👉ఏమిటి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఒక మహిళ ??
👉 ఎప్పుడు : ఇటివల
👉 ఎవరు : కొలీజియం
👉 ఎక్కడ : భారత్
👉 ఎందుకు : కొలీజియంలో భిన్నాభిప్రాయాలు..
👉 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఒక మహిళను చూసే అవకాశం వచ్చినట్లే వచ్చి ఆగిపోయింది.
👉 కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్నను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేయ డంలో సర్వోన్నత న్యాయస్థానం కొలీజియంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి.
👉 కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్.ఎ్‌ఫ.నారీమన్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్ ఉన్నారు.
👉జస్టిస్ నాగరత్నను కొలీజియం సిఫార్సు చేసి, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపితే సీనియారిటీ ప్రకారం 2027 ఫిబ్రవరిలో ఆమె ప్రధాన న్యాయమూర్తి అయ్యే వారు.
👉ఆమె పనితీరుపై అభ్యంతరాలు లేనప్పటికీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఉన్న పలువురు సీనియర్లను పక్కన బెట్టాల్సి ఉంటుంది.
👉 ఆ విషయంలోనే కొలీజియంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి.
బుధవారం జరిగిన కొలీజియం సమావేశంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే సుప్రీంకోర్టుకు ఐదుగురు జడ్జిల పేర్లను ప్రతిపాదించగా, ఏ ఒక్కరి పేరునూ కొలీజి యం సభ్యులు ఓకే చేయలేదు.
👉జస్టిస్ ఇందూ మల్హోత్రా రిటైర్ కావడంతో సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఒక మహిళా న్యాయమూర్తే ఉన్నారు.
👉34 మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టులో 5 ఖాళీలున్నాయి.
👉మహిళా న్యాయమూర్తుల్లో కెల్లా సీనియర్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ హిమా కొహ్లీ. ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం లేదు.
👉 1870 - అడా కెప్లీ యునైటెడ్ స్టేట్స్లో లా స్కూల్ నుండి పట్టభద్రుడైన మొదటి మహిళ అయ్యారు; ఆమె చికాగో యూనివర్శిటీ లా స్కూల్ నుండి పట్టభద్రురాలైంది, యూనియన్ కాలేజ్ ఆఫ్ లాకు ముందున్నది, తరువాత దీనిని నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా అని పిలుస్తారు.
👉 కార్నేలియా సొరాబ్జీ భారతదేశంలో మొదటి మహిళా న్యాయవాది. ఈమె అలహాబాదు హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. ఈమె బొంబాయి విశ్వవిద్యాలయం నుండి మొదటి మహిళా పట్టభద్రురాలు.
1889 లో ఈమె ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రం అభ్యసించిన ప్రథమురాలు., ఈమె బ్రిటిష్ విశ్వవిద్యాలయాలలో చదివిన మొదటి మహిళగా కూడా చరిత్ర సృష్టించింది.
👉 మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
👉 భారతదేశంలో హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
న్యాయమూర్తి హిమా కోహ్లీ
0 Comments