ఏప్రిల్ 18 ౨౦౨౧

 

Q.ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట ఎన్నవ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ?


ANSWER : 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు  

 

Q . ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాలను మార్చి 12న తొలుత ఎక్కడ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ?


ANSWER : గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ సమీపంలోని సబర్మతీ ఆశ్రమంలో  

 

Q. దండి మార్చ్‌ ఉత్సవంలో 25 రోజుల్లో 385 కిలోమీటర్ల దూరాన్ని నడిచిన ఎంత మంది వలంటీర్లను ఉపరాష్ట్రపతి అభినందించారు ?


ANSWER : 81 మంది వలంటీర్లను  

 

Q. దండి గ్రామం ఎక్కడ ఉంది ?


ANSWER : గుజరాత్‌లోని నవసరీ జిల్లా జలాల్‌పూర్‌ తాలూకాలో దండి గ్రామం ఉంది  

 

Q. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ని జమ్మూకశ్మీర్‌లోని ఏ రైల్‌ లింక్‌ ప్రాజెక్టు ?


ANSWER : ఉధంపుర్‌–శ్రీనగర్‌–బారాముల్లా  

 

Q. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ వంతెన పొడవు ఎంత ?


ANSWER : 1.315 కిలోమీటర్లు.  

 

Q. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ లో ఎ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డిటైలింగ్‌ చేశారు ?


ANSWER : నిర్మాణంలో ‘టెక్లా’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి డిటైలింగ్‌ చేశారు  

 

Q. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) భాగస్వామ్యంతో ఏ సంస్థ ‘కోవాగ్జిన్‌’ అనే కోవిడ్‌–19 టీకాను అభివృద్ధి చేసింది ?


ANSWER : హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ  

 

Q. భారత ఔషధ నియంత్రణ సంస్థ ప్రస్తుత డైరెక్టర్‌ జనరల్‌గా ఎవరు ఉన్నారు. ?


ANSWER : డాక్టర్‌ వీజీ సోమాని  

 

Q. రహదారుల మంత్రిత్వశాఖ 2020 ఏప్రిల్‌ నుంచి 2021 మార్చి వరకూ ఎన్ని కిలోమీటర్ల రహదారుల నిర్మాణం జరిపిందనీ ప్రబుత్వం తెలిపింది ?


ANSWER : 13,394 కిలోమీటర్ల నిర్మాణం  

 

Q. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పడ్‌నా లిఖ్‌నా అభియాన్‌(అక్షరాస్యత కార్యక్రమం) ఎప్పుడు ప్రారంభమైంది ?


ANSWER : ఏప్రిల్‌ 7న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు  

 

Q. పడ్‌నా లిఖ్‌నా అభియాన్‌లో భాగంగా ఎవరికీ విద్య నేర్పుతారు ?


ANSWER : చదువు వయసు దాటిపోయిన 3,28,000 మందికి 40 రోజుల్లో చదవడం, రాయడం నేర్పుతారు.  

 

Q. మెడికల్‌ టెక్నాలజీ రంగంలో ఉన్న యూఎస్‌ దిగ్గజం మెడ్‌ట్రానిక్‌ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఎక్కడ ఏర్పాటు చేసింది ?


ANSWER : హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో.  

 

Q .తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఎక్కడ నుంచి సేవలను కొనసాగిస్తుంది అని కేంద్ర విద్యాశాఖ ఏప్రిల్‌ 7న ఉత్తర్వులు జారీ చేసింది ?


ANSWER : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతీనగర్‌లో  

 

Q. రెండో సబర్మతిగా పేరుగాంచినది నెల్లూరు జిల్లా లోని ఎ ప్రాంతం ?


ANSWER : నెల్లూరు జిల్లా పల్లెపాడులోని పినాకిని సత్యాగ్రహ ఆశ్రమము  

 

Q. నెల్లూరు జిల్లా ముతుకూర్‌ మండంలో ఉన్న కృష్ణపట్నం పోర్టులో అదానీ గ్రూపుకు ఎంత శాతం వాటా ఉంది ?


ANSWER : కృష్ణపట్నం పోర్టులో పూర్తిగా 100 శాతం వాటాను అదానీ గ్రూపు కైవసం చేసుకుంది  

 

Q. వైజాగ్‌ టెక్‌ పార్క్‌ (వీటీపీఎల్‌) పేరిట అనుబంధ సంస్థ ఎవరు ఏర్పాటు చేసారు ?


ANSWER : అదానీ ఎంటర్‌ప్రైజెస్‌  

 




Q. ‘ఈ–గోల్కొండ’ వెబ్‌ పోర్టల్‌ దేనికి సంబందించింది ?


ANSWER : తెలంగాణ రాష్ట్రంలో తయారవుతున్న సంప్రదాయ హస్త కళాకృతులకు ప్రపంచస్థాయి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు  

 

Q. దీనదయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్‌ పురస్కారాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని జాతీయ అవార్డులు లభించాయి ?


ANSWER : 12 జాతీయ అవార్డులు లభించాయి  

 

Q. కోదాడ ఖమ్మం రోడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట అనుబంధ సంస్థను ఎవరు ఏర్పాటు చేసారు ?


ANSWER : అదానీ సంస్థ  

Post a Comment

0 Comments

Close Menu