంటి రంగాల్లో విశేష కృషి చేశారు.

👉పొట్టి గోధుమ వంగడాన్ని ఆయన భారతదేశానికి పరిచయం చేశారు.అధిక దిగుబడులకు శ్రీకారం చుట్టారు.

👉మన స్వామినాథన్  గారికి 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1972లో పద్మభూషణ్, 1988లో పద్మవిభూషణ్ అవార్డులు వచ్చాయి.

👉అలాగే ఆహార పంటల కొరతను తీర్చినందుకు 1970లో బోర్లాగ్‌కు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. బోర్లాగ్‌ 2009, సెప్టెంబరు 12న తన 95వ ఏట మరణించాడు.

👉నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ హరిత విప్లవ పితామహుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ప్రపంచ వ్యాప్తంగా వందలాది కోట్లమందిని ఆకలి బాధలనుండి, పస్తులనుండి రక్షించిన వాడు. బోర్లాగ్ 1914, మార్చి 25న అమెరికా లోని అయోవాలో ఒక వ్యవసాయ కుటుంబములో పుట్టాడు.

  • పుట్టిన తేదీ: 25 మార్చి, 1914
  • పుట్టిన స్థలం: Cresco, అయోవా, యునైటెడ్ స్టేట్స్
  • మరణించిన తేదీ: 12 సెప్టెంబర్, 2009
  • మరణించిన స్థలం: డల్లాస్, టెక్సస్, యునైటెడ్ స్టేట్స్
  • అవార్డులు: పద్మ విభూషణ్ పురస్కారం, మరిన్ని
  • పుస్తకాలు: Norman Borlaug on World Hunger,...

👉మొన్కొంబు సాంబశివన్(M.S) స్వామినాథన్ భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు. అతనిని భారతదేశంలో "హరిత విప్లవ పితామహుడు" గా పేర్కొంటారు. అతను "ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్" ను స్థాపించి దాని చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు.

  • పుట్టిన తేదీ: 7 ఆగస్టు, 1925 (వయస్సు 95సంవత్సరాలు)
  • పుట్టిన స్థలం: కుంబకోణం
  • పూర్తి పేరు: Mankombu Sambasivan Swaminathan
  • అవార్డులు: ప్రపంచ ఆహార బహుమతి.

👉 సి యస్ గా సుపరిచితులైన చిదంబరం సుబ్రమణ్యం భారత దేశం ఆహారధాన్యాల స్వయం సంవృద్ధి సాధించడంలో దోహదపడ్డారు. కేంద్రప్రభుత్వంలో ఇతనికి వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే భారత దేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ జరిగింది.భారత ప్రభుత్వం 1998లో భారతరత్న పురస్కారంతో సత్కరించింది.

  • పుట్టిన తేదీ: 30 జనవరి, 1910
  • పుట్టిన స్థలం: Pollachi taluk
  • మరణించిన తేదీ: 7 నవంబర్, 2000
  • మరణించిన స్థలం: చెన్నై
  • పుస్తకాలు: Hand of Destiny: Eventful decades, …
  • అవార్డులు: భారతరత్న౧౯౯౮ 


Post a Comment

0 Comments

Close Menu